Posts Tagged ‘mushroom’

డీప్ మష్రూమ్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (100)

కావలసిన పదార్థాలు:

మష్రూమ్స్: 2cups

చింతపండు: కొద్దిగా(నీళ్లలో నానబెట్టాలి)

ఉప్పు: రుచికి తగినంత

గరంమసాలా: 1tsp టీ స్పూను

శనగపప్పు: 1tbsp

మిరియాల పొడి: tsp

నూనె: 2tsp

ఆవాలు: 1/2tsp

ఎండుమిర్చి: 2

కొత్తిమీర: కొద్దిగా

ఉల్లిపాయ: 1ముక్కలుగా కట్ చేసుకోవాలి

టొమాటో ముక్కలు: 1/2cup

కరివేపాకు: 2 రెమ్మలు

తయారు చేయు విధానం:

1. ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి.

2. తర్వాత పాన్ లో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి.

3. ఇప్పుడు పాన్‌లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి.

4. అలాగే మష్రూమ్‌ ముక్కలు కూడా వేసి, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి.

5. తర్వాత చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి.

6. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. అంతే డీప్ మష్రుమ్ కర్రీ రెడీ.

ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (62)

కావల్సిన పదార్థాలు :

మష్రుమ్(పుట్టగొడుగులు) : 1cup(మష్రుమ్ ను తరుముకోవాలి. లేదా సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ఎగ్ వైట్ : 4

పెప్పర్ : 1/2tsp

పాలు : 1tbps

ఆలివ్ ఆయిల్ : 1tsp

ఓరిగానో : 1/2tsp

చీజ్ : 1/2cube(గార్నిష్ కొరకు)

కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం :

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న మష్రుమ్, కొత్తిమీర, అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

3. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.

5. ఇప్పుడు మష్రుమ్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.

6. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి.

8. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ రెడీ. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

చీజ్ మష్రుమ్ పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

mushroompak-1

చీజ్(జున్ను): 1/3 cup(తురుము కోవాలి)

పుట్టగొడుగులను : 15 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిరపకాయలు : 4 (చిన్న ముక్కలుగా తరగాలి)

వెల్లుల్లి : 4 (పేస్ట్ చేయాలి)

శెనగపిండి : 1/3

కార్న్ ఫ్లోర్ : 2tbsp

బేకింగ్ సోడా : ½tsp

బ్రెడ్ ముక్కలు : 1cup

నల్ల మిరియాలు : ½tbsp

ఉప్పు: రుచికి సరిపడా

వేయించడానికి నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా ఇక బౌల్ తీసుకొని అందులో చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్ మరియు పచ్చిమిర్చి వేసి, బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత మరో గిన్నె తీసుకొని అందులో శెనపిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా, నూనె వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

3. తర్వాత మష్రుమ్ కాడలు తీసేసి, ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్న చీజ్ మిశ్రమాన్ని అందులో ఫిల్ చేయాలి.

4. ఇప్పుడు శెనగపిండి, కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో డిప్ చేసి, బ్రెడ్ పొడి దొర్లించి, కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చీజ్ మష్రుమ్ పకోడా రెడీ. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.

స్పైసీ మష్రూమ్ మంచూరియన్ ఎలా తయారుచేయాలో చూద్దాం… స్టార్టర్స్ రిసిపి…

download (58)

కావలసినపదార్థాలు:

కార్న్‌ఫ్లోర్ – 5tbsp

మైదా పిండి – 2tbsp

తాజా మష్రూమ్స్ – 1/2kg

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1tsp

సోయా సాస్ – 1tsp

నూనె – తగినంత

ఉప్పు – తగినంత

వేయించడానికి:

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1tsp

పచ్చిమిర్చి తరుగు – 1tsp

ఉల్లి తరుగు – 1/2cup

ఉల్లికాడల తరుగు – 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

నూనె – 2 tbsp

సోయా సాస్ – 1tsp

చిల్లీ సాస్ – 1tsp

టొమాటో కెచప్ – 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. మష్రూమ్‌లను మురికి పోయేలా శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబెట్టి, తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. (ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండాలి)

2. తర్వాత ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, అర టీ స్పూను సోయా సాస్, ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలపాలి.

3. మష్రూమ్ ముక్కలు జత చేసి కలపాలి.

4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడిఅయ్యాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీల మాదిరిగా వేయాలి. (కొద్దిగా బంగారు వర్ణంలోకి మారగానే తీసేయాలి. లేదంటే మాడిపోతాయి). ఇలా అన్నీ తయారుచేసి, పక్కన ఉంచాలి.

5. వెడల్పాటి పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి.

6. అందులోనే టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, వేయించిన మంచూరియాలు వేసి బాగా కలిపి, ఉల్లికాడల తరుగు వేసి మరో మారు కలపాలి.

7. అన్నీ బాగా కలిసినట్లు అనిపించగానే మంట ఆర్పేసి, టొమాటో సాస్‌తో వేడివేడి మష్రూమ్‌లు అందించాలి.

మష్రూమ్- పన్నీర్ టిక్కా మసాలా ఎలా తయారుచేయాలో చూద్దాం…

Sushils-Paneer-Tikka-Masala

కావలసిన పదార్ధాలు:

మష్రూమ్- 4

పన్నీర్ ముక్కలు -1 cup

పెరుగు – 1 cup

జిలకర్ర – 1tsp

అల్లం- 10grm

ఉల్లిపాయలు -2

పచ్చిమిరప – 4

కరివేపాకు – 2 రెమ్మలు

క్యాప్సికమ్ – 1 cup

బటానీ – 1 cup

పసుపు – చిటికెడు

కారం – 1tsp

దనియా- 1tsp

ఉప్పు – రుచికి సరిపడా

కాజు పౌడర్ – 2 tsp

టమోటో పేస్ట్ – 1 cup

పొదీనా – 2 కొమ్మలు

గరం మసాలా- 1tsp

తయారు చేయు విధానం:

మొదట ఒక గిన్నెలో నీరు పోసి స్టౌ మీద పెట్టి అందులో మష్రూమ్ ముక్కలను వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న పన్నీరు ముక్కలు వేసి దోరగా వేపి పక్కన పెట్టుకోవాలి.

అయిల్ ఉన్న పాన్ లోనే ఉడికించిన మష్రూమ్ ని వేసి వేపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత జిలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి.

– తర్వాత క్యాప్సికమ్, బటానీ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీరు ముక్కలు వేసి అన్నింటిని బాగా ప్రై చేయాలి. వేగాక కొద్దిగా కారం, దనియా పొడి, ఉప్పు, కాజు పొడి, పొదినా, టమోటో పేస్ట్ వేసి ప్రై చేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత గరం మసాలా చేర్చి దింపుకొని కొత్తిమిర తురుము చల్లి చపాతి, పూరీ తో వడ్డించండి.