Posts Tagged ‘paneer’

రుచికరమైన పనీర్ కట్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

aaloo-and-paneer-cutlets

కావలసిన పదార్ధాలు:

కాటేజ్ చీజ్ (పనీర్) – 2 కప్పులు (తరిగినది)

ఉడికించిన అన్నం – ½ కప్పు (చల్లారినది)

రుచికి సరిపడా ఉప్పు

పచ్చిమిర్చి – 1 ½ టేబుల్ స్పూను (సన్నగా తరిగినవి)

మైదా – ¼ కప్పు

కొత్తిమీర – ¼ టీస్పూను (తరిగినది)

క్యాప్సికం – ½ కప్పు వివిధ రంగులవి (సన్నగా తరిగినవి)

పైన కోటింగ్ కి బ్రెడ్ పొడి

నూనె – 2 టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం:

1.సన్నగా తరిగిన చీజ్ తీసుకుని అందులో ఉడికించిన అన్నాన్ని కలపండి.

2.ఇప్పుడు, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి.

3.ఇప్పుడు, కొత్తిమీర, తరిగిన క్యాప్సికం వేయండి. మీరు వివిధ రకాల క్యాప్సికం తీసుకున్నట్లయితే, మీ కట్లెట్ లు చాలా అందంగా కనిపిస్తాయి.

4.ఈ పదార్ధాలు అన్నిటినీ బాగా కలిపి, చేతితో చిన్నచిన్న ఉండలుగా చేయండి.

5.ఇప్పుడు, తవా వేడిచేసి, నూనె రాయండి.

6.దానిపై కట్లెట్ లను ఉంచి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.

7.రెండువైపులా బాగా ఉడికిన తరువాత, పుదీనా పచ్చడి లేదా టొమాటో సాస్ తో వేడిగా వడ్డించండి.

మేతి పన్నీర్ రైస్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

మెంతిఆకులు : 2 కట్టలు ( 150 gms) (శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పన్నీర్: 1 cup (కావాల్సిన సైజ్‌లో కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయలు: 1/2 cup (సన్నగా కట్ చేసుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు: 5 to 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

నిమ్మకాయ: 1 రసంతీసి పక్కన పెట్టుకోవాలి

బియ్యం: 1 cup

ఉప్పు : రుచికి సరిపడా

గరం మసాలా: 1/2 tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పనీర్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

2. అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. తర్వాత అందులోనే సన్నగా తరిగిన మెంతి ఆకులలు, పచ్చిమిర్చి వేసి 1 నిముషం వేగించుకోవాలి.

4. తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోయాలి. దీనితో పాటే గరం మసాలా, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి, అన్నం వండుకోవాలి.

5. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్ ముక్కలను వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. అంతే మేతీ పనీర్ రైస్ రెడీ, వేడి వేడిగా సర్వ్ చేయాలి.

6. మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

పళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి…

images (7)

కొన్ని పదార్ధాలని మనమెంతో ఇష్టంగా తింటాం. వాటిల్లో కొన్ని పళ్ళకు హాని చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటి వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే కొన్ని పళ్ళకు మేలు చేసేవి కూడా ఉంటాయి.

పళ్ల ఎనామిల్‌కి హాని చేసే వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు ముందుంటాయి. చిప్స్, తెల్ల బ్రెడ్, పాస్తా మరియు పిజ్జా లాంటివి మరీ తియ్యగా ఉండకపోవచ్చు కానీ తిన్నవెంటనే నోట్లో ఉండగానే చక్కెరగా మారిపోతాయి. వీటిని ఎంత తక్కువగా తింటే మన పళ్ళకు అంత మంచిది.

నిమ్మజాతి పండ్లు, టొమాటోలు మరియు ద్రాక్ష ఆహారంగా తీసుకున్నపుడు పళ్ళను శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

పాలు, పెరుగు, పనీర్ మరియు చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు మరియు లవణాలు పళ్ళ ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియంని అందిస్తాయి.

అలాగే పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయల్ని తరుచూ తీసుకుంటే మంచిది.

గోరు వెచ్చని గ్రీన్ టీ త్రాగడం వలన పళ్ళకు మేలు జరుగుతుంది. అందులో ఉండే పాలి ఫెనాల్స్ బ్యాక్టీరియాను నశింపచేసి దంత క్షయాన్ని అరికడతాయి.

పనీర్ క్యాప్సికమ్ భుర్జ్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం…

download (4)
కావల్సిన పదార్థాలు:
పన్నీర్: 200 gms(పొడి చేసుకోవాలి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటోలు: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: 1tsp
పసుపు: 1/2 tsp
కారం: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు:రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2-3tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్‌లోకి సాఫ్ట్‌గా వేగే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, జీలకర్ర వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో టమోటోలు మరియు ఉప్పు వేసి వేగించుకోవాలి.
5. టమోటో మెత్తగా వేగిన తర్వాత అందులో ఛాట్ మసాలా మరియు పనీర్ వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
6. 5నిముషాలు ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర కూడ వేసి గార్నిషింగ్‌గా ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పన్నీర్ క్యాప్సికమ్ బుర్జ్ రెడీ. ఈ రుచికరమైన వంటను పరోటాలు మరియు రోటీలతో సర్వ్ చేయాలి.

పనీర్ కుల్చా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

paneer-kulcha-recipe

కావాల్సిన పదార్ధాలు:

మైదా-3కప్పులు

పంచదార-1 టేబుల్ స్పూను

బేకింగ్ పౌడర్-1 టేబుల్ స్పూను

వెన్న-5 టేబుల్ స్పూన్లు

పాలు-1 కప్పు

ఉప్పు-రుచికి తగినంత

స్టఫ్ఫింగ్ కోసం:

తురిమిన పనీర్-200 గ్రాములు

పచ్చి మిర్చి-4(సన్నగా తరిగాలి)

గరం మసాలా పొడి-1 టీ స్పూను

కొత్తిమీర-2 టేబుల్ స్పూన్లు(సన్నగా తరగాలి)

కారం-2 టీ స్పూన్లు

చాట్ మసాలా- 2 టీ స్పూన్లు

ఉల్లిపాయ-1(సన్నగా తరగాలి)

తయారీ విధానం:

1.ఒక గిన్నె తీసుకుని దానిలో మైదా, బేకింగ్ పౌడర్ కలిపి పక్కన పెట్టాలి.

2.ఇంకొక గిన్నెలో పాలు, వెన్న, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి.

3.ఈ పాల మిశ్రమాన్ని మొదట పక్కన పెట్టుకున్న పిండిలో పోసి మెత్తని చపాతీ పిండి లాగ కలిపి ఒక మస్లిన్ క్లాత్ వేసి ఒక 40 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.

4.ఇప్పుడు స్టఫ్ఫింగ్ తయారు చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో తురిమిన పనీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కారం వెయ్యాలి.

5.అన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

6.ఇప్పుడు మస్లిన్‌క్లాత్ కప్పిన పిండి నుండి కొంచం ముద్ద తీసుకుని గుండ్రంగా వత్తుకోవాలి. మరీ పెద్దదిగా వత్తుకోకూడదు.

7.ఇప్పుడు గుండ్రంగా వత్తిన చపాతీని మీ అరచేతిలో ఉంచుకుని కొంచం స్టఫ్ఫింగ్ తీసి దీనిలో పెట్టి అంచులు మూసెయ్యాలి.

8.ఇప్పుడు పీట మీద కొంచం పిండి చల్లి స్టఫ్ చేసుకున్న ఈ ముద్దని మెల్లిగా చేతులతో తడుతూ గుండ్రంగా వత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కుల్చాలు తయారు చేసుకోవాలి.

9.ఒక ఓవెన్ ట్రే తీసుకుని దానికి కొంచెం నూనె రాయాలి. ఇలా చేస్తే కుల్చాలు ట్రేకి అతుక్కుపోవు.

10.ఓవెన్‌ని 200 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చెయ్యాలి.

11.ఇప్పుడు కుల్చాలని ట్రేలో పెట్టి 10-15 నిమిషాలు బేక్ చేసుకుంటే పనీర్ కుల్చా రెడీ. బేక్ అయిన కుల్చాలని నాలుగు ముక్కలుగా కోసి మీకిష్టమైన చట్నీతో వడ్డించడమే.

హెల్తీ అండ్ టేస్టీ పనీర్ చీజ్ బాల్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (13)

కావల్సిన పదార్థాలు:

పనీర్ – 500 g (grated)

చీజ్ – 1 cup (grated)

ఉల్లిపాయలు – 1 cup

పచ్చిమిర్చి – 4 to 5

బ్రెడ్ పొడి – 1/2 cup

బంగాళదుంపలు – 1/2 cup

కార్న్ ఫ్లోర్ – 1/2 cup

కారం – 1/2 teaspoon

ఉప్పు: రుచికి సరిపడా

నూనె తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పనీర్ తురుము మరియు చీజ్ తురుము వేయాలి.

2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, బంగాళదుంప, కారం వేసి బాగా మిక్స్ చేయాలి.

3. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి .

4. తర్వాత ఈ మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి.

5. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత, స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చయాలి.

6. నూనె వేడి అయ్యాక పనీర్ చీజ్ బాల్స్ బ్రెడ్ పొడిలో పొర్లించి తర్వాత కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.

7. డీప్ ఫ్రై చేసుకొన్న తర్వాత వీటిని ప్లేట్‌లోనికి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. అంతే హాట్ హాట్ పనీర్ బాల్స్ రెడీ, వీటిని టమోటో సాస్ తో సర్వ్ చేయండి..

క్రిస్పీ ఆలూ అండ్ పనీర్ ఫ్రైడ్ స్టిక్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

బంగాళదుంప – 3

పన్నీర్ – 200 g

ఉల్లిపయాలు – 1/2 cup

పచ్చిమిర్చి పేస్ట్ – 1/4th teaspoon

రెడ్ చిల్లీ పౌడర్ – 1/2 teaspoon

కార్న్ ఫ్లోర్ – 1 cup

మైదా – 1/4th teaspoon

మైదా – 1/2 cup

నూనె:సరిపడా

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. బంగాళదుంపను మరియు పనీర్‌ను స్లైస్‌గా కట్ చేసుకోవాలి.

2. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మార్చుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, కారం, మైదా, గరం మసాలా మరియు ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా నీరు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దీనికి వాటర్ జోడించాల్సిన పనిలేదు.

4. కార్న్ ఫ్లోర్‌ను ఆలూ మరియు పనీర్‌కు బాగా పట్టేలా మిక్స్ చేయాలి. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి.

5. నూనె వేడి అయిన తర్వాత అందులో ఆలూ మరియు పన్నీర్ స్టిక్స్ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో వేగే వరకూ వేగించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత టేస్టీ అండ్ ట్యాంగీ సాస్‌తో సర్వ్ చేయాలి. అంతే డీ ఫ్రైడ్ స్నాక్ రిసిపి రెడీ.

స్పైసీ దమ్ పనీర్ కాలీ మిర్చ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (8)

కావలసిన పదార్థాలు :

పన్నీర్ : 500 grms

కొత్తిమీర : ఒక కట్ట

పుదీనా : ఒక కట్ట

పెరుగు : 1cup

ఉల్లిపాయ: 1

నెయ్యి : 2tbsp

బిర్యానీ ఆకులు: 2

దాల్చినచెక్క : 1

యాలకులు: 3

లవంగాలు: 4

ధనియాలపొడి: 2tbsp

జీలకర్రపొడి : 1tsp

మిరియాలపొడి : 1tsp

గరం మసాలా : 1/2tsp

ఫ్రెష్ క్రీమ్ : 100grm

పచ్చిమిరపకాయలు: 2

అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tbsp

తయారుచేయు విధానం :

1. ముందుగా పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. వీటిని నూనె పీల్చుకునే కాగితం మీద వేసి పక్కన పెట్టాలి.

2. చల్లారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.

3. తర్వాత తిరిగి అదే పాన్‌లో నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి.

4. ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత పెరుగు వేశాక ధనియాలపొడి, జీలకర్రపొడి, ఉప్పు వేసి నీళ్లు పోయాలి. రెండు నిమిషాల తర్వాత పన్నీర్ వేసి బాగా కలపాలి.

5. ఆ తర్వాత కొత్తిమీర, ఫ్రెష్‌క్రీమ్, మిరియాలపొడి, గరంమసాలా పొడి వేసి మూత పెట్టేయాలి. వీలైతే మూతలేవకుండా చుట్టూ మైదాతో సీల్ చేయాలి. ఇప్పుడు మూత మీద బరువైనది ఏదైనా పెట్టి కాసేపు అలాగే ఉంచి దించాలి. అంతే నోరూరించే దమ్ పన్నీర్ కాలీ మిర్చ్ రెడీ.

పనీర్ పహాడి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (79)

కావల్సిన పదార్థాలు:

పనీర్: 250grm

క్యాప్సికమ్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)

పుదీనా : 1/4cup(సన్నగా కట్ చేసుకోవాలి)

కొత్తిమీర తరుగు: 1tbsp

కార్న్ ఫ్లోర్: 1tbsp

పచ్చిమిర్చి: 4

వెల్లుల్లి రెబ్బలు: 4

పెరుగు: 2tbsp

ఉప్పు: రుచికిసరిపడా

ధనియాలా పొడి : 1tsp+1tsp

జీలకర్ర పొడి : 1tsp

ఛాట్ మసాలా: 1tsp+2tsp

తందూరి మసాలా : 1tsp

బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2 tsp

కారం: 1/2tsp

నూనె: 4tbsp

స్కీవర్స్

తయారుచేయు విధానం:

1. ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలపొడి, జీలకర్ర, పెరుగు మరియు ఉప్పు వేసి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌లో సగం తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు కార్న్ ఫ్లోర్, తందూరి మసాలా, ఛాట్ మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు కారం ముందుగా తయారుచేసుకొన్న పేస్ట్‌లో సగం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని పనీర్ , క్యాప్సికమ్ కు మరియు ఉల్లిపాయలకు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు వీటిని స్కీవర్స్‌కు గుచ్చి రిఫ్రిజరేటర్‌లో పెట్టాలి.

4. తర్వాత పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసి, పన్నీర్‌ను మీడియం ఫ్లేమ్ మీద 20 నిముషాల గ్రిల్ చేయాలి. ఇది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఉంటే బ్రౌన్ కలర్లోకి మారి పనీర్‌తో పాటు వెజిటేబుల్స్ మెత్తగా ఉడుకుతాయి.

5. ఇవి ఫ్రై అయ్యి, మెత్తగా ఉడికిన తర్వాత ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి.

6. ఇప్పుడు పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పుదీనా పేస్ట్ వేసి కలర్ మారే వరకూ ఫ్రై చేయాలి.

7. ఇప్పుడు జీలకర్రపొడి, ఛాట్ మసాలా మరియు ధనియాల పొడి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి .

8. ఇప్పుడు ఈ గ్రేవీని పనీర్ స్కీవర్స్ మీద వేసి సర్వ్ చేయాలి. అంతే పనీర్ పహాడి రెడీ. ఈ స్పెషల్ పనీర్ పహాడి రిసిపిని రోటీలతో సర్వ్ చేస్తారు.

స్పైసీ అండ్ టేస్టీ పనీర్ జల్ ఫ్రీజ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (78)

కావల్సిన పదార్థాలు:

పనీర్: 150grm(కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి)

క్యారెట్: 1/4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

క్యాప్సికమ్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

టమోటో: 1(సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి)

టమోటో గుజ్జు: 1/4 cup

జీలకర్ర: 1/2 tsp

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tbsp

టమోటో కెచప్ : 1 tbsp

కారం: 1 tsp

పసుపు: 1/8 tsp

ధనియాల పొడి: 1tsp

గరం మసాల: 1/4 tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: సరిపడా

కొత్తిమీర తరుగు: 2 tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:

1. ముందుగా క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమోటో మరియు పన్నీర్ సన్నగా పొడవుగా కొద్దిగా మందంగా కట్ చేసి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర వేసి, వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకూ వేగించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

3. తర్వాత అందులో క్యారెట్, క్యాప్సికమ్ వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. అలాగే టమోటో మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.

5. ఇప్పుడు టమోటో గుజ్జు కూడా అందులో వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.

6. తర్వాత అందులో టమోటో కెచప్, కారం, పసుపు, ధనియాలపొడి, గరం మసాలా మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.

7.ఇప్పుడు అందులో 1/3కప్పు వాటర్ వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి.

8. తర్వాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి.

9. గ్రేవీ చిక్కబడే వరకూ మీడియం మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి. మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, 5నిముషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని, కొత్తిమీర తరుగును గార్నిష్‌గా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.