Posts Tagged ‘protein food’

బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ పాటించండి…

download (34)
అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాంటి హై ప్రోటీన్స్ డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో హై ప్రోటీన్సే కాకుండా క్యాలరీలు, పోషక విలువలు, ఫైబర్ కలిగి ఉంది. అందువల్ల రెగ్యులర్ డైట్‌లో ఎండుద్రాక్ష, బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిని చేర్చుకోండి.

ఆరోగ్యానికి మొదటి మెట్టు ఉదయం తీసుకునే అల్పాహారం…

images (32)

వివిధ కారణాల వలన ఈ రోజుల్లో ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా తక్కువైపోయింది. కాని మన శరీర ఆరోగ్యానికి ప్రధానంగా దోహద పడే ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మరువ కూడదు.

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు మొదలైన ప్రొటీన్‌లు కలిగి ఉండే ఆహారంగా తీసుకుంటే ఉత్తమం.

మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ఉపయోగపడుతుంది. వారికి అల్పాహారం ఇచ్చేటపుడు బలవంతంగా కాకుండా, నిదానంగా ఇవ్వాలి.

చిన్న పనికే అలసిపోతుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి…

images
చిన్న పనికే అలసిపోతుంటే శరీరంలో శక్తిస్థాయిలు తగ్గిపోతున్నాయని గమనించాలి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోజూ వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా ఎంతో ఉల్లాసాన్ని కూడా కల్గిస్తుంది. ఇలా చేయటం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేయడంతో రోజు మొదలవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ప్రోటిన్స్‌ ఉన్న సోయాసాస్‌, గుడ్లు, పాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
ఉదయాన్నే వచ్చే సూర్య కిరణాలు శరీరంపై పడే విధంగా పది నిమిషాలు ఎండలో ఉండటం మంచిది. సూర్య కిరణాలు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి, దాంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్‌ ‘డి’ కూడా అందుతుంది. రోజు తినే ఆహారంతో పాటు, స్నాక్స్‌ కూడా తీసుకుంటే మంచిది. స్నాక్స్‌లో ఆయిలీ ఫుడ్‌కు బదులుగా ఫ్రూట్స్‌, జ్యూస్‌, ఉడకబెట్టిన గింజలు తీసుకోవాలి. ఇది తాత్కాలికంగా శరీరానికి ఉపశమనం కల్గిస్తుంది.
రోజూ మధ్యాహ్నం పూట పావు గంట నిద్రపోతే ఒత్తిడి మాయమైపోతుంది. ఆఫీసుల్లో పని చేస్తున్నప్పుడు తొందరగా ఒత్తిడికి గురవుతుంటే పది నిమిషాలు లేచి అటు ఇటు నెమ్మదిగా నడవటం మంచిది. శరీరానికి అవసరమైనంత నీరు అందకుంటే డిహైడ్రేట్‌ అవుతుంది. ఇది ఒకరకమైన ఒత్తిడికి గురి చేస్తుంది. ఎక్కడున్నా ఒక వాటర్‌ బాటిల్‌ను వెంట ఉంచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.