Posts Tagged ‘palak’

పాలక్ పన్నీర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం…

maxresdefault

కావల్సిన పదార్థాలు:

తరిగిన పాలకూర: 1cup

పన్నీర్ తురుము: 1/2cup

తరిగిన ఉల్లిపాయలు: 1/2cup

వెల్లుల్లి పేస్ట్: 1/2tsp

అల్లం పేస్ట్: 2tsp

తరిగిన పచ్చిమిర్చి ముక్కలు: 2tsp

ఆలివ్ ఆయిల్: 2tsp

ధనియాలు: 1tsp

పంచదార: 1tsp

నిమ్మరసం: 2tsp

వేరుశెనగ: 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ స్టౌమీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి కొన్ని నిముషాల పాటు వేగించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో పాలకూర తరుగును, పన్నీర్ తరుగును కూడా వేసి బాగా వేగించుకోవాలి.

2. అంతకంటే ముందు వేరుశనగలు వేయించి సిద్దంగా ఉంచుకోండి.

3. తర్వాత ఒక కప్పు పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ పంచదార, 1కప్పు పాలు, అర స్పూన్ ఈస్ట్, 1/2 ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకుని పిండి ముద్దను మూడు నాలుగు గంటల పాటు వదిలేయండి.

4. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న రోటీలా తయారుచేయండి.

5. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కర్రీని రోటీలో పెట్టి నాలుగు వైపులా మూసేసి మరిగే నూనెలో వేసి వేయించండి. అంతే తినడానికి పాలక్ పఫ్ రెడీ.

మేతి పన్నీర్ రైస్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

మెంతిఆకులు : 2 కట్టలు ( 150 gms) (శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పన్నీర్: 1 cup (కావాల్సిన సైజ్‌లో కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయలు: 1/2 cup (సన్నగా కట్ చేసుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు: 5 to 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

నిమ్మకాయ: 1 రసంతీసి పక్కన పెట్టుకోవాలి

బియ్యం: 1 cup

ఉప్పు : రుచికి సరిపడా

గరం మసాలా: 1/2 tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పనీర్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

2. అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. తర్వాత అందులోనే సన్నగా తరిగిన మెంతి ఆకులలు, పచ్చిమిర్చి వేసి 1 నిముషం వేగించుకోవాలి.

4. తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోయాలి. దీనితో పాటే గరం మసాలా, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి, అన్నం వండుకోవాలి.

5. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్ ముక్కలను వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. అంతే మేతీ పనీర్ రైస్ రెడీ, వేడి వేడిగా సర్వ్ చేయాలి.

6. మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

హై బీపీని కంట్రోల్ చేసి… పక్షవాతాన్ని నివారించే పాలకూర…

images (42)
మన శరీరంలో ఏర్పడే రోగాలన్నిటికి ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కూరగాయలు, ఆకుకూరలే మందుగా పనిచేస్తాయి. ఈ విషయం ఎన్నడో రుజువైనప్పటికీ తాజాగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వలన ఏర్పడే పక్షవాతాన్ని నివారించడంలో పాలకూర బాగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆ అధ్యయన వివరాలను ‘ద జర్నల్ ఆఫ్ ద’ అమెరికన్ అసోసియేషన్ అనే మెడికల్ జర్నల్‌‌‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
ఆ ప్రకారం.. శాస్త్రవేత్తలు హైబీపీ ఉన్న 20,702 మందిపై అధ్యయనం నిర్వహించినట్టు తెలిసింది. హైబీపీని తగ్గించే ఎనాలప్రిల్ అనే మందును వాడుతున్న వారికి మందుతో పాటూ ఫొలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని అందించారు. అప్పుడు ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్న వారిలో గుండెపోటు వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం తగ్గిందని అధ్యయనవేత్తలు గుర్తించారు.
అంతేకాకుండా పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని వారు తేల్చిచెప్పారు. అదే విధంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారు ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వారు స్పష్టం చేశారు.

పాలక్ పకోడా ఎలా తయారుచేయాలో చూద్దాం…

maxresdefault

పాలకూర: 1కట్ట

శెనగపిండి: 250grms

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

అజ్వైన్: 1tsp(సోంపు)

జీలకర్ర: 1tbsp

కారం: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్ళు: 1cup

నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడగాలి. తర్వాత పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అజ్వైన్, జీలకర్ర, మరియు ఉప్పు వేయాలి.

3. అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న పాలకూర కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా పిండిని కలుపుకోవాలి. చిక్కగా జారుడుగా అయ్యే వరకూ కలుపుకోవాలి.

4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, చేతిని నీటిలో ముంచి తడిచేసుకొని, శెనగపిండి, పాలక్ మిశ్రమాన్ని చేత్తో కొద్దికొద్దిగా కాగే నూనెలో విడవాలి. పకోడాను నిధానంగా కాగేనూనెలో విడవాలి. ఎలా పడితే అలా వేస్తే నూనె చేతుల మీద ఎగిరే ప్రమాదం ఉంది.

5. పకోడాను అన్ని వైపులా కాలి, క్రిస్పీగా మరియు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. వేగిన తర్వాత వాటిని తీసి పేపర్ టవల్ మీద వేయాలి. అంతే పాలక్ పకోర రెడీ. కొత్తిమీర చట్నీ, టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అలాగే మీరు చింతకాయ చట్నీ కూడా ట్రై చేయవచ్చు.

పాలక్ రైతా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావలసిన పదార్థాలు:

పాలకూర : 1/2cup(ఒక కట్టను సన్నగా తరిగిపెట్టుకోవాలి)

చిక్కటి పెరుగు : 2cup

పచ్చి మిర్చి : 4(మిక్సీలో వేసి మెత్తగా చేయాలి లేదా సన్నగా తరిగిపెట్టుకోవచ్చు)

శనగపప్పు : 1tsp

మినప్పప్పు : 1tsp

ఆవాలు : 1tsp

జీలకర్ర : 1/2tsp

ఎండు మిర్చి : 6

కరివేపాకు : రెండు రెమ్మలు

పసుపు : చిటికెడు

ఉప్పు : తగినంత

మిరియాలు, జీలకర్ర పొడి : 1/2tsp

నూనె : 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ఆకుకూరను శుభ్రం చేసుకొని, వేడినీటిలో వేసి అదునిముషాల తర్వాత తీసేయాలి. మెత్తగా ఉడికించకూడదు. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక ఆకుకూర లైట్ గా వేయించి పక్కన ఉంచాలి.

2. తర్వాత గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి.

3. ఇప్పుడు మరో డ్రీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి.

4. అంతలోపు చిలకించిన పెరుగులో వేయించి ఉంచుకున్న ఆకుకూర తురుము వేసి కలపాలి.

5. తర్వాత అలాగే వేయించి ఉంచుకున్న పోపు కూడా జోడించాలి.

6. చివరగా మిరియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే పాలక్ రైతా రెడీ. ఇది అన్నంలోకి, రోటీలలోకి చాలా బాగుంటుంది.

హల్తీ మేతి పాలక్ బియ్యం రొట్టి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (88)

కావల్సిన పదార్థాలు:

బియ్యం పిండి – 2 cups

మెంతి ఆకులు – 1 cup (chopped)

పాలకూర – 1 cup (chopped)

జీలకర్ర – 1tbs

కొబ్బరి తురుము – 1 cup

పచ్చిమిర్చి – 2 to 3

కొత్తిమీర – 4 to 5 strands

నూనె – 2 tbs

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఒక బౌల్ తీసుకొని అందులో మెంతి, పాలకూర ఆకులను శుభ్రం చేసి వేయాలి.

2. అందులోనే జీలకర్ర, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

3. మొత్తం మిశ్రమం కలగలిపిన తర్వాత అందులో బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోవాలి.

4. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి పాన్ మొత్తం నూనెను సర్ధాలి.

6. తర్వాత చేతి నిండుగా పిండి తీసుకొని వేడిగా ఉన్న పాన్ మీద వేసి పాన్ మొత్తం పిండిని సర్ధాలి. తర్వాత చివర్ల నుండి నూనె చిలకరించాలి .

7. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పాలక్ మేతి రోటి రెడీ. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది.

చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేయాలో చుద్దాం…

download (41)

కావల్సినన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్ – 100 grams

క్యారెట్స్ – 1/2 cup

క్యాబేజ్ – 1/2 cup

స్వీట్ కార్న్ కార్నెల్స్ – 2 cups

పెప్పర్ పౌడర్ – 1 teaspoon

చిల్లీ పౌడర్ – 1/2 teaspoon

కార్న్ ఫ్లోర్ – 1 tablespoon

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: తగినంత

పసుపు: చిటికెడు

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి.

2. ఒక నిముషం తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేయాలి. వేడి అయిన తర్వాత అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి.

4. తర్వాత 2లీటర్ల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు వాటికి పెప్పర్ పౌడర్ మరియు చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.

6. తర్వాత అందులోనే చికెన్ కూడా వేసి మిక్స్ చేయాలి.

7. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

8. ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలగలుపుకోవాలి.

9. ఈ మొత్తం మిశ్రమం అంతా 10-15నిముసాలు మెత్తగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ.

డైలీ డైట్‌లో చేర్చుకోవాల్సిన ఫైబర్ ఫుడ్స్డ్…

images (61)

పాలకూర: పాలకూరను మనం సాధారణంగా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దీంట్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వారానికి రెండుసార్లు పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది.

చిక్కుళ్లు: చిక్కుళ్లు చాలా రకాలుగా దొరుకుతాయి. బీన్స్, చిక్కుడు, రాజ్మా, బఠాణీల రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు, ఫైబర్‌ని కూడా కావాల్సిన మోతాదులో పొందవచ్చు.

మొక్కజొన్న: మొక్కజొన్న పొత్తులంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా? అయితే ఇవి రుచికరంగానే కాదు ఆరోగ్యకరం కూడా. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మీకు నచ్చిన స్టైల్లో వీటిని ఆరగించండి.

పాలక్ ప్రాన్ కర్రీ రిసిపి తయారుచేయు విధానం…

images (26)

కావలసిన పదార్థాలు:

రొయ్యలు – 200grms(పొట్టు వలచి, శుభ్రం చేసిన)

పాలకూర తరుగు – 2cups

ఉల్లిపాయ – 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

అల్లంవెల్లుల్లి పేస్టు – 2tsp

కారం – 1tsp

దనియాలపొడి – 1tsp

గరం మసాల పొడి – 1tsp

పసుపు – చిటికెడు

ఉప్పు – రుచికి తగినంత

పచ్చిమిర్చి – 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

నూనె – సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో రొయ్యల్ని పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి.

2. మరో పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాలు వేగించాలి.

3. ఇప్పుడు అందులోనే రొయ్యలు, కారం, దనియాలపొడి కలిపి మరికొద్దిసేపు వేగించాలి.

4. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్దిసేపు ఉడికించాలి.

5. రొయ్యలు ఉడికి, కూర చిక్కబడ్డాక గరం మసాల పొడి వేసి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది. (ఇష్టమైతే పాలకూర తరుగు బదులు దాన్ని ఉడికించి, పేస్టుచేసి కూడా కలుపుకోవచ్చు). అంతే పాలక్ ప్రాన్ కర్రీ రెడీ.

ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

french-omelette-004

కావల్సిన పదార్థాలు:

గుడ్లు: 4 (whites only)

పాలు: 1tbsp

పెప్పర్: 1tsp

పాలక్: 1 sprig (chopped)

మెంతి: 1/2tsp

ఆయిల్: తగినంత

కొత్తిమీర: 1 sprig (chopped)

పుదీనా: 5 (chopped)

ఉప్పు: రుచికి సరిపడా

ఆలివ్ ఆయిల్: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.

2. పచ్చసొనను మీరు వేరే వంటకానికి ఉపయోగించుకోవచ్చు లేదా పడేసేయండి.

3. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న పాలాకు, మెంతి, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి బాగా గిలకొట్టాలి.

4. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి అయ్యాక అందులో బీటెన్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి రెండు నుండి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

5. మూడు నాలుగు నిముషాల తర్వాత ఆమ్లెట్ ను ఫోల్డ్ లేదా రోల్డ్ చేసి మరి రెండు నిముషాలు ఫ్రై చేయాలి. అంతే ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్ ను ఫ్రెగా కట్ చేసిన టమోటో, లేదా కీరకాయ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది.