Posts Tagged ‘non vegetarian’

చికెన్ సమోసా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

vegetable_samosa

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1 కప్పు

రెడ్ చిల్లీ పెప్ప్ పౌడర్: 2టీస్పూన్స్

గరం మసాల: 1tsp

పసుపు: 1/2tsp

సోంపు పౌడర్: 1tsp

పెప్పర్ : 1/2tsp

ధనియాలపొడి: 2 tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె : డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగినవి)

అల్లం పేస్ట్ : 1tbsp

వెల్లుల్లి పేస్ట్ : 1tbsp

పచ్చిమిర్చి : 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

గుడ్డు: 1

మైదా : 2 కప్పులు

నీళ్ళు సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మిన్స్ ను జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలగుపుకోవాలి.

2. ఈ మొత్తం మిశ్రమం బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, పిండి, గుడ్డు మరియు చిటికెడు ఉప్పు , మైదా వేసి మెత్తగా , మ్రుదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి. 15 నిముషాల తర్వాత ఈ పిండి నుండి కొద్దిగా చేతిలోకి తీసుకుని, చిన్న బాల్స్ లా చేసి, ప్లాట్ గా రోల్ చేయాలి. చపాతీల్లా చుట్టుకుని, తర్వాత మద్యలో చికెన్ స్టఫ్ ను నింపి, అన్ని వైపుల క్లోజ్ చేస్తూ సమోసాల్లా ఒత్తుకోవాలి.

3. ఇలా కొన్ని సమోసాలు తయారుచేసుకున్న తర్వాత, డీప్ బాటమ్ పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సమోసాలను వేసి బంగారువర్ణంలోకి మారే వరకూ వేగించి, తీసి బౌల్లో పెట్టుకోవాలి.

4. నూనె ఎక్కువగా ఉన్నట్లైతే పేపర్ టవల్ మీద వేసి, కొద్దిసేపటి తర్వాత వేరే ప్లేట్ లోకి మార్పుకుని, వేడి వేడిగా సర్వ్ చేయాలి. చట్నీ , సాస్ మర్చిపోకండి.

చికెన్‌ గారెలు ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (9)

కావలసిన పదార్థాలు:

బోన్‌లెస్‌ చికెన్‌ – 1/2kg

శనగపప్పు – 3cups

గరం మాసాలా – 2 tsp

కారం – 2 tsp

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2tbsp

పచ్చిమిరిపకాయలు – 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉల్లిపాయలు – 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పసుపు – 1/4tsp

కొత్తిమీర కట్ట – 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు – రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ఒక గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.

2. తర్వాత చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు ముందుగా నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.

4. తర్వాత పేస్ట్ చేసుకొన్న శెనగపప్పు ముద్దలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

5. ఇప్పడు పాన్ స్టౌ మీద పెట్టి నూనె సోపి వేడి అయ్యాక అందులో కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.అంతే చికెన్ గారెలు రెడీ.

రంజాన్ స్పెషల్ బటర్ ఖీమా మసాల రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

butter-kheema

కావల్సిన పదార్థాలు:

బీఫ్ లేదా మటన్: 1kg

పెరుగు: 1cup

బటర్: 1cup

అల్లం పేస్ట్: 3tsp

వెల్లుల్లి పేస్ట్ : 3tsp

ఉల్లిపాయలు: 3పీసెస్

లవంగాలు: 5-7

దాల్చిన చెక్క: 1

బ్లాక్ యాలకలు: 2

గ్రీన్ యాలకలు: 2

పచ్చిమిర్చి: 8

బిర్యానీ ఆకు: 1

ఉప్పు: రుచికి సరిపడా

కారం: 3tsp

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్ని టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

5. ఈ కీమా మిశ్రమానికి బటర్ జోడించి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమానికి ముందుగా తయారుచేసుకొన్న మసాలా మిశ్రమం మిక్స్ చేయాలి.

7. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి, తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి.

8. తర్వాత అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించి, పెరుగు వేసి ఖీమా మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మరియు ఎండు మిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ ఖీమా మసాలా రెడీ. దీన్ని నాన్ మరియు చపాతీతో సర్వ్ చేయాలి.

ప్రాన్ మలై కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (3)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్: 1kg

ఉల్లిపాయలు: 1+1(కట్ చేసి పేస్ట్ చేయాలి)

వెల్లుల్లి: 8(పేస్ట్ చేయాలి)

కలౌంజి(ఉల్లిపాయ విత్తనాలు): 1/2tsp

పచ్చిమిర్చి: 2+6(మద్యకు కట్ చేసి పస్ట్ చేయాలి)

కొబ్బరి పాలు: 1cup

మస్టర్డ్ పేస్ట్: 2tbsp

పసుపు: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

మస్టర్డ్ ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ప్రాన్స్‌ను శుభ్రం చేసి పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. తర్వాత మస్టర్డ్ ఆయిల్‌లో వేసి 3-4నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ విత్తనాలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.

3. అంతలోపు ఒక ఉల్లిపాయను, వెల్లుల్లి మరియు మిగిలిన పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

4. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో మస్టర్డ్ పేస్ట్, ఉప్పు, పసుపు చిలకరించి ఒక 5నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. చివరగా కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసి 2నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. తర్వత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ప్రాన్ మలై కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

మస్టర్డ్ ఫిష్ కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (18)

మస్టర్డ్ ఫిష్ కర్రీని టేస్ట్ చూడాలంటే ఎలా తయారుచేయాలో చూద్దాం…

కావల్సిన పదార్థాలు:

పెద్ద చేప ముక్కలు(ఏరకమైనా): 4

ఉల్లిపాయ: 2

టమోటోలు: 3

బంగాళదుంప: 1

ఆవాలు: 3tbsp(నీళ్లలో నానబెట్టాలి)

వెల్లుల్లి రెబ్బలు: 3

అల్లం: చిన్న ముక్క

కారం: 1tsp

పసుపు: 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె : సరిపడా

పెరుగు : 1/2cup

కొత్తిమీర: 1కట్ట

తయారుచేయు విధానం:

1. ముందుగా నీళ్లలో నానబెట్టిన ఆవాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్గగా పేస్ట్ చేసుకోవాలి.

2. తర్వాత చేపముక్కలను శుభ్రంగా కడిగి వాటికి అరచెంచా కారం, పసుపు, కొద్దిగా ఉప్పు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో ముప్పావు వంతు నూనె వేసుకొని, వేడిచేసి చేపముక్కల్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

4. అదే పాన్ లో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ ముక్కులు వేసి వేయించుకోవాలి.

5. తర్వాత అందులోనే టమోటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత ముందుగా మిక్సీలో చేసిపెట్టుకొన్న ఆవ పేస్ట్ వేసి, రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.

6. తర్వాత అందులోనే ఉప్పు, కారం, వేసి మిక్స్ చేసి నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక గిలకొట్టిన పెరుగు వేయాలి.

7. తర్వాత వేయించిన చేపముక్కల్ని కూడా వేసి మంట తగ్గించి మూత పెట్టేయాలి. కొన్ని నిముషాలకు చేపముక్కలు బాగా ఉడుకుతాయి. 8. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి పక్కకు దింపుకోవాలి.

కరకరలాడే హాట్ అండ్ స్పైసీ చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

 

images (17)

కావల్సిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్ ముక్కలు:5 to 6

కార్న్ ఫ్లోర్: 5 tbsp

మైద: 5 tbsp

గుడ్లు: 2

సోయా సాస్: 2 tbsp

చిల్లీ సాస్: 2 tbsp

వెనిగర్: 2 tbsp

ఆవపొడి: 1 tsp

బ్లాక్ పెప్పర్: 1 tsp

వెల్లుల్లి రెబ్బలు: 6 to 7సన్నగా తరిగి పెట్టుకోవాలి

ఉప్పు : రుచికి సరిపడా

చైనీస్ సాల్ట్: రుచికి సరిపడా

నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలను కుక్కర్లో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పెట్టాలి.

2. అలాగే చికెన్ తో పాటు, కొద్దిగా నూనె, చైనీస్ సాల్ట్, వెల్లుల్లి, వెనిగర్, ఉప్పు మరియు పెప్పర్ వేయాలి.

3. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.

4. ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని అందులో గుడ్లు, సోయాసాస్, చిల్లీ సాస్, బ్లాక్ పెప్పర్, ఆవాల పేస్ట్, కార్న్ ఫ్లోర్ మరియు మైదా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.

5.ఈ పేస్ట్ ను మరీ చిక్కగా లేకుండా కొద్దిగా పాలు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలకు ఈ పేస్ట్ ను పట్టించి డీప్ ఫ్రై చేసుకోవాలి.

6. అంతే క్రిస్పీ చికెన్ ముక్కలను టమోటో సాస్ మరియు కోల్డ్ డ్రింక్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

స్పైసీ ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (6)

కావల్సిన పదార్థాలు:

బాస్మతి రైస్ : 2cups

ఎండుమిర్చి: 2-3

వెల్లుల్లి రెబ్బలు: 4-6

అల్లం తురుము: 1/2tsp

నూనె లేదా నెయ్యి: సరిపడా

క్యారెట్లు: 2

చైనీస్ క్యాబేజ్ తురుము: 1/2cup

గుడ్లు: 2

ఉల్లికాడలు: 2

ఫ్రెష్ బఠానీలు: 1/2cup

సోయాసాస్: 1tsp

వెనిగర్: 1/4tsp

ఉప్పు: రుచికి తగినంత

కొత్తిమీర : కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.

2. అలాగే గుడ్డును పగులగొట్టి గిన్నెలో పోసి అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత మిక్సి జార్ లో వెల్లుల్లి, ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అల్లం తురుము వేసి వేయించుకోవాలి.

5. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. అందులోనే సోయా సాస్, వెనిగర్ కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకొని.

7. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని పోసి వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న వెజిటేబుల్ రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే స్పైసీ ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ…

టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

biryani

కావాల్సిన వస్తువులు:

చికెన్-500 గ్రాములు(బోన్ లెస్)

పసుపు-ఒక టీ స్పూను

పెరుగు-ఒక కప్పు

గరం మసాలా-ఒక టీ స్పూను

కారం-2 టేబుల్ స్పూనులు

ఉప్పు-తగినంత

అల్లం పేస్టు-ఒక తేబుల్ స్పూను

వెల్లుల్లి పేస్టు-ఒకటిన్నర టేబుల్ స్పూను

నెయ్యి-3 టేబుల్ స్పూన్లు

వేయించిన ఉల్లిపాయలు-ఒక కప్పు

బాస్మతీ రైస్-నానబెట్టినది 2 కప్పులు

మసాల దినుసులు-తగినన్ని

డ్రై ఫ్రూట్స్-సన్నగా తరిగినవి ఒక కప్పు

కుంకుమ పువ్వు నీరు-2 టేబుల్ స్పూన్లు

రోజ్ వాటర్-ఒక టేబుల్ స్పూన్లు

కేవ్రా వాటర్-ఒక టేబుల్ స్పూను

తయారీ విధానం:

1.చికెన్ ముక్కలని ఒక గిన్నెలో తీసుకుని దానిలో పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా వెయ్యాలి.

2.ఇలా చికెన్ ముక్కలని మారినేట్ చేసి 2 గంటలపాటు పక్కనుంచాలి.

3.ఒక లోతైన మూకుడు తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడి చేసి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని వెయ్యాలి.

4.వేయించిన ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్ వేసి చికెన్ సగం ఉడికే వరకూ స్టవ్ మీద ఉంచాలి.

5.ఒక పాన్ తీసుకుని దానిలో నీళ్ళు పోసి వేడి చేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు మసాలా దినుసులు వెయ్యాలి.

6.దీనిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి 80% ఉడికించుకోవాలి.

7.ఇప్పుడు వేయించుకున్న చికెన్ ముక్కలని ఒక లోతైన గిన్నెలో పేర్చి పైన ఉడికిన అన్నాన్ని వేసి పొరలుగా పేర్చాలి.

8.దీనిలో కుంకుమ పువ్వు నీరు, రోజ్ వాటర్, కేవ్రా వాటర్, డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి చుట్టూ అల్యూమినియం ఫాయిల్తో చుట్టాలి.

9.చికెన్ బిర్యానీని ఇంకా సహజంగా చెయ్యాలనుకుంటే గిన్నె మూతకి గోధుమ పిండి పూసి సీల్ చెయ్యాలి.

10.ఇప్పుడు బిర్యానీని ఇలా 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి.

11.గిన్నెలో నుంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆపాలి. అంతే మీ చికెన్ బిర్యానీ రెడీ.

చికెన్ మంచూరియన్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (12)

కావల్సిన పదార్థాలు:

చికెన్ (ఎముకలు లేనివి): ½ kg

కార్న్: 1cup

గుడ్లు: 2(బీట్ చేసి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 6 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

సోయా సాస్: 3tbsp

టమోటో సాస్: 2tbsp

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp

వెల్లుల్లి రెబ్బలు: 4 (తరిగిన)

అల్లం: 1 అంగుళం

క్యాప్సికమ్: 1

కొత్తిమీర తరుగు: 2tbsp

అజినోమోటో: ½tsp

నూనె: 1cup

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, గుడ్డు, రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ఉప్పు, మరియు అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులోనే అరకప్పు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేయాలి.

3. తర్వాత డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసుకొని ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి.

4. మీడియం మంట మీద చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి తీసి టిష్యు పేపర్ మీద వేసి పెట్టాలి.

5. తర్వాత మరో పాన్‌లో రెండు చెంచాలా నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేయాలి.

6. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి, మిక్స్ చేస్తూ రెండు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేయాలి.

7. తర్వాత అందులోనే సోయాసాస్, టమోటో కెచప్ మరియు అజినామోటో కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి.

8. తర్వాత కొత్తిమీర తరుగు వేసిమిక్స్ చేసి, అరకప్పు నీళ్ళు పోయాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

9. స్టౌను సిమ్ లో పెట్టి, మరో 5నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే చికెన్ మంచూరియన్ రెడీ.

కేరళ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (59)

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1/2kg(కట్ చేసి, శుభ్రం చేసి ఉడికించుకోవాలి)

సోంపు: 2tbsp

ఎండు మిర్చి: 5-6(మద్యలోకి కట్ చేసుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు: 6-7

కరివేపాకు: రెండు రెమ్మలు

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా సోంపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు మరియు కరివేపాకును మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

2. తర్వాత ఈ పేస్ట్‌ను చికెన్ ముక్కలకు పట్టించాలి.

3. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ఒక గంట పక్కన పెట్టుకోవాలి.

4. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టిన తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి.

5. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. అంతే కేరళ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. ఇది రైస్ అండ్ రోటీస్‌కు సైడ్ డిష్‌గా ఉంటుంది. దీనితో పాటు ఉల్లిపాయ ముక్కలను సర్వ్ చేయాలి.