Posts Tagged ‘omelette’

ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (62)

కావల్సిన పదార్థాలు :

మష్రుమ్(పుట్టగొడుగులు) : 1cup(మష్రుమ్ ను తరుముకోవాలి. లేదా సన్నగా తరిగి పెట్టుకోవాలి)

ఎగ్ వైట్ : 4

పెప్పర్ : 1/2tsp

పాలు : 1tbps

ఆలివ్ ఆయిల్ : 1tsp

ఓరిగానో : 1/2tsp

చీజ్ : 1/2cube(గార్నిష్ కొరకు)

కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం :

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న మష్రుమ్, కొత్తిమీర, అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

3. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.

5. ఇప్పుడు మష్రుమ్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.

6. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి.

8. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ మష్రుమ్ ఆమ్లెట్ రెడీ. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం… టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి…

veggie-omelette-main

కావల్సిపదార్థాలు:

గుడ్లు: 2-3

ఉల్లిపాయలు: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

టమోటో: ½ (సన్నగా కట్ చేసుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)

స్ప్రింగ్ బీన్స్ : 1 (సన్నగా కట్ చేసుకోవాలి)

బ్లాక్ పెప్పర్ పౌడర్: చిటికెడు

రెడ్ చిల్లీ పౌడర్: ½ tsp

పాలు: 1tbsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె లేదా బట్టర్: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ల్లో గుడ్లను పగుల గొట్టి అందులో పోయాలి. అందులోనే మిగిలిన పదార్ధాలు, అంటే ఒక చెంచా పాలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటోలు, స్ప్రింగ్ బీన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా గిలకొట్టాలి.

2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక దాని మీద కొద్ది నూనె లేదా బట్టర్ రాసి మిక్స్ చేసి పెట్టుకొన్న ఎగ్ వెజిటేబుల్ మిశ్రమాన్ని ఆమ్లెట్ గా వేయాలి. మీడియం మంట మీద రెండు మూడు నిముషాల పాటు ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకు టర్న్ చేసుకొని ఆవైపు కూడా బేక్ చేసుకోవాలి.

3. ఆమ్లెట్ టర్న్ చేయడానికి వుడెన్ స్పూన్ ఉపయోగించడం వల్ల మద్యకు కట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత ఒకటి రెండు నిముషాలు స్టౌమీద అలాగే ఉంచి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే వేడి వేడి హెల్తీ వెజిటేబుల్ బ్రేక్ ఫాస్ట్ రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్ని చేసి సర్వ్ చేయాలి.

క్లాసిక్ చీజ్ ఆమ్లెట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (23)

కావల్సిన పదార్థాలు:

గుడ్లు- 4

బ్రెడ్ – 6 slices (టోస్ట్ చేసుకోవాలి)

చెద్దార్ చీజ్ – 2 tbsp (తురుము కోవాలి)

క్యాప్సికమ్ – 3 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

క్యారెట్ -2 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

కొత్తిమీర -1 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి -1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

బ్లాక్ పెప్పర్ పౌడర్-1 tsp

పాలు-3 tbsp

నూనె- 2 tsp

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఆమ్లెట్ కోసం సిద్దం చేసి పదార్థాలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత పాన్ లో కొద్దిగా బట్టర్ లేదా నూనె వేసి వేడి చేయాలి. పాన్ మొత్తం స్పెడ్ చేయాలి.

3. ఇప్పుడు పాన్ లో గుడ్డు మిశ్రమాన్ని పాన్లో వేసి స్ప్రెడ్ చేసి, దాని మీద చీజ్ తురుమును స్ప్రెడ్ చేయాలి. ఆమ్లెట్ గోల్డ్ బ్రౌన్ కలర్ లోని మారే వరకూ రెండు వైపులా ఫ్రై చేయాలి .

4. రెండు వైపులా బాగా కాలిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్లేట్ లోనికి తీసుకొని సాడ్వించ్ బట్టర్ టోస్ట్ తో సర్వ్ చేయాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి రెడీ.

చిన్న ఉల్లిపాయలతో ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (3)

కావలసిన పదార్థాలు:

గుడ్లు – 2

పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పెప్పర్ పౌడర్: 1/4tsp

పాలు – 1tbsp

ఉల్లికాడల తరుగు(గ్రీన్‌ + వైట్‌) – 1cup

ఉప్పు – రుచికి తగినంత

నూనె – తగినంత

తయారుచేసే విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోని అందులో గుడ్లు చిదిమి, పాలు, ఉప్పు కలిపి బాగా గిలకొట్టాలి.

2. తర్వాత అందులోనే ఉల్లికాడల తరుగు (గ్రీన్‌ + వైట్‌) మరియు పచ్చిమిర్చి తరుగు వేసి మరోసారి బాగా కలపాలి.

3. తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆమ్లెట్‌ వేసి, సన్నని మంటపై (మాడకుండా) రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. చివరగా కొద్దిగా పెప్పర్ పౌడర్ చిలకరించి ఒక నిముషం తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి.

ఆలూ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావలసిన పదార్థాలు:

ఆలుగడ్డలు: 1/2kg

కోడి గుడ్లు: 5

పాలు: 2tbsp

ఉల్లిపాయలు: 2

మిరియాలపొడి: 1/2tsp

ఉప్పు: రుచికి తగినంత

వెన్న: 50grms

తయారుచేయు విధానం:

1. ముందుగా ఆలుగడ్డల్ని ఉడకబెట్టి, తొక్క తీసి, ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. ఒక గిన్నెలో కోడి గుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి.

3. తర్వాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, పాలు వేసి మళ్లీ గిలకొట్టాలి.

4. చివరిగా ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని వేసి బాగా కలిపి వెడల్పాటి గిన్నెలో వేసి ఓవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. లేదంటే దళసరి పెనంపై ఆమ్లెట్‌లా వేసుకున్నా బాగుంటుంది. అంతే హెల్తీ న్యూట్రీషియన్ ఆలూ ఆమ్లెట్ రెడీ.