Posts Tagged ‘prawns’

ప్రాన్ మలై కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (3)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్: 1kg

ఉల్లిపాయలు: 1+1(కట్ చేసి పేస్ట్ చేయాలి)

వెల్లుల్లి: 8(పేస్ట్ చేయాలి)

కలౌంజి(ఉల్లిపాయ విత్తనాలు): 1/2tsp

పచ్చిమిర్చి: 2+6(మద్యకు కట్ చేసి పస్ట్ చేయాలి)

కొబ్బరి పాలు: 1cup

మస్టర్డ్ పేస్ట్: 2tbsp

పసుపు: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

మస్టర్డ్ ఆయిల్: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ప్రాన్స్‌ను శుభ్రం చేసి పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. తర్వాత మస్టర్డ్ ఆయిల్‌లో వేసి 3-4నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ విత్తనాలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి.

3. అంతలోపు ఒక ఉల్లిపాయను, వెల్లుల్లి మరియు మిగిలిన పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

4. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో మస్టర్డ్ పేస్ట్, ఉప్పు, పసుపు చిలకరించి ఒక 5నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. చివరగా కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసి 2నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. తర్వత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ప్రాన్ మలై కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

కొంకన్ స్టైల్ ప్రాన్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (65)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్: 1kg

ఉల్లిపాయలు: 3 (పెద్దవి, సన్నగా తరిగి పెట్టుకోవాలి)

టమోటో: 3(పెద్దవి, సన్నగా తరిగిపెట్టుకోవాలి)

కొత్తిమీర: కొద్దిగా (తరిగి పెట్టుకోవాలి)

నూనె: 4tsp వెల్లుల్లి: 3tsp

పసుపు: 1tsp

చింతపండు: 1tsp

కారం: 1tsp

లవంగాలు: 2

దాల్చిన చెక్క: 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా (ప్రాన్స్) రొయ్యలను శుభ్రం చేసుకొని, వాటికి వెల్లుల్లి, పసుపు, కారం, చింతపండు పులుసు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 15-30నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒకనిముషం వేగించుకోవాలి.

3. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. 5నిముషాల తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులోనే టమోటో ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి, 5నిముషాలు సిమ్ లో పెట్టి ఉడికించాలి. ప్రాన్స్ ష్రింక్ అయ్యే వరకూ ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వుతున్న సాస్ నుండి ఆయిల్ విడిపోవడాన్ని గమనించండి.

6. ఇప్పుడు అందులోనే కొత్తిమీర తరుగు, మరియు అవసరం అయితే ఉప్పు వేసి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. అంతే కొంకన్ స్టైల్ ప్రాన్ కర్రీ రెడీ. దీన్ని రైస్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

గోంగూర రొయ్యల కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (22)

కావల్సిన పదార్థాలు:

గోంగూర: 1cup

రొయ్యలు: 1/2cup

నెయ్యి: 4tbsp

టమోటోలు: 3

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp

ఉల్లిపాయలు: 2

పచ్చిమిర్చి-ఎండుమిర్చి: 4చొప్పున

పోపుదినుసులు అన్నీ కలిపి : కొద్దిగా

ధనియాలపొడి: 1/2tsp

పసుపు: 1/4tsp

కారం: 2tsp

ఉప్పు: రుచికి తగినంత

కరివేపాకు: రెండు రెమ్మలు

కొత్తిమీర తరుగు : కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా గోంగూరను తొడిమల నుండి ఆకులను వేరిచేసి శుభ్రంగా కడిగి, తర్వాత గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి.

2. తర్వాత పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్‌గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఆ తర్వాత అదే పాన్‌లో అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.

4. అందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.

5. కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

6. 5-10నిముషాల తర్వాత, కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. నోరూరించే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

చిల్లీ ప్రాన్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

1

కావల్సిన పదార్థాలు:

రొయ్యలు: 1kg

వెల్లుల్లిపాయ: 1

పచ్చిమిరపకాయలు: 6

కొత్తిమీర: 2కట్టలు

అజీనమోటో పౌడర్: 1tsp

కారం: 2tsp

ఉప్పు: రుచికి తగినంత

గుడ్డు: 1

మైదా: 3tbsp

కార్న్ ఫ్లోర్: 3tbsp

అల్లం, వెల్లుల్లి: 2tbsp

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా రొయ్యల్ని పొట్టు తీసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి.

3. ఇప్పుడు అందులోనే కొత్తిమీర తరుగు, కారం, అజీనమోటో పౌడర్, ఉప్పు కూడా వేసి బాగా వేయించాలి.

4. ఇలా వేగిన మసాలా ముద్దని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి.

5. ఇప్పుడు మరో గిన్నెలోకి కొద్దిగా అజినీమోటో పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, మైదా పిండి, మొక్కజొన్నపిండి(కార్న్ ఫ్లోర్) తీసుకొని కలపాలి.

6. అందులోనే రొయ్యలు కూడా వేసి బాగా కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడెక్కాక ఈ రొయ్యల్ని అందులో ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.

7. ఇలా వేయించిన రొయ్యల్ని ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలాలో కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి, మీడియం మంట మీద బాగా ఉడికించాలి.

8. బాగా దగ్గరయ్యాక కొద్దిగా మిరియాలపొడి వేసి దించేయాలి. అంతే చిల్లీ ప్రాన్స్ రెడీ.

ప్రాన్స్ – క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (6)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్(రొయ్యలు)- 500grms(షెల్ తొలగించి పెట్టుకోవాలి)

ఉల్లిపాయ: 1(సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు: 8(సన్నగా తరిగినవి)

కాప్సికమ్ లేదా బెల్ పెప్పర్: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)

టమోటో: 1 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

చింతపండు గుజ్జు: 1tbsp

పచ్చిమామిడికాయ తురుము: 1tbsp

కారం : 1/2 tsp

పసుపు పొడి: 1/2 tsp

ధనియాల పొడి: 1tsp

ఉల్లిపాయ విత్తనాలు పొడి లేదా కలౌంజీ: 1/2 tsp

పచ్చిమిర్చి: 2 (మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)

నూనె: 2tbsp

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి మ్యారినేట్ చేసి 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

2. అంతలోపు కట్ చేసుకోవల్సిన పదార్థాలన్నింటిని తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకొని, వేడయ్యాక అందులో ప్రాన్స్ వేసి, లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు అదే పాన్ లో ఉన్న ఆయిల్ తోటే ఉల్లిపాయ విత్తనాలు లేదా కలౌంజీ మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. వెంటనే వెల్లుల్లి కూడా వేసి మరో 2 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్ కూడా వేసి మరో మూడు నాలుగు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

7. తర్వాత టమోటో ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి, మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తూ మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. టమోటో మెత్తబడే వరకూ వేగించుకోవాలి.

8. తర్వాత అందులో చింత పండు గుజ్జు మరియు మామిడి తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

9. ఇప్పుడు అందులో రెండు కప్పుల నీరు పోసి, కర్రీని బాగా ఉడికించుకోవాలి.

10. కర్రీ ఉడుకి, గ్రేవీ చిక్కబడే సమయంలో ముందుగా వేగించి పెట్టుకొన్న ప్రాన్స్ (రొయ్యల)ను అందులో వేసి మొత్తం మరోసారి మిక్స్ చేసి, తక్కువ మంట మీద 5 నుండి 10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే అద్భుతమైన ప్రాన్-క్యాప్సికమ్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

సీఫుడ్ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

 Seafoods_Fish_Food_490069
జ్ఞాపకశక్తి సరిగా లేకపోవడం కారణంగా చెప్పిన పనులు లేక చేయాల్సిన పనులు గుర్తుండకపోవడం, చదవింది మరచిపోవడం ఇలా బాధపడేవారికి సీఫుడ్ మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనీసం వారానికి ఒకసారి చేపలు, పీతలు, రొయ్యలు లాంటివి మన ఆహారంలో ఉండేలా చూసుకుంటే మతిమరపు సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు అంటున్నారు.
ముఖ్యంగా, వృద్ధుల్లో మతిమరపు ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అందుకే ఆహారంలో సీఫుడ్ ఉంటే మతిమరపు సమస్య నుంచి బయటపడొచ్చునని చెప్తున్నారు.
రొయ్యలలో కనిపించే ప్రోటీన్, కాల్షియం భాస్వరం, మెగ్నీషియం వంటి అనేక విటమిన్స్ సమర్థవంతంగా ఎముక క్షీణతకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహాయపడతాయి. వారం రోజుల ఆహారంలో రొయ్యలు జోడించడం ద్వారా ఎముకలు బలంగా చేసుకోవచ్చు.
రొయ్యలలో ఇనుము ఖనిజం అధిక స్థాయిలలో ఉండటం ద్వారా మెదడు పనితీరు మెరుగు అవుతుంది. మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని సాధిస్తూనే గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను మెరుగుపరుస్తుంది. రొయ్యలు అన్ని కొలెస్ట్రాల్‌లను సమానంగా రూపొందిస్తాయి. కొలెస్ట్రాల్ యొక్క ప్రయోజనకరమైన రకం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒక మూలంగా ఉన్నాయి. ఈ ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మహిళలకు రుతుక్రమ రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది. అంతేకాక రక్త ప్రవాహంలో కొలెస్ట్రాల్ రూపాలు తగ్గించడం ద్వారా పునరుత్పత్తి అవయవాలకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగేలా చూస్తుంది.

కేరళ స్టైల్ ప్రాన్ పెప్పర్ ఫ్రై ఎలా తయారుచేయాలో ఒకసారి చూడండి…

kerala-prawns-fry

రొయ్యలు : 250 grm(రొయ్యలకు చివర్లో తోకలు కట్ చేసి శుభ్రం చేసుకోవాలి)

పచ్చిమిర్చి : 4

అల్లం : 25grm

వెల్లుల్లి : 25 grm

షలాట్స్ : 15 (లేదా 1 ఎర్ర ఉల్లిపాయ)

కరివేపాకు: 3 కొమ్మలను (ఇవే ఈ వంటను మరింత రుచికరంగా చేస్తుంది)

కొబ్బరి లేదా కొబ్బరి తురుము: 3tbsp

పెప్పర్ పౌడర్: 1tsp

కారం: 1tsp

పసుపు: 1/2tsp

ఆయిల్: సరిపడా

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న రొయ్యలను ఒక బౌల్లో వేసి, వాటితో పాటు, పసుపు, పెప్పర్ మరియు ఉప్పు, అల్లం వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2.పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో కరివేపాకు మరియు ఉల్లిపాయలు ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

3. ఇప్పడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకోవాలి.

4. ఈ పదార్థాలన్నీ వేగుతూ, మంచి ఆరోమా స్మెల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

5. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న రొయ్యలు మరియు వాటితో పాటు మసాలా కూడా వేసి ఫ్రై చేయాలి. ప్రాన్స్ ను ఎక్కువగా ఉడికించకూడదు.

6. కొద్దిగా ఉప్పు చేర్చి, ప్రాన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. అయితే ఎక్కువ సేపు ఉడికించకూడదు, ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

7. చివరగా అందులో కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరి తురమును జోడించి మిక్స్ చేసి, రైస్ లేదా చపాతీతో సర్వ్ చేయండి.

ప్రాన్ సలాడ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…బ్యాంగ్ కాక్ స్పెషల్…

download (66)

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్(రొయ్యలు): 1/2kg

వెల్లుల్లి రెబ్బలు: 6-7

సలాడ్ డ్రెస్సింగ్ కోసం:

చిల్లీ సాస్: 2 tbsp

ఫిష్ సాస్ : 5-6 tbsp

వైట్ వెనిగర్: 4 tbsp

గ్రీన్ చిల్లీస్: 7-8

నువ్వుల నూనె: 1 tsp

నూనె: అరకప్పు

సలాడ్ తయారికోసం:

ఉల్లికాడలు: 4-5

క్యారెట్స్ : ఒకటి పెద్దది

కొత్తిమీర: 1కట్ట

థాయ్ రెడ్ చిల్లీ: 4-5

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా నీళ్ళలో ప్రాన్స్ మరియు కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత అందులో వెల్లుల్లి వేయాలి.

2. సలాడ్ డ్రెస్సింగ్ తయారుచేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫిష్ సాస్, చిల్లీ సాస్, వైట్ వెనిగర్ మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు నువ్వుల నూనె వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని డ్రెస్సింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

3. తర్వాత క్యారెట్ ను సన్నగా తరిగి అందులో గ్రీన్ కలర్ ఉల్లికాడలను, కొత్తిమీర తరుగు మరియు థాయ్ రెడ్ చిల్లీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

4. ఇప్పుడు ముందుగా వేడినీళ్ళల్లో ఉడికించి పెట్టుకొన్న ప్రాన్స్ ఇందులో వేసి మిక్స్ చేయాలి.

5. చివరగా సలాడ్ డ్రెస్సింగ్ ను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి సర్వ్ చేయాలి. అంతే ప్రాన్ సలాడ్ రిసిపి రెడీ.

పాలక్ ప్రాన్ కర్రీ రిసిపి తయారుచేయు విధానం…

images (26)

కావలసిన పదార్థాలు:

రొయ్యలు – 200grms(పొట్టు వలచి, శుభ్రం చేసిన)

పాలకూర తరుగు – 2cups

ఉల్లిపాయ – 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

అల్లంవెల్లుల్లి పేస్టు – 2tsp

కారం – 1tsp

దనియాలపొడి – 1tsp

గరం మసాల పొడి – 1tsp

పసుపు – చిటికెడు

ఉప్పు – రుచికి తగినంత

పచ్చిమిర్చి – 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

నూనె – సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో రొయ్యల్ని పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి.

2. మరో పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాలు వేగించాలి.

3. ఇప్పుడు అందులోనే రొయ్యలు, కారం, దనియాలపొడి కలిపి మరికొద్దిసేపు వేగించాలి.

4. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్దిసేపు ఉడికించాలి.

5. రొయ్యలు ఉడికి, కూర చిక్కబడ్డాక గరం మసాల పొడి వేసి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది. (ఇష్టమైతే పాలకూర తరుగు బదులు దాన్ని ఉడికించి, పేస్టుచేసి కూడా కలుపుకోవచ్చు). అంతే పాలక్ ప్రాన్ కర్రీ రెడీ.

స్పైసీ అండ్ టేస్టీ గార్లిక్ ప్రాన్ కర్రీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

Prawn-coconut-curry

కావల్సిన పదార్థాలు:

ప్రాన్స్: 250gms(మీడియం సైజ్)

ఉల్లిపాయ: 1

వెల్లుల్లి: 8-10రెబ్బలు(పేస్ట్ చేసుకోవాలి)

టమోటో: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

నిమ్మరసం: 1tbsp

కారం: 1tsp

పంచదార: 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

కరివేపాకు: రెండు రెమ్మలు

నూనె: సరిపడా

నీళ్ళు: 1/2cup

తయారు చేయు విధానం:

1. ముందుగా ప్రాన్స్ ను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రాన్స్ తడి ఆరేలోపు, ఒక బౌల్లో నిమ్మరసం, ఉప్పు, మిక్స్ చేసి తర్వాత ప్రాన్స్ కు మ్యారినేట్(అప్లై) చేసి పది నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

2. 10నిముషాల తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద 3-4నిముషాలు వేగించుకోవాలి.

3. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.

4. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న టమోటో, పసుపు, కారం, పంచదార మరియు ఉప్పు వేసి మరో 5నిముషా పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి.

5. టమోటో వేగుతూ మెత్తబడ్డాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ ను వేసి ఒక నిముషం వేగించాలి, తర్వాత సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.

6. తర్వాత అందులో కరివేపాకు వేసి, మూత పెట్టి 10నిముషాల పాటు అతి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

7. ప్రాన్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే గార్లిక్ ప్రాన్ కర్రీ రెడీ. ఈ కర్రీనీ వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.