Posts Tagged ‘milk’

ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

french-omelette-004

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 4 (whites only)

పాలు: 1tbsp

పెప్పర్: 1tsp

పాలక్: 1 sprig (chopped)

మెంతి: 1/2tsp

ఆయిల్: తగినంత

కొత్తిమీర: 1 sprig (chopped)

పుదీనా: 5 (chopped)

ఉప్పు: రుచికి సరిపడా

ఆలివ్ ఆయిల్: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. పచ్చసొనను మీరు వేరే వంటకానికి ఉపయోగించుకోవచ్చు లేదా పడేసేయండి.

3. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న పాలాకు, మెంతి, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

4. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి అయ్యాక అందులో బీటెన్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి రెండు నుండి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5. మూడు నాలుగు నిముషాల తర్వాత ఆమ్లెట్ ను ఫోల్డ్ లేదా రోల్డ్ చేసి మరి రెండు నిముషాలు ఫ్రై చేయాలి. అంతే ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్ ను ఫ్రెగా కట్ చేసిన టమోటో, లేదా కీరకాయ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది.

సమ్మర్‌లో ఆయిల్ స్కిన్ నివారించడానికి సులభ చిట్కాలు…

download (18)

– పాలు, గుడ్డులోని తెల్లసొన, క్యారెట్‌ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించినట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

– మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డుతత్వం తొలగిపోతుంది.

కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్‌, పెరుగు మరియు బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.

బాదుషా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (20)

కావల్సిన పదార్థాలు:

మైదా: 3cups

బట్టర్ : 1/2cup

బేకింగ్ పౌడర్: 1tsp

బేకింగ్ సోడ: 1చిటికెడు

పాలు: 1cup

పంచదార: 2కప్పులు

డ్రై కోకనట్ (తురుముకోవాలి): గార్ణిష్ కోసం కొద్దిగా

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3కప్పుల మైద మరియు 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులోనే బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

3. 10 నిముషాల తర్వాత పిండిలో కొద్దిగా తీసుకొని బాల్ షేప్ చేసుకోవాలి. లేదా ట్రైయాంగిల్ షేప్ లో చుట్టుకోవచ్చు.

4. ఇలా అన్ని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాచాలి.

5. ఇప్పుడు కాగుతున్న నూనెలో రౌండ్ గా చుట్టి పెట్టుకొన్న మైదా పిండిని (పచ్చిబాదుషాను) వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. అంతలోపు మరో పాన్ స్టౌ మీద పెట్టి 3-4 కప్పుల నీళ్ళు పోసి రెండు కప్పుల పంచదార వేసి బాయిల్ చేయాలి.బాగా మరిగిస్తుంటే, షుగర్ సిరఫ్ చిక్కగా రెడీ అవుతుంది .

7. ఇప్పుడు నూనెలో వేగించుకొన్న బాదుషాలను షుగర్ సిరఫ్ లో వేయాలి. తర్వాత వాటి మీద డ్రై కోకనట్ పౌడర్ గార్నిష్ చేయాలి . అంతే ఈ ఫెస్టివల్ సీజన్ లో వేడిగా లేదా చల్లగా బాదుషాను సర్వ్ చేయవచ్చు.

ఆరోగ్యానికి, అందానికీను… నెయ్యి మేలు…

images (85)
సువాసనలు వెదజల్లే నెయ్యి ఆహారంలో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడి చేసి, చిట్లిన జుట్టుకు రాసుకోవాలి. ఓ గంట తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. పొడిబారిన చర్మం ఉన్న వాళ్లకి నెయ్యి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
పెదవులు బాగా పొడిబారినప్పుడు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి. ప్రతి రోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది.
నెయ్యి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. స్నానం చేయడానికి ముందు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవలసిన అవసరం ఉండదు. నిద్ర సరిపోకపోవడం వలన కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. పడుకునే ముందు కళ్ల చుట్టూ ఉండే బాగాన్ని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు చాలా త్వరగా పోతాయి.
కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కలు గోరువెచ్చని నెయ్యి కలిపి, ఆ నూనెను మాడుకు మసాజ్ చేయాలి. తరువాత జుట్టుకు రాసుకోవాలి. పావు గంట తర్వాత తలస్నానం  చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన జుట్టును మృదువుగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.

తులసి ఆకులు, పాలు కాంబినేషన్‌లో దాగున్న పవర్‌ఫుల్ బెన్ఫిట్స్…

download (1)

తయారు చేసే విధానం: 3 లేదా 4 తులసి ఆకులు తీసుకుని శుభ్రం చేయాలి. మరిగిన పాలల్లో కలపాలి. వాటిని ఒక కప్పులో తీసుకుని ప్రతి రోజు ఉదయం పరకడుపున తీసుకోవాలి. అంతే ఈ సింపుల్ పదార్థంతో ప్రయోజనాలు అమోఘం.

ప్రయోజనాలు:

ఫ్లూ: తులసిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం, పాలల్లో హీలింగ్ ప్రాపర్టీ ఉండటం వల్ల ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫ్లూ వంటి లక్షణాల నుంచి వెంటనే బయటపడవచ్చు.

గుండె ఆరోగ్యానికి: తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హార్ట్‌ని హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండటానికి సహాయపడుతాయి. పాలు గుండెకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. ఈ రెండింటి మిశ్రమం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఒత్తిడి తగ్గడానికి: వేడి పాలు, తులసి కలిపి తీసుకోవడం వల్ల నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతుంది.

కిడ్నీ స్టోన్స్: తులసి ఆకులు, పాలు కాంబినేషన్ కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించి, డెటాక్సిఫై చేస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో స్టోన్స్ కరిగిపోతాయి.

క్యాన్సర్: పాలు, తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యున్ సిస్టమ్ బలంగా మారుతుంది. ఎలాంటి క్యాన్సర్ అయినా దరిచేరకుండా నివారించే శక్తి ఉంటుంది.

శ్వాస సంబంధ సమస్యలు: వేడి పాలు, తులసి ఆకుల కాంబినేషన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, వాపు, కామన్ కోల్డ్, పొడి దగ్గు నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఈ డ్రింక్.

తలనొప్పి నివారణకు: చాలా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ తులసి, పాలు కలిపి ఒక గ్లాసు తాగండి. వెంటనే తలనొప్పి తగ్గడాన్ని మీరు గమనిస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల నొప్పి దూరమవుతుంది.

పెసరపప్పు పాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం…శ్రావణ మాసం స్పెషల్…

images

కావల్సిన పదార్థాలు:

పెసరపప్పు: 2 cup

కొబ్బరి – 1 cup

బెల్లం – 1 cup

యాలకలు – 4 to 5

పాలు –  2 cup

ఎండు ద్రాక్ష – 10

జీడిపప్పు – 10

నెయ్యి:- 5 tbsp

1. ప్రెజర్ కుక్కర్లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో పెసరపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

2. . తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పుకు మూడు కప్పుల నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. మరో పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ కలియబెడుతుండాలి. ఈ బెల్లంను నీళ్ళను స్టౌ మీద పెట్టి కొద్ది సమయం ఉడికించి తర్వాత క్రింద దింపుకొని చల్లార్చుకోవాలి.

4. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుము మరియు యాలకలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

5. తర్వాత కుక్కర్ లో ఆవిరి తగ్గి చల్లబడిన తర్వాత మూత తీసి అందులో బెల్లం మిశ్రమం మరియు కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి.

6. అలాగే ఇందులో రెండు కప్పుల పాలు పోసి మిక్స్ చేయాలి.

7. మరో చిన్న పాన్ లో నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వేగించుకొని తర్వాత పెసరపప్పు కుక్కర్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే హాట్ అండ్ టేస్టీ మూగ్ దాల్ స్వీట్ రిసిపి రెడీ.

కోవా కోకనట్ బర్ఫీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

images (72)

కావల్సిన పదార్థాలు:

కొబ్బరి (తురుము) – 1 cup

కోవ – 1 cup

పాలు – 1 cup

మిల్క్ పౌడర్ – 1tbsp

షుగర్ -1cup

యాలకలు – 1/4 tbsp

నెయ్యి – 4 to 5tbsp

తయారుచేయు విధానం:

1. పాన్ లో నెయ్యి, కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత మరో పాన్ లో కోవ మరియు ఒక కప్పు షుగర్ వేసి మిక్స్ చేస్తూ కరిగించాలి.

3. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కొబ్బరి తురుము మరియు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.

4. ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.

5. ఇప్పడు పాన్లో ఉడుకుతున్న మిశ్రమాన్ని వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.

6. కొద్దిగా చల్లారిన తర్వాత చేతిలోనికి నిమ్మకాయంత తీసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. లేదా చాకుతో చతురస్రాకారంలో మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. అంతే కోవ కోకనట్ బర్ఫీ రెడీ.

ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (62)

కావల్సిన పదార్థాలు :

మష్రుమ్(పుట్టగొడుగులు) : 1cup(మష్రుమ్ ను తరుముకోవాలి. లేదా సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ఎగ్ వైట్ : 4

పెప్పర్ : 1/2tsp

పాలు : 1tbps

ఆలివ్ ఆయిల్ : 1tsp

ఓరిగానో : 1/2tsp

చీజ్ : 1/2cube(గార్నిష్ కొరకు)

కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం :

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న మష్రుమ్, కొత్తిమీర, అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

3. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.

5. ఇప్పుడు మష్రుమ్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.

6. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి.

8. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ రెడీ. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బటర్ ఫేస్ ప్యాక్…

images (21)

బటర్ – పాలు : ఆయిల్ స్కిన్ కు ఉత్తమ మార్గం బటర్ ఫేస్ ప్యాక్. ఒక బౌల్ మిల్క్ లో కొద్ది బటర్ మిక్స్ చేసి , ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బటర్ – పెరుగు : బటర్ ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

బటర్ – బాదం పొడి : గుప్పెడు బాదంను పొడి చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. కొద్ది సమయంలోనే ప్రకాశవంతమైన చర్మఛాయను మీరు పొందవచ్చు.

బనాన & పీనట్ బటర్ మిల్క్ షేక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

banana-milkshake_6765

కావల్సిన పదార్థాలు:

అరటి పండు: 1(చిన్న ముక్కలుగా కట్ చేయాలి)

పీనట్ బటర్: 2tbsp

పాలు : 1cup(బాగా మరిగించి వెన్నతీసిన పాలు)

ఐస్ క్యూబ్స్: 4

ప్రోటీన్ పౌడర్: 1tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా మిక్సీ జార్ లో కొద్దిగా పాలు పోయాలి, తర్వాత అందులోనే అరటిపండును ముక్కలుగా కట్ చేసి వేయాలి.

2. ఈ రెండింటి మిశ్రమంతో రెండు సెకండ్లు గ్రైండ్ చేసుకోవాలి, అరటిపండు పూర్తిగా మెత్తబడే వరకూ బ్లెడ్ చేసుకోవాలి.

3. తర్వాత అందులోనే పీనట్ బటర్, కొద్దిగా పాలు మరియు ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి అన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి.

4. తర్వాత మిక్సీ మూత తీసి అందులో మిల్క్ షేక్ ప్రోటీన్ పౌడర్ వేసి మరో రెండు సెంకడ్లు బ్లెడ్ చేయాలి. ఈ మిల్క్ షేక్ మరీ చిక్కగా ఉంటే మరికొద్దిగా పాలను మిక్స్ చేసుకోవాలి. అంతే బనాన పీనట్ బటర్ మిల్క్ షేక్ రెడి.