Posts Tagged ‘olive oil’

హెల్తీ బార్లీ పరోఠా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…డయాబెటిక్ వారికోసం…

images (79)

కావల్సిన పదార్థాలు:

బార్లీ పండి: 1/2cup

గోధుము పిండి: 3tbsp

ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

వెల్లుల్లి పేస్ట్ : 1tsp

అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ : 1tsp

ఆలివ్ ఆయిల్ : tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఉల్లిపాయలను చాలా సన్నగా లేదా రఫ్ గా పేస్ట్ లాగా చేసుకుంటే, పిండి కలుపుకవడానికి సులభంగా ఉంటుంది.

2. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపండి, బార్లీ పిండి,సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్ల్లుల్లి పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి , అరచెంచా ఆలివ్ ఆయిల్ వేసి పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి .

3. ఇప్పుడు మొత్తం పిండి నుండి కొద్దికొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్ లాగా రోల్ చేసుకోవాలి. పరోఠాల్లా ఒత్తుకోవాలి

4. స్టౌ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వత్తుకొన్న పరోఠాను తవా మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

5. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకొని, తర్వాత ప్లేట్ లోకి మార్చుకోవాలి. అంతే రుచికరమైన బార్లీ పరోఠా రెడీ.

పాలక్ పన్నీర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం…

maxresdefault

కావల్సిన పదార్థాలు:

తరిగిన పాలకూర: 1cup

పన్నీర్ తురుము: 1/2cup

తరిగిన ఉల్లిపాయలు: 1/2cup

వెల్లుల్లి పేస్ట్: 1/2tsp

అల్లం పేస్ట్: 2tsp

తరిగిన పచ్చిమిర్చి ముక్కలు: 2tsp

ఆలివ్ ఆయిల్: 2tsp

ధనియాలు: 1tsp

పంచదార: 1tsp

నిమ్మరసం: 2tsp

వేరుశెనగ: 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ స్టౌమీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి కొన్ని నిముషాల పాటు వేగించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో పాలకూర తరుగును, పన్నీర్ తరుగును కూడా వేసి బాగా వేగించుకోవాలి.

2. అంతకంటే ముందు వేరుశనగలు వేయించి సిద్దంగా ఉంచుకోండి.

3. తర్వాత ఒక కప్పు పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ పంచదార, 1కప్పు పాలు, అర స్పూన్ ఈస్ట్, 1/2 ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకుని పిండి ముద్దను మూడు నాలుగు గంటల పాటు వదిలేయండి.

4. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న రోటీలా తయారుచేయండి.

5. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కర్రీని రోటీలో పెట్టి నాలుగు వైపులా మూసేసి మరిగే నూనెలో వేసి వేయించండి. అంతే తినడానికి పాలక్ పఫ్ రెడీ.

వృద్ధాప్య లక్షణాలను నివారించి చర్మ సౌందర్యం పెంచే చందనం…

images (68)

చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా చేయాలంటే, గుడ్డు సొనలో తేనె, చందనం మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా మంచి ఫలితం ఉంటుంది.

అందమైన కళ్ళ కోసం ఆల్మండ్ నూనె…

images (14)

చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా కళ్ళ చుట్టూ ఏర్పడే ముడతలను, వలయాలను నివారించుకొని అందంగా తయారు చేసుకోవచ్చు.

– ఆల్మండ్ నూనె మరియు ఆలివ్ నూనెతో కంటి చుట్టూ ఉండే చర్మాన్ని సున్నితంగా మర్దన చెయ్యడం ద్వారా చర్మంలో తేమ ఏర్పడి మృదువుగా తయారవుతుంది.

– పాల మీగడ చర్మానికి పట్టించడం ద్వారా కూడా చర్మం మృదువుగా మారుతుంది.

– కంటి రెప్పలపై, నొసలపై ఆల్మండ్ నూనె రాసి మసాజ్ చేస్తే వెంట్రుకలు రాలిపోకుండా నిగ నిగా మెరుస్తాయి.

– కంటికి అతిగా మేకప్ చెయ్యడం కూడా చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.

మెరిసే చేతులు కోసం…

images (6)

కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చేతులను మెరిసే విధంగా మృదువుగా చేసుకోవచ్చు.

– ఒక చెంచా ఆలివ్ నూనె మరియు చక్కెర కలిపి చేతులకు రాసి మృదువుగా మర్దన చేసి పది నిమిషాలు తరువాత చన్నీళ్ళతో కడిగెయ్యాలి.

– రెండు చెంచాలు నిమ్మ రసం, తేనె మరియు వంటసోడా కలపాలి. చేతులను వేడి నీళ్ళతో కడుక్కుని, ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి, పది నిమిషాలు మర్దన చేసి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.

– ఒక చెంచా దాల్చిన చెక్క పొడి మరియు తేనె కలిపి చేతులకు రుద్ది పది నిమిషాల తరువాత కడిగెయ్యలి.

– రెండు చెంచాలు కీరదోస గుజ్జు మరియు నిమ్మ రసం కలిపి చేతులకు రాసి పావు గంట తరువాత శుభ్రంగా కడగాలి.

విటమిన్-ఇతో కాలుష్యం నుంచి ఊపిరితిత్తులు సేఫ్!…

images (64)

కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను విటమిన్-ఇ తో కాపాడుకోవచ్చునని తాజా పరిశోధనలో వెల్లడైంది. పెరుగుతున్న వాహనాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. యాంత్రికయుగం కారణంగా వాహనాల్లో హడావుడి ప్రయాణం, కాలుష్యంతో అనవసరపు అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటున్నాం. అయితే వాతావరణ కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని బ్రిటీష్ పరిశోధకులు అంటున్నారు.

విటమిన్ ఇ పుష్కలంగా లభించే.. ఆలివ్ ఆయిల్, బాదం పప్పు, సన్ ఫ్లవర్ గింజలు, అవకడోలు తీసుకోవాలి. వీటిని అధికంగా తీసుకునే వారిలో కాలుష్యంతో ఊపిరితిత్తుల్లో ఏర్పడే సమస్యలను చాలామటుకు తగ్గాయని పరిశోధనలో తేలింది. రొయ్యలు, చేపలు, బ్రొకోలీ, గుమ్మడి, ఆకుకూరల్లోనూ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

స్ట్రాంగ్ జుట్టు సొంతం చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్, ఎగ్ మాస్క్…

download (27)

ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. హనీ, ఆలివ్ ఆయిల్ మరియు తేనె మూడింటిని సమంగా తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 20 నిముషాలు అలాగే ఉండనివ్వాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. షాంపుతో తలస్నానం చేస్తే ఎగ్ స్మెల్ పోతుంది. జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఈ పద్దతిని వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నించవచ్చు. దీంతో పాటు హెల్తీ డైట్‌ను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు మసాజ్ చేయాలి. డ్రై అండ్ స్ట్రెయిట్ హెయిర్ స్టైలింగ్‌కు దూరంగా ఉండాలి.

స్టఫ్డ్ టమోటో మలై గ్రేవీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (2)

కావలసిన పదార్థాలు:

ఎర్రగా ఉన్న టొమాటోలు: 2

ఆలివ్ ఆయిల్ : 1tsp

వెల్లుల్లి రేకలు: 2

ఉల్లి తరుగు: 1/2cup

జీలకర్ర: 1/2tsp

వంకాయ ముక్కలు: 1/2cup

వెనిగర్: 2tbps

టొమాటో ముక్కలు: 1/2cup

పుదీనా ఆకులు: 5

నువ్వుపప్పు : 3tbsp

పైన్‌నట్స్: 2tbsp

కారం: 1/2tsp

ఉప్పు: రుచికి తగినంత

మిరియాలపొడి: 1/2tsp

కొత్తిమీర తరుగు: 1cup

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్‌ను 375 డిగ్రీల దగ్గర వేడి చేయాలి.

2. తర్వాత టొమాటోలపై భాగాన్ని కట్ చేసి, లోపల ఉండే గుజ్జును స్పూను సహాయంతో జాగ్రత్తగా తీయాలి.

3. ఇప్పుడు ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లిరేకలు, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మూడు నిమిషాలు వేయించాలి.

4. వంకాయ ముక్కలను జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.

5. తర్వాత ఒక చిన్న బాణలిలో వెనిగర్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి.

6. అలాగే అందులోనే పుదీనా ఆకులు, కారం జత చేసి రెండు నిమిషాలు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.

7. మరో బాణలిలో కూరగాయ ముక్కలకు, నువ్వుపప్పు, పైన్ నట్స్ జత చేసి కలపాలి. వేడిగా ఉండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి దించేయాలి.

8. పైన తయారుచేసుకున్న పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

9. పెద్ద స్పూన్‌తో ఈ మిశ్రమాన్ని టొమాటోలలో స్టఫ్ చేయాలి.

10. తర్వాత బేకింగ్ షీట్ మీద ఉంచి ఓవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి. 20 నిముషాల తర్వాత బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్టఫ్డ్ టమోటో రెడీ.

ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరినూనెతో స్కిన్ అలెర్జీలకు చెక్…

images (91)

చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు, నిద్రించేందుకు ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె రెండింటిని కలిపి మసాజ్   చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తొలగించాలి.ఒకవేళ ఇచెస్ కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూసి గట్టిగా రాయటం వలన ఉపశమనం పొందుతారు.

పాలక్ పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

maxresdefault

పాలకూర: 1కట్ట

శెనగపిండి: 250grms

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

అజ్వైన్: 1tsp(సోంపు)

జీలకర్ర: 1tbsp

కారం: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్ళు: 1cup

నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడగాలి. తర్వాత పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అజ్వైన్, జీలకర్ర, మరియు ఉప్పు వేయాలి.

3. అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న పాలకూర కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా పిండిని కలుపుకోవాలి. చిక్కగా జారుడుగా అయ్యే వరకూ కలుపుకోవాలి.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, చేతిని నీటిలో ముంచి తడిచేసుకొని, శెనగపిండి, పాలక్ మిశ్రమాన్ని చేత్తో కొద్దికొద్దిగా కాగే నూనెలో విడవాలి. పకోడాను నిధానంగా కాగేనూనెలో విడవాలి. ఎలా పడితే అలా వేస్తే నూనె చేతుల మీద ఎగిరే ప్రమాదం ఉంది.

5. పకోడాను అన్ని వైపులా కాలి, క్రిస్పీగా మరియు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. వేగిన తర్వాత వాటిని తీసి పేపర్ టవల్ మీద వేయాలి. అంతే పాలక్ పకోర రెడీ. కొత్తిమీర చట్నీ, టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అలాగే మీరు చింతకాయ చట్నీ కూడా ట్రై చేయవచ్చు.