Posts Tagged ‘scrub’

మోచేయి నలుపు తగ్గించే సులభ చిట్కాలు…

images (50)

నిమ్మరసం: నిమ్మతొక్కను పంచదార లేదా ఉప్పు లో డిప్ చేసి, మోచేతుల మీద స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరగా మార్పు వస్తుంది.

షుగర్ స్ర్కబ్: చేతులను చల్లటి నీటితో కడిగి, తర్వాత పంచదార చిలకరించి స్క్రబ్ చేయాలి. ముఖ్యంగా మోచేతుల దగ్గర స్ర్కబ్ చేయడం వల్ల నలుపుతగ్గతుంది.

కాలి మడమలు నల్లగా ఇబ్బంది పెడుతున్నాయా…

images (80)

 

స్క్రబ్బింగ్:

ఫ్యూమిస్ స్టోన్ తో డార్క్ యాంకిల్ వద్ద స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డెడ్ స్కిన్ తొలగిపోతుంది. నలుపును తేలిక పరుస్తుంది.

ఆయిల్ స్కిన్ వారిలో సన్ టాన్ నివారించే బెస్ట్ హోం మేడ్ స్క్రబ్…

download (5)

ఆయిల్ స్కిన్ కోసం ఇది ఒక బెస్ట్ టానింగ్ స్క్రబ్. ఒక బౌల్లో గందం మరియు పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేయాలి . దీనికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి దీన్ని టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై ఆయిన తర్వాత పూర్తిగా కడిగేసుకోవాలి.

సమ్మర్ లో స్కిన్ ట్యాన్(నల్లగా మారిన చర్మాన్ని)తెల్లగా మార్చే గులాబీ, పంచదార బాడీ స్క్రబ్…

1282943-bigthumbnail

– ఫ్రెష్ గా ఉండే గులాబీలను తీసుకుని వాటి నుండి సున్నితంగా రేకులను వేరుచేయాలి. గుప్పెడు గులాబీ రేకులకు ఒక కప్పు పంచదార సరిపోతుంది.

– ఇప్పుడు ఒక కప్పు పంచదార తీసుకోవాలి.

– ఈ రెండింటి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అంతే గులాబీ బాడీ స్క్రబ్ రెడీ, దీన్ని ఉపయోగించడం చాలా సులభం. కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కూడా జోడించుకోవవచ్చు. దీన్ని బాడీ స్క్ర్రబ్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల అద్భుత మైన గ్గోయింగ్ స్కిన్ పొందవచ్చు, టాన్ కూడా తగ్గిస్తుంది.

రోజ్ బాడీ స్క్రబ్బర్ తో ప్రయోజనాలు:

– ఈ రోజ్ స్క్రబ్ ను రెగ్యులర్ గా రోజూ ఉపయోగిస్తుంటే, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

– బ్లాక్ అయిన చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి శుభ్రం చేసి, మురికిని తొలగించి, మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.

– రోజ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల, బాడీ ట్యాన్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది, ముఖ్యంగా వేసవిలో ఇది బాగా పనిచేస్తుంది.

గులాబీలతో ప్రయోజనాలు:

– గులాబీలో ఉండే ఎఫెక్టివ్ లక్షణాలు స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. – ఇంకా చర్మంలో డ్రైనెస్ తగ్గిస్తుంది. సాప్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

– గులాబీలలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.

– గులాబీలను స్కిన్ కేర్ లో ఉపయోగించిటం వల్ల స్కిన్ బ్రేక్ అవుట్స్ ను తొలగిస్తుంది.

– అలాగే గులాబీలో హైపర్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.

– చర్మంను శుభ్రం చేయడంలో, చర్మానికి కావల్సిన మాయిశ్చరైజింగ్ అందివ్వడంలో గులాబీలు అద్భుతంగా సహాయపడుతాయి.

– ఇంకా ఇది నేచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. ఇద యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కలిగిస్తుంది.

చర్మానికి పంచదార అందించే ప్రయోజనాలు:

– ముఖ చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

– ఇంకా ఇది చర్మంలో డీప్ గా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మంలో మురికిని, ఇతర మలినాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

– పంచదారలో ఉండే గ్లైకోలిక్ యాసిడ్, చర్మంను పూర్తిగా మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది.

– ఇంకా పంచదారలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి ఆసిడ్ హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

– ఇంకా చర్మంలో మూసుకుపోయిన చర్మ రంద్రాలను శుభ్రంచేస్తుంది, చర్మంలో జిడ్డు, ఆయిల్ నెస్ లేకుండా నివారిస్తుంది.

చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చే స్క్రబ్…

Article-3_Picture-3_Oatmeal-exfoliating-face-mask

ఆపిల్ గుజ్జులో గోధుమ పొట్టు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకోవడానికి సులభ మార్గాలు…

images

కాళ్ళని నానబెట్టడం: మొట్టమొదటగా ఒక పెద్ద టబ్ లో గోరువెచ్చటి నీళ్ళు పోసి కాళ్ళని నానబెట్టండి. ఎప్సం సాల్ట్ లేదా షాంపూ నీటిలో కలిపి నానపెడితే పాదాలు మ్రుదువుగా మారతాయి. కాళ్ళు కాసేపు నానిన తరువాత ప్యూమిక్ స్టొన్ తీసుకుని మీ అరికళ్ళు, పాదాలు రుద్దుకోవాలి. మెల్లిగా రుద్దుకోండి సుమా.

లోషన్ తో పాదాల మర్దనా: కాస్త బాడీ లోషన్ తీసుకుని మీ పాదాలకి మ్రుదువుగా మర్దనా చెయ్యండి. మీ పాదాలు ఇప్పటికే మ్రుదువుగా మారి ఉంటాయి. మర్దనా అయ్యాకా చివర్లో వాస్ లైన్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ట్రిమ్మర్ తీసుకుని గోర్ల చుట్టూ ఉన్న మ్రుత చర్మాన్ని(డెడ్ స్కిన్) తొలగించండి. ట్రిమ్మర్ వాడేటప్పుడు జాగ్రత్త.

నెయిల్ పాలిష్ తొలగించడం: మీ కాలిగోళ్లకి ఉన్న పాత నెయిల్ పాలిష్ ని ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ తో తొలగించండి.తొలగించాకా ఒక చిన్న కాటన్ బాల్ మీద నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి గోళ్ళ మీద అద్దితే ఇంకా మిగిలిఉన్న పాలిష్ కూడా పోతుంది.

గోళ్ళకి నెయిల్ పాలిష్ వెయ్యడం: ఇప్పుడు నెయిల్ పాలిష్ని  గోళ్ళ పై భాగం లో వెయ్యండి. ఒక నిమిషము ఆరిన తరువాత మరలా సెకండ్ కోట్ వెయ్యండి. సెకండ్ కోట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కోట్ ఏమన్నా అసమానతలు ఉంటే వాటిని కప్పిపుచ్చి గోళ్ళు అందంగా కనపడేటట్లు చేస్తుంది.

అసమానతలని కప్పిపుచ్చడం లేదా ఎక్స్ ట్రా నెయిల్ పాలిష్ తొలగించడం: ఇక్కడే మీరు పొరపాటు చేసే అవకాశం ఉంది. కన్సీలర్ బ్రష్ తీసుకుని దానిని ఎసిటోన్ లో ముంచి మెల్లిగా గోళ్ళ చుట్టూ ఉన్న ఎక్స్ ట్రా నెయిల్ పాలిష్ ని తొలగించండి. ఇది చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తే చూడటానికి గోళ్ళు అందంగా ఉంటాయి.

నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరనివ్వండి: అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మీ నెయిల్ పాలిష్ ని మరికాస్త ఆరనివ్వండి. త్వరగా ఆరాలంటే మీ పాదాలని చన్నీటిలో ముంచి తీయండి. ఈ చిట్కా మీ నెయిల్ పాలిష్ ఎక్కువరోజులు నిలబడేటట్లు చేస్తుంది

క్లియర్ పాలిష్ వెయ్యడం: ఇది ఆఖరి స్టెప్. ఒక్కో గోరు మీదా క్లియర్ నెయిల్ పాలిష్ వెయ్యండి. ఇప్పుడు చూసుకోండి, మంచు అంత స్వచ్చం గా లేవూ మీ పాదాలు?? చూసారుగా, ఇదేమీ కష్టం కాదు. ఫ్రెంచ్ పెడిక్యూర్ కి కావల్సిందల్లా సామాగ్రి ని వెతికి తెచ్చుకోవడం మరియు కాస్త ఓపిక మాత్రమే. మరెందుకాలశ్యం మీ పాదాలకి ఒక కొత్త రూపునివ్వండి.