Posts Tagged ‘mutton’

రంజాన్ స్పెషల్ బటర్ ఖీమా మసాల రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

butter-kheema

కావల్సిన పదార్థాలు:

బీఫ్ లేదా మటన్: 1kg

పెరుగు: 1cup

బటర్: 1cup

అల్లం పేస్ట్: 3tsp

వెల్లుల్లి పేస్ట్ : 3tsp

ఉల్లిపాయలు: 3పీసెస్

లవంగాలు: 5-7

దాల్చిన చెక్క: 1

బ్లాక్ యాలకలు: 2

గ్రీన్ యాలకలు: 2

పచ్చిమిర్చి: 8

బిర్యానీ ఆకు: 1

ఉప్పు: రుచికి సరిపడా

కారం: 3tsp

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్ని టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

5. ఈ కీమా మిశ్రమానికి బటర్ జోడించి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమానికి ముందుగా తయారుచేసుకొన్న మసాలా మిశ్రమం మిక్స్ చేయాలి.

7. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి, తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి.

8. తర్వాత అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించి, పెరుగు వేసి ఖీమా మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మరియు ఎండు మిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ ఖీమా మసాలా రెడీ. దీన్ని నాన్ మరియు చపాతీతో సర్వ్ చేయాలి.

హైదరాబాది కచ్చి గోష్ట్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (6)

కావాల్సిన పదార్థాలు :

మటన్: 1kg

బాస్మతి రైస్: 1kg

పెరుగు: 200grms

లెమన్ జ్యూస్: 3tsp

మసాలా దినుసులు: 20grms

చిల్లీ పౌడర్: 2tsp

ధనియాల పౌడర్: 3tsp

జింజర్ గార్లిక్ పేస్ట్: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

గరం మసాలా: 11/2tsp

నూనె: సరిపడా

ఫ్రైడ్ ఆనియన్: 1cup

తరిగిన కొత్తిమిర: 1/2cup

తరిగిన పుదీనా: 1/2cup

బే లీవ్స్: 1

వెన్న: 150grms

నీళ్ళు: 5ltrs.

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక కేజీ మాసం తీసుకుని అందులో లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొతిమిర, పుదీనా, ధనియాల పౌడర్, నూనె కలిపి రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి.

2. తర్వాత 5 లీటర్ల నీటిని ఒక బౌల్‌లో తీసుకుని 25 నిమిషాల పాటు మరగబెట్టాలి.

3.తరువాత ఇందులో పైన సూచించిన మోతాదులో ఉప్పు, 10గ్రా. గరం మసాలా, బేలీవ్స్ కలపాలి.

4. ఇప్పుడు గంటపాటు నాన బెట్టిన బాస్మతి రైస్‌ని మరగించిన నీటికి కలపాలి. ఇప్పుడు సగం బిర్యానీ తయారు అయినట్లే.

5. ఈ రైస్‌ని తీసుకుని పైన సూచించిన విధంగా బాగా నాన బెట్టిన మటన్‌పై వేయాలి. రైస్ పైన వెన్న, గార్లిక్ కలపాలి. ఇలా తయారైన బిర్యానీపై మూత ఉంచి గోధుమపిండితో మూతను సీల్ చేయాలి(ఆవిరిబయట పోకుండా)20-25 నిమిషాల పాటు గ్యాస్‌ని సిమ్‌లో ఉంచి ఉడకబెట్టాలి.

6. తరువాత మూతపై 20 నిమిషాల పాటు వేడి వేడి నిప్పులు పోయాలి. తరువాత మూత తీస్తే ఘుమ ఘుమలాడే బిర్యానీ మనకు నోరూరిస్తుంది. దీనికి తరిగిన కొతిమిర, పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, మిర్చీ ముక్కలు కలపాలి.

7. అంతే మనకు కావల్సిన కచ్చి గోషి బిర్యానీ తయారైంది. ఇలా వేడి వేడిగా ఉన్న బిర్యానీని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రతని పెంచుకోవడానికి మటన్ బోన్ సూప్…

images (62)
మటన్ బోన్ సూప్ తాగడం ద్వారా బాగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. బోన్ సూప్‌లో గ్లైసిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది బాగా నిద్రపట్టడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి గ్రేట్‌గా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఎముకల సూప్ త్రాగడం వల్ల మీరు శారీరకంగా మరియు మెంటల్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా వీక్ గా ఉన్నవారికి ఈ సూప్ ను అందిస్తే చాలా త్వరగా తేరుకుంటారు. బోన్ సూప్‌లో మినిరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడేవారికి ఈ బోన్ సూప్ చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది.
బోన్ సూప్‌లో క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది ఎముకలను హెల్తీగా ఉంచుతుంది . మరియు ఎముకల నుండి క్యాల్షియం తగ్గిపోకుండా కాపాడుతుంది.

మటన్‌ హలీమ్‌ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (6)

కావలసిన పదార్థాలు:

గోధుమలు : 200grm

బోన్‌లెస్‌ మటన్‌ : 300grm

నెయ్యి : 100grm

ఉల్లిగడ్డలు : 3

నిమ్మకాయ: 2

గరం మసాలా : 2tbsp

ఉప్పు : రుచికి సరిపడినంత

పచ్చిమిర్చి : 20grm

అల్లం : చిన్న ముక్క

వెల్లుల్లి : 7 రెబ్బలు

కొత్తిమీర : చిన్న కట్ట

జీడి, బాదం పప్పులు : సన్నగా కట్‌ చేసుకున్నవి

తయారు చేసే విధానం:

1. ముందుగా గోధుమలు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి.

2. తర్వాత పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరువాత మటన్‌ని శుభ్రం గా కడగాలి. అం దులో గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మిర్చీ పేస్టును కలిపి గంట పాటు పక్క న వుంచాలి.

3. బాగా నానిన గోధుమలు, మటన్‌ మిశ్రమానికి కలిపి తగినంత ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని పప్పుగుత్తిలాంటి దాంతో అప్పుడ ప్పుడూ కలుపుతూ మెత్తగా అయ్యేలా చెయ్యాలి.

4. ఒక పాత్ర తీసుకుని అందులో నెయ్యివేసి వేడి చేయాలి. జీడిప ప్పు, బాదం పప్పులను అందులో వేసి వేయించి తీయాలి.

5. తరువాత అందులో తరిగిన ఉల్లిగడ్డలు వేసుకొని బం గారు రంగు వచ్చేవరకు వేయించు కోవాలి. దీనిలోనే గరంమసాలా కూడా వేసుకోవాలి.

6. తరువాత మెత్తగా ఉడకబెట్టుకున్న హలీమ్‌ మిశ్ర మాన్ని ఇందులో వేసుకుని సన్నని మంట పై ఉంచాలి. కొద్దిసేపటికి నెయ్యి పైకి తేలుతుంది. అప్పుడు దించేసుకోవాలి. అంతే రంజాన్ స్పెషల్ మటన్ హలీమ్ రెడీ

మటన్ డ్రమ్ స్టిక్స్ దాల్చా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (12)

కావల్సిన పదార్థాలు:

మసూర్ దాల్(ఎర్రకందిపప్పు): 100grms

శెనగపప్పు: 50grms

ఆవాలు: 1tsp

లవంగాలు: 4

దాల్చిన చెక్క:2

వెల్లుల్లిపాయ: 1

మాంసం: 1Kg

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp

కరివేపాకు: రెండు రెమ్మలు

ఎండు మిర్చి : 10

మునగకాయలు: 2

పుదీనా తురుము: 2tsp

మామిడికాయపొడి: 2tsp

కారం: 1tsp

పసుపు: 1tsp

నెయ్యి: 50grms

మటన్ స్టాక్: 1ltr

ఉప్పు: సరిపడా

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి, తర్వాత కుక్కర్ లో వేసి నీళ్ళు పోసి మీడియంగా ఉడికే వరకూ 2విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ నీళ్ళనే మటన్ స్టాక్ గా వాడాలి.

3. అంతలోపు ఎర్రకందిపప్పు, శెనగపప్పు కడిగి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి.

4. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అందులో అల్లంవెల్లుల్లి, మటన్ ముక్కలు, నానబెట్టిన పప్పులు, మునగకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

5. పచ్చివాసన పోయే వరకూ వేగిన తర్వాత అందులో మటన్ స్టాక్ పోసి మటన్ ముక్కలు పూర్తిగా ఉడికే వరకూ ఉంచాలి.

6. మరో పాన్ లో నూనె వేసి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.

7. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగాక ఉడికించిన మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపి దింపుకోవాలి.

8. చివరగా మామిడికయ పొడి, మిగిలిన నెయ్యి, పుదీనా తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే మటన్ డ్రమ్ స్టిక్ దాల్చా రెడీ.

మటన్ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (3)

కావలసిన పదార్దాలు:

బోన్‌లెస్ మటన్ : 500grms

తరిగిన ఉల్లిపాయలు : 1cup

కారం : 1tsp

ఉప్పు : రుచికి సరిపడా

పసుపు : 1/4tsp

అల్లం వెల్లల్లి పేస్టు : 2tbsp

బఘార్ కోసం కావలసినవి:

నూనె : 2tbsp

జీలకర్ర : 1tsp

కరివేపాకు

కొత్తిమీర

పుదీనా

పచ్చిమిర్చి : 4

మిరియాల పొడి : 1/2tsp

గరం మసాల పౌడర్ : 1/2tsp

నిమ్మరసం : 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై పాన్ పెట్టి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి(మధ్యలో కత్తిరించినవి)లను వేసి ఒక రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియబెట్టాలి.

4. ఈ మిశ్రమం మొత్తం ఫ్రై అవుతుండగా, అందులోనే మిరియాల పొడి, గరం మసాల పొడి నిమ్మరసం వేసి బాగా కలిపి మరో 5నుండి 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. ముక్కలు బాగా వేగాయని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి.

హైదరాబాదీ గోస్ట్ మసాలా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

కావల్సిన పదార్థాలు:

తాజా వేట మాంసం(మటన్): 500grm

పెరుగు: 1cup

మిరియాలు: 3tbsp

ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)

వెల్లులి రెబ్బలు: 5

అల్లం కొద్దిగా: చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి

పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగినవి)

పెప్పర్ కార్న్స్: 10

లవంగాలు: 5

ఏలకలు: 4

లవంగపట్టు బద్దలు: 2

జీలకర్ర :1tsp

పలావ్ ఆకు: 1

కారం: 1tsp

జీలకర్ర పొడి: 2tsp

నూనె: 4tbsp

ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసుకునే విధానం:

1. ముందుగా శుభ్రం చేసుకున్న మటన్, పెరుగు, కారం, జీలకర్ర పొడి, మిరియాలు లేదా పొడి, ఉప్పును ఒక పాత్రలోకి తీసుకుని బాగా మిక్స్ చేసి రెండు గంటలు పాటు నానబెట్టకోండి.

2. తర్వాత పాన్‌లో నూనె పోసి వేడైన తరవాత పలావ్ ఆకు, జీలకర్ర, పెప్పర్ కార్న్, లవంగాలు, ఏలకలు, లవంగపట్టు బద్దలను వేసి నిమిషం పాటు వేయించండి.

3. అనంతరం సన్నగా తరిగిపెట్టకున్న ఉల్లిముక్కలను మెల్లగా పాన్‌లోకి జారవిడువండి. అవి బంగారం రుంగులో వేగాక వెల్లులి రెబ్బలతో పాటు అల్లాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.

4. ఇప్పుడు నానబెట్టిన మిశ్రమాన్ని పాన్‌లో వేసి మిశ్రమం కలిసేలాగా గరెటితో తిప్పండి. 8 నిమిషాలు పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత, ప్రెషర్ కుక్కర్‌లోకి మార్చండి.

5. ఈ మిశ్రమానికి రెండు కప్పుల నీటిని జోడించి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ వేడి వేడి గోస్ట్ మాషాలాను అన్నంలోగాని, బిర్యానిలోగాని కలుపుకుని తింటే ఆ రుచే వేరు, ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానం తెలుసుకున్నారుగా ఒక సారి ట్రై చేస్తే పోలా.

మటన్ ఎగ్ కబాబ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

966238081

కావల్సిన పదార్థాలు:

బోన్ లెస్ మటన్: 300grms

అల్లంవెల్లుల్లి పేస్ట్: 1/2tsp

పచ్చిమిర్చి: 4

గరం మసాలా: చిటికెడు

బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp

పెరుగు: 1/2cup

ఉప్పు: రుచికి సరిపడా

పచ్చిబొప్పాయి తురుము: 2tsp

నిమ్మకాయ:

1 కొత్తిమీర: ఒక కట్ట

కోడిగుడ్లు: 3

మిరియాల పొడి: 1/2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2. ఇప్పుడు ఇలా గ్రౌండ్ చేసిన మటన్ ను ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చితరుగు, గరం మసాలా, బొప్పాయి తురుము వేసి కలపాలి.

3. అందులోనే తగినంత ఉప్పు, పెరుగు, నిమ్మరసం, తురిమిన కొత్తిమీర వేసి మిశ్రమాన్నంతటిని బాగా మెత్తగా కలుపుకోవాలి.

4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేస్తూ ఒక్కో ఉండనూ చిన్నగా ఒత్తి, పాన్ మీద వేసి అటు, ఇటు రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని (ఉండలన్నింటిని )కాల్చుకోవాలి.

5. తర్వాత కోడిగుడ్ల సొనలో ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి గిలకొట్టి ఓ గరిటెడు మిశ్రమాన్ని పెనం మీద పలుచని ఆమ్లెట్ లా వేయాలి.

6. ఇప్పుడు అందులో ముందుగా కాల్చిపెట్టుకొన్న మటన్ కబాబ్ ను పెట్టి, దాన్ని ఆమ్లెట్ తో మూసేసి, రెండు వైపులా బాగా కాల్చుకొని, ఒక సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి. ఇలా అన్ని కబాబ్ లను తయారు చేసుకోవాలి. అంతే వేడివేడి అండా కబాబ్ రెడీ.

ఆంధ్ర స్టైల్ ఆలూ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం…

images (99)

కావలసిన పదార్థాలు:

బంగాళదుంప: 2(పొట్టతీసి కట్ చేసుకోవాలి)

మటన్: 1kg

ఉల్లిపాయ: 3-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)

చెక్క: చిన్న ముక్క

యాలకులు: 4-5

బిర్యాని ఆకు: 2

పచ్చిమిర్చి: 4-5

పసుపు: 1/4tsp

ఉప్పు: రుచికి తగినంత

నూనె: 4tbsp

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp

టమోటో :4-5(గుజ్జులా తయారు చేసుకోవాలి)

కారం: 1tsp

ధనియా పౌడర్: 11/2 tbsp

గరం మసాలా పౌడర్: 1 1/2 tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, మటన్ పీసెస్స్, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యాని ఆకులు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఒక కప్పు నీళ్లు ప్రెజర్ కుక్కర్లో వేసి మూత పెట్టి 25-30నిమిషాల పాటు ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.

2. తర్వాత కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే టమోటో గుజ్జ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.

3. ఇప్పుడు అందులోనే కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా వేసి బాగా వేయించాలి. మసాలా అంతా వేగుతూ నూనె పైకి తేలుతుంది అప్పుడు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప వేసి బాగా కలపాలి.

4. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న మటన్ మిశ్రమాన్ని కడాయిలోకి వంచుకోవాలి. ఈ మొత్త మిశ్రమాన్ని మరో పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నీళ్ళు కావాలనుకుంటే కొద్దిగా పోసుకోని బంగాళదుంప మొత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.

5. అందులోనే రుచికి తగినంత ఉప్పు, మరికొంచెం గరం మసాలా, బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి, సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని హాట్ హాట్ గా రైస్, చపాతి లేదా రోటీ లతో సర్వ్ చేయాలి . అంతే ఆలూ మటన్ రెడీ.

వెరైటీ స్పైసీ మటన్ గ్రేవీని ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (73)

కావల్సిన పదార్థాలు:

మటన్- 1/2 kg (chopped)

బట్టర్ – 1/2 cup

గరం మసాలా – 1 teaspoon

కొత్తిమీర – 1 teaspoon

కారం – 1 teaspoon

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 teaspoon

పెప్పర్: 1tbsp

పచ్చిమిర్చి – 5 to 6

సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 1 cup

నిమ్మరసం – 1 teaspoon

నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా బౌల్ తీసుకొని అందులో గరం మసాలా, ధనియాలపొడి, కారం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

2. ఇప్పుడు, ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో బట్టర్ వేయాలి. బట్టర్ కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.

3. ఇప్పుడు అందులోనే మటన్ కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత మసాలా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులోనే ఉప్పు కూడా జోడించాలి. తర్వాత నీరు సరిపడా పోయాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా వేసి మిక్స్ చేస్తూ గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.

5. తర్వాత అందులో నిమ్మరసం మిక్స్ చేసి మూత పెట్టి 5-6విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ కూల్‌గా అయిన తర్వాత గ్రేవీని సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.