Posts Tagged ‘non veg’

ఢాబా స్టైల్…బొమ్మిడాయిల పులుసు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

images (29)

కావల్సిన పదార్థాలు:

బొమ్మిడాయిలు(చేపలు): ½ kg

చింతపండు :కొద్దిగా (నీటిలో నానబెట్టుకోవాలి)

మెంతులు : 2tsp

జీలకర్ర: 1 tsp

పచ్చిమిర్చి: 3 (సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటోలు : 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ఆవాలు : 1 tsp

పసుపు : 1 tsp

ఉల్లిపాయ : 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

మసాలా పౌడర్ : (కారం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులును పొడి చేసుకోవాలి) : 2tsp

కరివేపాకు : 2 రెమ్మలు

కారం : 1tbsp

కొత్తిమీర తరుగు: 3tbsp

ఉప్పు : రుచికి తగినంత

నూనె: 3tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక నిముషం వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

2. ఇప్పుడు టమోటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

3. మీడియం మంటలో ఉల్లి, టమోటో ముక్కలు వేగిన తర్వాత, అందులో పసుపు, కారం, మరియు మసాలా పౌడర్ వేసి కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. 5నిముషాల తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న చేపముక్కలను అందులో వేసి, చిక్కటి గ్రేవీతో బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు అందులోనే చింతపండు పులుసు కూడా పోసి మూత పెట్టకుండానే 15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

7. చేపముక్కలు మీడియంగా ఉడికిన తర్వాత చిక్కబడ్డ గ్రేవీ మీద కరివేపాకు మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే డాబా స్టైల్ బొమ్మిడాయిల పులుసు రెడీ.

చికెన్ గీ రోస్ట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…మంగళూరియన్ స్పెషల్ రిసిపి…

download (3)

కావల్సిన పదార్థాలు:

చికెన్: 500gms

కరివేపాకు: రెండు రెమ్మలు

ధనియా (ధనియా పౌడర్): 2tsp

కాశ్మీరీ కారం పొడి: 1tsp

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

పంచదార: 1tsp

పెప్పర్ పొడి: 2tsp

గరం మసాలా పొడి: 1tsp

జీలకర్ర పొడి: 2 tsp

ఎండు మిర్చి: 2

నెయ్యి: 7tbsp + 2tsp

కొత్తిమీర: 1/2cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

చింతపండు గుజ్జు: 1tbsp

టమోటో గుజ్జు: 1cup

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యివేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత అందులో టమోటో గుజ్జు వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. 5 నిముషాల తర్వాత ధనియాలపొడి, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మసాల నుండి నెయ్యి సపరేట్ గా పైకి తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులోనే మరో రెండు చెంచాల నెయ్యి వేసి, చికెన్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా మరియు పెప్పర్ పౌడర్ వేసి మరో 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. ఇప్పుడు కొత్తిమీర సగభాగాన్ని ఉడుకుతున్న చికెన్ మీద చిలకరించుకోవాలి. అలాగే పంచదార కూడా చిలకరించి మూత పెట్టి తక్కువ మంట మీద 10 నిముషాలు ఉడికించుకోవాలి.

6. 10నిముషాల తర్వాత మూత తీసి చింత పండు గుజ్జు వేసి మూత పెట్టి మరో 5నిముషాలు, చికెన్ మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.

7. చికెన్ ఉడికన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిగిలిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే చికెన్ గీ రోస్ట్ రెడీ . ఈ రుచికరమైన చికెన్ రిసిపిని దోసె మరియు చపాతీలతో సర్వ్ చేయాలి.

చికెన్ స్పినాచ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1kg

ఆకు కూర: 1కట్ట

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు : 4

నూనె: 2tbsp

పసుపు: 1tsp

కారం: 1tsp

జీలకర్ర: 1tsp

ధనియాలపొడి: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ కు స్కిన్ తొలగించి శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఆకుకూరలను విడిపించుకొని, మంచినీటిలో వేసి శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

6. అలాగే మసాల దినుసులన్నీ కూడా వేసి మరో 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, గ్రేవీ చిక్కగా మారే వరకూ కలియబెట్టుకోవాలి.

7. పాన్ లో మీకు చికెన్ ముక్కలతో పాటు సరిపడా మసాలా ఉన్నదని నిర్ధారించుకొన్న తర్వాత మంటను ఎక్కువగా పెట్టి చికెన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.

8. చికెన్ పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకొనే సమయంలో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొన్న ఆకుకూరను సన్నగా తరిగి ఉడుకుతున్న చికెన్ లో వేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్పినాచ్ చికెన్ రిసిపి రెడీ.

బట్టర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ ఎలా తయారు చేయాలో చూద్దాం…టేస్టీ సైడ్ డిష్…

images (21)

కావల్సిన పదార్థాలు:

చేప ముక్కలు: 1kg

మైదా : 2tbsp

కార్న్ ఫ్లోర్: 2tbsp

వెన్న: 4tbsp

బేకింగ్ పౌడర్: 1tsp

వెలుల్లి, కొత్తిమీర తురుము : 4tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ ను కలపాలి.

2. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు, వాటిని పక్కన పెట్టుకోవాలి.

4. అరగంట తర్వాత నాన్ స్టిక్ పాన్ లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో చేపముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

5. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ…

హైదరాబాది కచ్చి గోష్ట్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (6)

కావాల్సిన పదార్థాలు :

మటన్: 1kg

బాస్మతి రైస్: 1kg

పెరుగు: 200grms

లెమన్ జ్యూస్: 3tsp

మసాలా దినుసులు: 20grms

చిల్లీ పౌడర్: 2tsp

ధనియాల పౌడర్: 3tsp

జింజర్ గార్లిక్ పేస్ట్: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

గరం మసాలా: 11/2tsp

నూనె: సరిపడా

ఫ్రైడ్ ఆనియన్: 1cup

తరిగిన కొత్తిమిర: 1/2cup

తరిగిన పుదీనా: 1/2cup

బే లీవ్స్: 1

వెన్న: 150grms

నీళ్ళు: 5ltrs.

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక కేజీ మాసం తీసుకుని అందులో లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొతిమిర, పుదీనా, ధనియాల పౌడర్, నూనె కలిపి రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి.

2. తర్వాత 5 లీటర్ల నీటిని ఒక బౌల్‌లో తీసుకుని 25 నిమిషాల పాటు మరగబెట్టాలి.

3.తరువాత ఇందులో పైన సూచించిన మోతాదులో ఉప్పు, 10గ్రా. గరం మసాలా, బేలీవ్స్ కలపాలి.

4. ఇప్పుడు గంటపాటు నాన బెట్టిన బాస్మతి రైస్‌ని మరగించిన నీటికి కలపాలి. ఇప్పుడు సగం బిర్యానీ తయారు అయినట్లే.

5. ఈ రైస్‌ని తీసుకుని పైన సూచించిన విధంగా బాగా నాన బెట్టిన మటన్‌పై వేయాలి. రైస్ పైన వెన్న, గార్లిక్ కలపాలి. ఇలా తయారైన బిర్యానీపై మూత ఉంచి గోధుమపిండితో మూతను సీల్ చేయాలి(ఆవిరిబయట పోకుండా)20-25 నిమిషాల పాటు గ్యాస్‌ని సిమ్‌లో ఉంచి ఉడకబెట్టాలి.

6. తరువాత మూతపై 20 నిమిషాల పాటు వేడి వేడి నిప్పులు పోయాలి. తరువాత మూత తీస్తే ఘుమ ఘుమలాడే బిర్యానీ మనకు నోరూరిస్తుంది. దీనికి తరిగిన కొతిమిర, పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, మిర్చీ ముక్కలు కలపాలి.

7. అంతే మనకు కావల్సిన కచ్చి గోషి బిర్యానీ తయారైంది. ఇలా వేడి వేడిగా ఉన్న బిర్యానీని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు.

స్పైసీ చికెన్‌ పకోడి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావలసిన పదార్థాలు:

బోన్‌లెస్‌ చికెన్‌: 1/2kg

పుదీనా: 1 కట్ట

కొత్తిమీర: 1 కట్ట

పచ్చిమిర్చి: 4

అల్లం: చిన్న ముక్క

వెల్లుల్లి: 6 రెబ్బలు

నిమ్మకాయ: 1

ధనియాల పొడి: 1tsp

గరం మసాలా: 1tsp

పెరుగు: 2tsp

శనగపిండి: 1/2cup

ఉప్పు: తగినంత

నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:

1. ముందుగా పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి.

2. తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం, ముందుగా నూరిపెట్టుకున్న పుదీన, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి.

3. ఒక గంట తర్వాత అందులో ఒక స్పూను వేడి నూనె, శనగపిండి కలపాలి.

4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ నుండి కొద్దికొద్దిగా తీసి శెనగపిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి.

5. కాగిన నూనెలో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీలా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీస్తే చాలు. రుచికరమైన వేడి వేడి చికెన్‌ పకోడీ రెడీ.

స్పైసీ అండ్ టేస్టీ ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (16)

కావల్సిన పదార్థాలు:

చికెన్ – 500 g

ఉల్లిపాయలు – 2 cups (finely chopped)

టమోటో – 1 cup (finely chopped)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 teaspoon

పచ్చిమిర్చి – 5 to 6

పెరుగు – 1 cup

కారం – 1/2 teaspoon

నూనె: తగినంత

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

2. నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

3. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.

4. టమోటో మెత్తబడే వరకూ 10 నిముషాలు వేగించుకోవాలి.

5. మరో పాన్‌లో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.

6. పది నిముషాల తర్వాత ముందుగా వేపుకుంటున్న పోపులో చికెన్ ముక్కలను ట్రాన్స్ ఫర్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు అందులోనే పెరుగు, కారం వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం చిక్కగా మారే వరకూ ఉడికించుకోవాలి. అంతే ఆనియన్ చికెన్ గ్రేవీ రిసిపి రెడీ.

కోహినూర్ చికెన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (9)

కావల్సిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్ : 1kg

ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)

అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tsp

టమోటో గుజ్జు: 1/2cup

నిమ్మరసం: 1tsp

ఉప్పు & పెప్పర్: రుచికి సరిపడా

గరం మసాలా: 1tsp

కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్: చిటికెడు

మైదా : 2tbsp

పుదీనా: కొద్దిగా

కరివేపాకు: రెండు రెమ్మలు

ఎండు మిర్చి: 2-4

నూనె: 2tbsp

తాజా క్రీమ్: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్, కారం, నిమ్మరసం, గరం మసాలా మరియు కుంకుమ పువ్వు వేసి, బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు చికెన్ ముక్కలకు పట్టించిన మసాలాలు విడిపోకుండా మైదాలో చల్లడం లేదా మైదాలో పొర్లించడం వల్ల మసాల మరియు ఫ్లేవర్ పోకుండా ఉంటుంది.

3. తర్వాత పెద్ద పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి నూనె వేసి కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి.

4. ఇప్పుడు అదే నూనెలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.

5. తర్వాత టమోటో గుజ్జు మరియు ఫ్రెష్ క్రీమ్ (లేదా కొబ్బరి పాలు)వేసి ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.

6. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకు పట్టేవరకూ ఫ్రై చేసుకోవాలి.

7. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర, పుదీనా తరుగును వేసి గార్నిష్ చేయాలి. అంతే కోహినూర్ చికెన్ రిసిపి రెడీ.

8. ఈ కోహినూర్ చికెన్ రిసిపిని మటర్ పులావ్ లేదా బటర్ నాన్‌తో తిని ఎంజాయ్ చేయవచ్చు.

సౌత్ ఇండియన్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (7)

కావల్సిన పదార్థాలు:

చికెన్:- 500 gms

ఉల్లిపాయలు- 5 (సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటోలు- 3 (సన్నగా కట్ చేసుకోవాలి)

పచ్చిమిర్చి – 1 (సన్నగా కట్ చేసుకోవాలి)

బంగాళదుంపలు- 2 (తొక్కతీసి సన్నగా కట్ చేసుకోవాలి)

దాల్చిన చెక్క – 2

లవంగాలు – 2

అల్లం, వెల్లుల్లి పేస్ట్- 1 ½ tbsp

కారం – 1 tbsp

పసుపు – 1 tsp

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్ళు – 1 cup

నూనె- 3 tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా రెండు చెంచాలా నూనెను ప్రెజర్ కుక్కర్లో వేసి వేడి అయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒక నిముషం తక్కువ మంట మీద వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిసేపటి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

3. తర్వాత అందులో టమోటోలు మరియు పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో పసుపు, కారం మరియు ఉప్పు వేసి 5-10నిముషాలు వేగించుకోవాలి.

5. ఇప్పుడు కుక్కర్లో చికెన్ ముక్కలు మరియు ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి.

6. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి 15నిముషాలు (4-5)విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

7. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ చేసి, విజిల్ పెట్టకుండా మూత పెట్టి తక్కువ మంట మీద మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

8.ఈ టేస్టీ చికెన్ కర్రీ రెసిపి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది.

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ రెసిపి…

images (27)

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1/2kg

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

కొబ్బరి తురుము : 3tbsp

వెల్లుల్లి: 8-10

అల్లం: కొద్దిగా

టమోటోలు: 1 లేదా 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 4-5(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పెప్పర్: 1/2tsp

దాల్చిన చెక్క: కొద్దిగా

లవంగాలు: 4-6

గసగసాలు: 1/2tsp

కొత్తిమీర: కొద్దిగా

కారం: 2tsp

ధనియాలపొడి: 3tsp

పసుపు : 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ భాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత మిక్స్ జార్ లో కొబ్బరి తురుము, చెక్క, లవంగాలు, పెప్పర్, వెల్లుల్లి, ఉల్లిపాయలో సగం, అల్లం, గసగసాలు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. జార్ లో కొద్దిగా నీళ్ళు పోసి, ధనియాలపొడి, కారం, పసుపు, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. మసాలాను రెడీ చేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో చికెన్ వేయాలి.

5. చికెన్ ను మీడియం మంట మీద 10 నిముషాల పాటు నూనెలో ఫ్రై చేయాలి. ఉప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.

6. చికెన్ కొద్ది మెత్తగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు ఫై చేసుకోవాలి.

7. చికెన్ మసాలతో పూర్తిగా కలిసి వేగి, మసాల పచ్చివాసన పోయి, నూనె పైకి తేలుతున్న సమయంలో సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

8. గ్రేవీ చిక్కబడుతున్న సమయంలో టమోటో ముక్కలు వేసి మరో 5నిముషాలు ఉడికించుకొని, గ్రేవీ చిక్కగా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది కాబట్టి, వైట్ ప్లెయిన్ రైస్, గీరైస్, పులావ్, మరియు చపాతీలకు అద్భుతంగా ఉంటుంది.