Posts Tagged ‘milk’

పళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి…

images (7)

కొన్ని పదార్ధాలని మనమెంతో ఇష్టంగా తింటాం. వాటిల్లో కొన్ని పళ్ళకు హాని చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటి వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే కొన్ని పళ్ళకు మేలు చేసేవి కూడా ఉంటాయి.

పళ్ల ఎనామిల్‌కి హాని చేసే వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు ముందుంటాయి. చిప్స్, తెల్ల బ్రెడ్, పాస్తా మరియు పిజ్జా లాంటివి మరీ తియ్యగా ఉండకపోవచ్చు కానీ తిన్నవెంటనే నోట్లో ఉండగానే చక్కెరగా మారిపోతాయి. వీటిని ఎంత తక్కువగా తింటే మన పళ్ళకు అంత మంచిది.

నిమ్మజాతి పండ్లు, టొమాటోలు మరియు ద్రాక్ష ఆహారంగా తీసుకున్నపుడు పళ్ళను శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

పాలు, పెరుగు, పనీర్ మరియు చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు మరియు లవణాలు పళ్ళ ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియంని అందిస్తాయి.

అలాగే పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయల్ని తరుచూ తీసుకుంటే మంచిది.

గోరు వెచ్చని గ్రీన్ టీ త్రాగడం వలన పళ్ళకు మేలు జరుగుతుంది. అందులో ఉండే పాలి ఫెనాల్స్ బ్యాక్టీరియాను నశింపచేసి దంత క్షయాన్ని అరికడతాయి.

దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీ…

download (4)

రెండు టేబుల్ స్పూన్ల తేనె, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేడి పాలల్లో కలపాలి. ఈ డ్రింక్‌ని ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే దగ్గు, దగ్గు లక్షణాలు పూర్తీగా తగ్గిపోతాయి.

రోజ్ మిల్క్ షేక్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (13)

కావల్సిన పదార్థాలు:

పాలు: 2cups

వెనీల ఐస్ క్రీమ్: 2big scoops

సిరఫ్ కోసం:

పంచదార: 3/4cup (150grms)

నీళ్ళు: 100ml

రోజ్ మిల్క్ ఎసెన్స్: 1tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక చిన్న గిన్నెలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి.

2. మీడియం మంట మీద బాగా మరిగించాలి. పంచదార బాగా కరిగిపోయి, సిరప్ తయారయ్యే ప్పుడు అందులో రోజ్ మిల్క్ ఎసెన్స్ ను జోడించి బాగా మిక్స్ చేయాలి.

3. ఇప్పడు స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్ లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

4. ఇప్పుడు బ్లెండర్ లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది.

5. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.

ఉంగరాల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి చిట్కాలు…

images (53)

పాలు, కొబ్బరి పాలు, తేనె :

పాలు, కొబ్బరి పాలు, తేనె ఈ మూడింటినీ కలిపి వెంట్రుకలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకుంటే వంకీల జుట్టు కాస్తా స్ట్రెయిట్ అవుతాయి.

తీపి కుడుముులు ఎలా తయారు చేయాలో చూద్దాం…

download (5)

కావలసిన పదార్థాలు:

గోధుమ రవ్వ: 1/2kg

బియ్యం పిండి: 1cup

పొట్టు పెసరపప్పు: 1/2kg

బెల్లం తురుము: 1/2kg

పచ్చిపాలు : 1/2ltr

కొబ్బరికాయ : ఒకటి

నెయ్యి: 100grm

యాలకుల పొడి: 1tbsp

మంచినీళ్లు: సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పెసరపప్పుని పొడి చేసి ఉంచాలి, తర్వాత కొబ్బరి తురమాలి.

2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమరవ్వ, పెసరపప్పు పొడి, బియ్యం పిండి, బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులపొడి వేసి బాగా కలపాలి.

3. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని గట్టి ముద్దలాగా చేయాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను అరచేతిలో పెట్టి నాలుగువేళ్లతో కోలగా ఒత్తాలి.

4. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో 20 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి తీయాలి. అంతే అందరూ ఇష్టంగా తినే తీపి కుడుములు రెఢీ…

మ్యాంగో కుల్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

fb2ce5cf-c504-4499-bf6e-9e1ee55938f8

కావల్సిన పదార్థాలు:

పాలు: 3cups

కండెన్స్డ్ మిల్క్: 1/2cup

మామిడి గుజ్జు: 1cup

మిల్క్ పౌడర్: 1/2cup

యాలకులు: 1tsp

పంచదార: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా డీప్ బాట్ వెజల్ తీసుకొని, అందులో పాలు, కండెన్డ్స్ మిల్క్, పంచదార మరియు మిల్క్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి స్టౌ మీద పెట్టి బాగా ఉడికించి కోవాలి.

2. కొదిసేపు బాగా ఉడికిన తర్వాత మంట పూర్తిగా తగ్గించి 15-20నిముషాలు ఉడికించుకోవాలి.

3. ఈ మిశ్రమం ఉడుకుతుండగానే అందులో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

5. ఒక్కసారి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో మామిడి గుజ్జును వేసి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్పీ మౌల్డ్స్ (కుల్ఫీ అచ్చుల్లో)పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. కుల్ఫీ సెట్ అయ్యే వరకూ కనీసం 6-8గంటల సమయం ఫ్రిజ్ లో ఉంచాలి.

7. 8గంటల తర్వాత కుల్ఫీ సెట్ అవ్వగానే ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మౌల్డ్స్ ను కుల్ఫీలను వేరు చేసి, సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో కుల్పీ రెడీ.

చర్మానికి అద్భుతమైన నిగారింపునిచ్చే పాలు…

images (1)

అద్భుతమైన నిగారింపునిచ్చే పాలు:

కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వడంలో పాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు, కొవ్వు తక్కువగా ఉండే ‘లో ఫ్యాట్ మిల్క్’ ను కొద్దిగా ముఖంపై అప్ వర్డ్ స్ట్రోక్స్ తో, పాలన్నీ చర్మంలోకి ఇంకి పోయేలా తేలికగా మసాజ్ చేయ్యాలి. మర్నాడు ఉదయం లేవగానే మైల్డ్ ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కోవాలి. పాలు ముఖంపై ఉండే నల్లటి మచ్చల్ని పోగొట్టడంలో సహాయం చేస్తాయి, అలాగే చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.

బాటిల్ ఫీడింగ్ కంటే బ్రెస్ట్ ఫీడింగ్ సురక్షితమైనది? ఎందుకంటే…

download (9)

బాటిల్ ఫీడింగ్ విషయంలో బాటిల్స్‌ను ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా, బ్యాక్టీరియా దాగి ఉంటుంది. ఇది అప్పుడే పుట్టిన పిల్లల్లో హాని చేస్తుంది. ఇన్ఫెక్షన్స్‌కు గురిచేస్తుంది. అదే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇలాంటి సమస్యలుండవు.

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకు మాత్రమే ఆరోగ్యకరం కాదు, తల్లికి కూడా ఆరోగ్యకరమే. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లి క్రమంగా, వేగంగా బరువు తగ్గుతుంది.

ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పిల్లలు పాలు తాగితే పాలతో పాటు గాలికూడా కడుపులోకి చేరుకుంటుంది. తద్వారా గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడుతాయి. బాటిల్ పాలు తాగే పిల్లలు మదర్ ఫీడ్‌కు దూరమవుతారు. పాల బుడ్డీల కంటే గ్లాసుల ద్వారా పిల్లలకు పాలు పట్టించడం మంచిది.

బాటిల్ ఫీడింగ్ వల్ల, వివిధ రకాల ఫీడింగ్ బాటిల్స్‌ను ఉపయోగించడం ద్వారా పెదవులు, దంతాలు, నోటి అమరికలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

బాటిల్ పీడింగ్ తల్లులు బిడ్డకు దూరమవుతారు. దాంతో బిడ్డ యొక్క ఫీలింగ్స్ తెలియవు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకు తల్లి స్పర్శతో పాటు అనుబంధం బలపడుతుంది.

చర్మం తరచూ పొడబారిపోతుంటే సోయాపిండి, తేనె, పాలు కలిపి ముఖానికి ప్యాక్‌…

images (35)
చర్మం తరచూ పొడబారిపోతుంటే సోయాపిండిలో కొంచెం తేనె, కొద్దిగా పాలు కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారినికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గ్లోయింగ్ స్కిన్ కోసం క్యారట్, పాలతో ఫేస్‌పాక్…

images (7)

క్యారట్, పాలు కలిపిన మిశ్రమంలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోని కణాలకు పోషణ అందిస్తుంది. అలాగే చర్మాన్ని హెల్తీగా, గ్లోయింగ్‌గా మారుస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తూ ఉండండి.

క్యారట్, పాలు మిశ్రమం మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది.

పాలు, క్యారట్ రెండు చర్మానికి నూతనోత్తేజాన్నిస్తాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. స్కిన్ ఎలాస్టిసిటీ పెంచి యంగ్ లుక్‌ని అందిస్తుంది.

క్యారట్లలో ఉండే విటమిన్ C, పాలల్లో ఉండే హైడ్రేటింగ్ నేచర్ చర్మానికి మాయిశ్చరైజర్‌ని, కాంప్లెక్షన్‌ని అందిస్తాయి. అలాగే ఎల్లప్పుడూ సాఫ్ట్‌గా ఉంచడం వల్ల పొడిబారిన చర్మం నుంచి బయటపడవచ్చు.

క్యారట్స్, మిల్క్ కాంబినేషన్ న్యాచురల్ సన్ స్క్రీన్‌లా పనిచేస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే హానికారక యువీఏ, యువీబీ కిరణాల నుంచి రక్షణ కల్పించి చర్మ సమస్యలను, ట్యాన్, పిగ్మెంటేషన్‌ను నివారిస్తుంది.