Posts Tagged ‘ramzan’

రంజాన్ స్పెషల్ బటర్ ఖీమా మసాల రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

butter-kheema

కావల్సిన పదార్థాలు:

బీఫ్ లేదా మటన్: 1kg

పెరుగు: 1cup

బటర్: 1cup

అల్లం పేస్ట్: 3tsp

వెల్లుల్లి పేస్ట్ : 3tsp

ఉల్లిపాయలు: 3పీసెస్

లవంగాలు: 5-7

దాల్చిన చెక్క: 1

బ్లాక్ యాలకలు: 2

గ్రీన్ యాలకలు: 2

పచ్చిమిర్చి: 8

బిర్యానీ ఆకు: 1

ఉప్పు: రుచికి సరిపడా

కారం: 3tsp

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్ని టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.

5. ఈ కీమా మిశ్రమానికి బటర్ జోడించి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమానికి ముందుగా తయారుచేసుకొన్న మసాలా మిశ్రమం మిక్స్ చేయాలి.

7. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి, తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి.

8. తర్వాత అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించి, పెరుగు వేసి ఖీమా మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మరియు ఎండు మిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ ఖీమా మసాలా రెడీ. దీన్ని నాన్ మరియు చపాతీతో సర్వ్ చేయాలి.

కడై మటన్ గ్రేవీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (32)

కావల్సిన పదార్థాలు:

మటన్ – 750 g

ఉల్లిపాయలు- 2 cups

టమోటోలు – 1 cup

అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 teaspoon

పచ్చిమిర్చి – 6 to 8

కారం – 1/2 teaspoon

గరం మసాలా – 1/2 teaspoon

మీట్ మసాలా పౌడర్ – 1/2 teaspoon

ధనియాల పొడి – 1/2 teaspoon

పసుపు – 1/2 teaspoon

కస్తూరి మేతి – 1/2 teaspoon

కొత్తిమీర- 1/2 cup

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో మటన్ , కొద్దిగా పసుపు వేయాలి.

2. తర్వాత అందులో నీళ్ళు సోసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

3. కుక్కర్ లో ప్రెజర్ తగ్గిన తర్వాత, పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

4. కాగే నూనెలో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.

5. 5 నిముషాల తర్వాత ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా, మరియు కారం వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.

6. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోయాలి. ఇప్పుడు అందులో కస్తూరి మేతీ, మీట్ మసాలా పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.

7. 15 నిముషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే కడై మటన్ గ్రేవీ రిసిపి రెడీ. ఈ స్పెషల్ మటన్ గ్రేవీ రిసిపి రంజాన్ స్పెషల్ వంట.

హెల్తీ వెజిటేరియన్ సలాడ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (20)

కావల్సిన పదార్థాలు:

క్యారెట్ ముక్కలు- 1/2 cup

స్ప్రింగ్ ఆనియన్స్: 1/2 cup

టమోటోలు – 1/2 cup

కీరదోసకాయ – 1/2 cup

స్వీట్ కార్న్ – 1/2 cup

ఆరెంజ్ – 1/2 cup

వాటర్ మెలోన్ – 1/2 cup

ద్రాక్ష – 1/2 cup

మామిడిపండ్లు – 1/2 cup

పెప్పర్ – 1/2 teaspoon

నిమ్మరసం – 1 teaspoon

తేనె – 1/2 teaspoon

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కీరదోసకాయ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్ మరియు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.

2. ఇప్పుడు, అందులో మిగిలిన ఫ్రూట్స్ అన్నీ వేసి, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

3. తర్వాత, అందులో నిమ్మరసం మరియు ఫ్రూట్స్ మరియు వెజ్జీస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత చివరగా కొద్దిగా తేనెను టాపింగ్ గా మిక్స్ చేసి సర్వ్ చేయాలి. అంతే ఈ రంజాన్ సమయంలో హెల్తీ ఫ్రూట్ సలాడ్ రెడీ.

ఖీమా సమోసా రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం… రంజాన్ స్పెషల్…

download

కావల్సిన పదార్థాలు:

కవరింగ్ కోసం:

మైదా- 2 cups

బట్టర్ – 2 tablespoons

ఉప్పు – According to taste

పెరుగు – 1½ tablespoon

నీళ్ళు : కలుపుకోవడానికి సరిపడా

స్టఫింగ్ కొరకు

మటన్ లేదా చికెన్ ఖీమా – 500 grams

నూనె- 2½ tablespoons

సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు – 2

సన్నగా తరిగిన అల్లం- 2 tablespoons

సన్నగా తరిగిన వెల్లుల్లి – 2½ tablespoons

కొత్తిమీర తరుగు – కొద్దిగా

పుదీనా (అసరమనుకుంటే) – 2 tablespoons

సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2

స్ప్రింగ్ ఆనియన్స్ – 2½ tablespoons

పసుపు – ¼th teaspoon

కారం – 1 teaspoon

జీకలర్ర పొడి- 1 teaspoon

గరం మసాలా పౌడర్ – ½ teaspoon

మటన్ స్టాక్ – 1 cup

నూనె డీప్ ఫ్రై చేయడానికి

ఉప్పు: రుచికి తగినంత

పంచదరా – చిటెకెడు

పిండి తయారీ:

1. ముందుగా మైదా , సాల్ట్ తీసుకుని మిక్స్ చేయాలి. అందులో బటర్ చుంక్సు, పెరుగు వేయాలి.

2. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. తర్వాత నీళ్ళు పోసి మెత్తగా పిండిని కలపాలి.

3. నీళ్ళు ఎక్కువగా పోయకుండా, సరిపడా పోసి, పిండిని సాఫ్ట్‌గా స్మూత్‌గా కలిపి పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక క్లీన్‌గా ఉండే తడిబట్టను పిండి మీద కప్పి ఉంచాలి. దాదాపు అరగంట అలాగే ఉండనివ్వాలి.

స్టఫింగ్ కోసం:

1. ఖీమాను శుభ్రంగా కడిగి నీరు మొత్తం పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.

2. పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయలు వేసి వేగించాలి.

3. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లోనికి మారి, మెత్తబడేవరకూ వేగించుకోవాలి.

4. ఇప్పుడు, అందులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి 15నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత అందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న ఖీమా, ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు సరిచూసుకుని వేయాలి. ముందు పిండిలో కూడా జోడించడం వల్ల స్టఫింగ్‌లో తక్కువ వేసుకుంటే సరిపోతుంది.

6. ఖీమా మెత్తగా వేగిన తర్వాత అందులోనే కారం, పసుపు, మరియు జీలకర్ర వేయాలి.

7. ఇప్పుడు మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. తర్వాత షుగర్ జోడించాలి.

8. తర్వాత మటన్ లేదా చికెన్ స్టాక్‌ను పోయాలి. తక్కువ మంటలో ఉండికించాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల బాగామెత్తగా, త్వరగా ఉడుకుతుంది.

9. మద్యలో మూత తీసి చూడటం వల్ల మటన్ నుండి ఆయిల్ విడిపోయనట్లు, డ్రైగా ఉడుకుతున్నట్లు గమనించాలి. ఇలా ఉడికేటప్పుడు, గరం మసాలా జోడించి ఒక నిముషం ఫ్రై చేసుకుని స్టౌ మీద నుండి క్రిందికి దింపుకోవాలి.

10. కొత్తిమీర, పుదీనా ఆకులను మరియు స్ప్రింగ్ ఆనియన్స్‌ను కూడా చల్లుకోవాలి.

11. మొత్తం మిశ్రమం మరో సారి మిక్స్ చేసి స్టఫింగ్‌కు సిద్దం చేసుకోవాలి.

సమోసా కొరకు:

1. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దిగా తీసుకుని, చిన్న చిన్న ఉండలు చేసి, చాపాతీల్లా రోల్ చేసుకోవాలి.

2. చపాతీలా రుద్దుకున్న తర్వాత మద్యలోకి కట్ చేసి, ఒకదాన్ని కోన్ షేప్‌లో మడత పెట్టాలి.

3. ఈ కోన్ షేప్‌లో ముందుగా స్టఫింగ్ కోసం సిద్దం చేసుకున్న మిశ్రమాన్ని పెట్టాలి.

4. తర్వాత అన్ని వైపులా క్లోజ్ చేయాలి.

5. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న సమోసాలను 30 నిముషాలు రిఫ్రిజరేటర్‌లో స్టోర్ చేయాలి.

6. అరగంట తర్వాత డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత సమోసాలను ఒక్కటి రెండు కాగే నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

7. డీఫ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్‌ను తొలగించడానికి పేపర్ టవల్ మీద వేయాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి మార్చుకుని, మీకు నచ్చిన ఫేవరెట్ సాస్‌తో వడ్డించాలి. అంతే రంజాన్ స్పెషల్ ఖామా సమోసా రెడీ.