Posts Tagged ‘snack’

అడపాయసం ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (5)

కావల్సిన పదార్థాలు:

అడ(రైస్ల్ ప్లాక్స్ లేదా రైస్ చిప్స్): 1packet (వీటిని బియ్యంతో తయారుచేస్తారు)

పాలు: 2ltrs

జీడిపప్పు: 8-10

ద్రాక్ష: 8-10

నెయ్యి: 1cup

కుంకుమపువ్వు: చిటికెడు

పంచదార: 1cup

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించాలి. తర్వాత అందులో 100-150గ్రాముల అడ వేసి పక్కన పెట్టుకోవాలి.

2. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక మందపాటి లోతైన గిన్నె తీసుకొని అందులో పాలు పోసి కాగించాలి.

4. పాలు బాగా కాగిన తర్వాత, వేడినీటిలో నానబెట్టుకొన్న అడను వడగట్టుకుని పాలలో వేయాలి.

5. వేసిన తర్వాత మద్యమధ్యలో కలియబెడుతుండాలి. లేదంటే అడుగు భాగం మాడుతుంది మరియు ఉండలు కడుతుంది.

6. ఇప్పుడు అందులో పంచదార వేసి కంటిన్యూగ పంచదార కరిగే వరకూ కలియబెడుతుండాలి.

7. ఇప్పుడు ఒక చిన్న కప్పులో ఒక టేబుల్ స్పూన్ పాలు మరియు చిటికెడు కుంకుమపువ్వు వేసి మిక్స్ కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి.

8. పాయసం చిక్కబడుతున్నప్పుడు అందులో కుంకుమపువ్వు మరియు పాలు వేయాలి.

9. పాన్‌లో, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో జీడిపప్పు, ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోవాలి.

10. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు మరియు ద్రాక్షను అడ పాయసంలో వేసి మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేయాలి. అంతే అడ పాయసం రెడీ.

ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చెయ్యాలో చూద్దామా… వింటర్ స్పెషల్ స్నాక్…

20130416-152841

కావాల్సిన పదార్ధాలు:

ఉల్లిపాయలు-5(విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి)

నూనె-వేయించడానికి సరిపడినంత

కారం-1 టీ స్పూను

మైదా-1 1/2 కప్పు

ఎండబెట్టిన మిక్స్డ్ హెర్బ్స్-1 టీ స్పూను

త్రాగే సోడా-2 కప్పులు

ఉప్పు-రుచికి సరిపడా

ఉల్లిపాయ పొడి-1 టీ స్పూను

మిరియాలు-1/2 టీ స్పూను(మెత్తగా దంచుకోవాలి)

బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పూ

ఆవ పొడి-1/2 టీ స్పూను

కారంఫ్లేక్స్-1/2 కప్పు(మెత్తగా పొడి చేసుకోవాలి)

కొత్తిమీర-1 టేబుల్ స్పూను(సన్నగా తరగాలి)

తయారీ విధానం:

1. ఉల్లిపాయలని విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలని 15 నిమిషాలపాటు చల్లని నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిలోనుండీ తీసి కిచెన్ టవల్ మీద ఆరబెట్టాలి. ఆరిన తరువాత ఒక ప్లేటులోకి మార్చి వీటి మీద పిండిని చల్లాలి. అందువల్ల ఎక్కువగా ఉన్న తేమని పిండి పీల్చుకుంటుంది.

2. ఒక పెద్ద గిన్నెలో మైదా, కారం, మిక్స్డ్ హెర్బ్స్, ఉల్లి పొడి, ఆవ పొడి, మిరియాలు, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపాలి.

3. ఈ పిండికి సోడా పోసి ఈ మిశ్రమం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా చిక్కగా ఉండకూడదు. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలపాలి.

4. ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ పొడి, బ్రెడ్ పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి.

6. పొరలు పొరలుగా తరిగిన ఉల్లిపాయలని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ , కార్న్ ఫ్లేక్స్ పొడిలో దొర్లించి ఉల్లిపాయలకి బ్రెడ్ పొడి బాగా పట్టేటట్లు చూడాలి.

7. ఇలా బ్రెడ్ పొడిలో దొర్లించిన ఉల్లిపాయలని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.

8. వేగాకా నూనెలో నుండి తీసి కిచన్ టవల్ మీద వేస్తే ఆనియన్ రింగ్స్‌లో ఉన్న అధిక నూనెని పీల్చుకుంటుంది.

రుచికరమైన పనీర్ కట్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

aaloo-and-paneer-cutlets

కావలసిన పదార్ధాలు:

కాటేజ్ చీజ్ (పనీర్) – 2 కప్పులు (తరిగినది)

ఉడికించిన అన్నం – ½ కప్పు (చల్లారినది)

రుచికి సరిపడా ఉప్పు

పచ్చిమిర్చి – 1 ½ టేబుల్ స్పూను (సన్నగా తరిగినవి)

మైదా – ¼ కప్పు

కొత్తిమీర – ¼ టీస్పూను (తరిగినది)

క్యాప్సికం – ½ కప్పు వివిధ రంగులవి (సన్నగా తరిగినవి)

పైన కోటింగ్ కి బ్రెడ్ పొడి

నూనె – 2 టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం:

1.సన్నగా తరిగిన చీజ్ తీసుకుని అందులో ఉడికించిన అన్నాన్ని కలపండి.

2.ఇప్పుడు, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి.

3.ఇప్పుడు, కొత్తిమీర, తరిగిన క్యాప్సికం వేయండి. మీరు వివిధ రకాల క్యాప్సికం తీసుకున్నట్లయితే, మీ కట్లెట్ లు చాలా అందంగా కనిపిస్తాయి.

4.ఈ పదార్ధాలు అన్నిటినీ బాగా కలిపి, చేతితో చిన్నచిన్న ఉండలుగా చేయండి.

5.ఇప్పుడు, తవా వేడిచేసి, నూనె రాయండి.

6.దానిపై కట్లెట్ లను ఉంచి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.

7.రెండువైపులా బాగా ఉడికిన తరువాత, పుదీనా పచ్చడి లేదా టొమాటో సాస్ తో వేడిగా వడ్డించండి.

మిర్చీ బజ్జీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download-3

కావల్సిన పదార్థాలు:

పెద్ద పచ్చిమిర్చి(బజ్జీ మిర్చి): 10

శెనగపిండి: 1cup

కారం: 1tsp

ఛాట్ మసాలా: 3tsp

అజ్వైన్: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

పసుపు: కొద్దిగా

నూనె : డీఫ్రైకి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, పసుపు, కారం, ఉప్పు, అజ్వైన్ మరియు ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా చిక్కగా జారుడుగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు బజ్జీ మిర్చినీ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో తుడిచి పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక్కోదాన్ని తీసుకొని మిర్చి పొడవునా చీలిక చేసి లోపలి విత్తనాలను తొలగించాలి.

5. ఇలా మొత్తం రెడీ చేసుకొన్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో మిర్చిలను డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి.

6. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. కాగిన తర్వాత అందులో శెనగపిండిలో వేసిన మిర్చి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

7. అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. అంతే మిర్చి పకోర రెడీ. వీటిని మీకు నచ్చిన కెచప్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

బఠాణీ ప్యాన్ కేక్ తయారీ విధానం చూద్దామా…

download-1

కావాల్సిన పదార్ధాలు:

పచ్చి బఠాణీ-ఉడికించనవి 3/4 కప్పు.

బియ్యప్పిండి-1/2 కప్పు

శనగపిండి-1/2 కప్పు

పసుపు-1/4 టీ స్పూను

ఫ్రూట్ సాల్ట్-1/2 టీ స్పూను

ఉప్పు-రుచికి తగినంత

నూనె-2 టేబుల్ స్పూన్లు

టమాటాలు-1/4 కప్పు(సన్నగా తరగాలి)

క్యారట్లు-1/2 కప్పు(తురమాలి)

పచ్చి మిరపకాయల తరుగు-2 టేబుల్ స్పూన్లు

తురిమిన పనీర్-4 టేబుల్ స్పూన్లు

నీరు-తగినంత

తయారీ విధానం:

1.ఉడికించిన బఠాణీని మెత్తగా రుబ్బాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో బఠాణీ ముద్ద వేసి దానికి బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు చేర్చాలి.

2.నీరు పోసి కాస్త చిక్కగా అయ్యేవరకూ కలిపి దానిలో ఫ్రూట్ సాల్ట్ వెయ్యాలి.

3.ఫ్రూట్ సాల్ట్ వేసాకా ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా కలిపితే ప్యాన్ కేక్స్ మెత్తగా రావు. ఇప్పుడు ఒక పెనం తీసుకుని వేడి చేసి దానికి నూనె రాయాలి. ఇలా చేస్తే పెనం మీద నుండి ప్యాన్ కేక్స్ తియ్యడం సులువు.

4.ఇప్పుడొక గరిటెతో ప్యాన్ కేక్ మిశ్రమాన్ని తీసుకుని పెనం మీద దోస లాగ పొయ్యాలి. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ పోసుకుంటే తియ్యడం సులువు.

5.ఇప్పుడు వీటి మీద తురిమిన పనీర్,క్యారెట్, టమాట వేసి పైన కొంచెం నూనె చిలకరించాలి. ప్యాన్ కేక్ ఒక వైపు కాలాక మరొక వైపు తిప్పాలి.

6.రెండో వైపు కూడా కాలాకా మీ ప్యాన్ కేక్స్ తయారు. వీటిని వేడి వేడిగా వడ్డించడమే.

ఇవి చట్నీ లేదా సాస్‌తో కలిపి వడ్డిస్తే మరింత రుచికరంగా ఉంటాయి. విటమిన్లు, పీచు, మినరల్స్ కలిగిన ఈ స్నాక్ ఆరోగ్యానికి మంచిది.

క్రిస్పీ ఆలూ అండ్ పనీర్ ఫ్రైడ్ స్టిక్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

బంగాళదుంప – 3

పన్నీర్ – 200 g

ఉల్లిపయాలు – 1/2 cup

పచ్చిమిర్చి పేస్ట్ – 1/4th teaspoon

రెడ్ చిల్లీ పౌడర్ – 1/2 teaspoon

కార్న్ ఫ్లోర్ – 1 cup

మైదా – 1/4th teaspoon

మైదా – 1/2 cup

నూనె:సరిపడా

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. బంగాళదుంపను మరియు పనీర్‌ను స్లైస్‌గా కట్ చేసుకోవాలి.

2. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మార్చుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, కారం, మైదా, గరం మసాలా మరియు ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా నీరు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దీనికి వాటర్ జోడించాల్సిన పనిలేదు.

4. కార్న్ ఫ్లోర్‌ను ఆలూ మరియు పనీర్‌కు బాగా పట్టేలా మిక్స్ చేయాలి. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి.

5. నూనె వేడి అయిన తర్వాత అందులో ఆలూ మరియు పన్నీర్ స్టిక్స్ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో వేగే వరకూ వేగించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత టేస్టీ అండ్ ట్యాంగీ సాస్‌తో సర్వ్ చేయాలి. అంతే డీ ఫ్రైడ్ స్నాక్ రిసిపి రెడీ.

చికెన్ కట్‌లెట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం….

img_7623

కావల్సిన పదార్థాలు:

ఉడికించిన చికెన్ ఖీమా: ½ kg

బంగాళదుంపలు: 2(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)

పెప్పర్: 1tsp

గరం మసాలా: 1tsp

పచ్చిమిర్చి :2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

అల్లం: ½ అంగుళం (తురుముకోవాలి)

గుడ్డు: 1(బీట్ చేసి పెట్టుకోవాలి)

బ్రెడ్ పొడి: 1cup

కరివేపాకు: 2-3 రెమ్మలు

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 1cup

తయారుచేయు విధానం :

1. ముందుగా చికెన్ మరియు ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపలను తీసుకోవాలి. రెండింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

2. తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కరివేపాకు మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.

3. తర్వాత అందులోనే మసాలాలను కూడా జోడించి తిరిగి మిక్స్ చేసుకోవాలి.

4. ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొన్న తర్వాత అందులో నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని కట్‌లెట్ లా ఒత్తుకోవాలి.

5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి బాగా కాగిన తర్వాత, బీట్ చేసిన గుడ్డులో కట్‌లెట్ ను డిప్ చేసి తర్వాత బ్రెడ్ పొడిలో అన్ని వైపులా పొర్లించాలి.

6. ఇప్పుడు ఈ కట్‌లెట్స్ ను కాగే నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

7. దాదాపు 10-15నిముషాలు డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

8. వేగిన తర్వాత వీటిని టిష్యు పేపర్ మీద వేసి నూనె పీల్చుకొన్న తర్వాత, సర్వింగ్ ప్లేట్ లో సర్ధి, సలాడ్ మరియు సాస్ తో సర్వ్ చేయాలి. అంతే కేరళ స్టైల్ చికెన్ ఖీమా కట్‌లెట్ రెడీ.

బ్రెడ్ ఛాట్ స్నాక్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…

bread-dahi-chaat

కావల్సిన పదార్థాలు:

బ్రెడ్ స్లైస్- 5 (టోస్ట్ చేసినవి)

చిక్కటి పెరుగు:

ఉప్పు: రుచికి సరిపడా

దేశీ నెయ్యి: 1tsp

మిరప పొడి : ¼ tsp

పచ్చిమిర్చి: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

జీలకర్ర పొడి: 1tsp

ధనియా పొడి: 1tsp

ఛాట్ మసాలా: 1tsp

కొత్తిమీర: 2tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి )

పుదీనా ఆకులు – 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉల్లిపాయ: 1 మీడియం సైజ్ (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)

టమోటో: 1 మీడియం సైజ్ (చిన్న ముక్కలుగా కటం యుపె్ొవాలి)

సేవ్ మరియు వేరుశెనగలు: గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:

1. ముందుగా బ్రెడ్ ను టోస్ట్ చేయడానికి ముందు వాటిని కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి.

2. తర్వాత పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక బ్రెడ్ స్లైస్ ను టోస్ట్ చేసుకోవాలి.

3. తర్వాత ఒక టిష్యు పేపర్ మీద వీటిని పెట్టడం వల్ల అదనపు నెయ్యి లేదా నూనె తొలగిపోతుంది.

4. తర్వాత వెంటనే వాటిని ఒక ప్లేట్ లో సర్ధి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టోస్టో చేసిన బ్రెడ్ స్లై మీద ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి, పుదీనా మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

5. ఇప్పుడు ఉప్పు, కారం, ఛాట్ మసాలా, ధనియా పౌడర్ మరియు జీలకర్ర పొడిని చిలకరించాలి.

6. తర్వాత టీ స్పూన్ తో పెరుగును వాటిమీద నిధానంగా వేసి సర్ధాలి. పెరుగును బ్రెడ్ మొత్తం పరవాలి.

7. చివరగా సేవ్ మరియు వేరుశెనగలతో గార్నిష్ చేయాలి. తయారుచేసిన వెంటనే ఫ్రెష్ గా సర్వ్ చేయాలి. అంతే నోరూరించే స్నాక్ రిసిపి రెడీ.

కరకరలాడే రుచికరమైన షిఫ్ చిప్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (24)

కావల్సిన పదార్థాలు:

చేపలు – 5 to 6

కారం – 1 teaspoon

బేకింగ్ పౌడర్ – 3/4th teaspoon

సోడా లేదా వైన్- 1 cup

మైదా- 1 tablespoon

కార్న్ ఫ్లోర్ – 1 tablespoon

నూనె: సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పిండిని తయారుచేసుకోవాలి. అందుకోసం మైదా, కారం, బేకింగ్ పౌడర్‌ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులో సోడా లేదా వైన్ వేసి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

3. మొత్తం మిశ్రమం ఒక 20నిమిషాలు చల్లగా అవ్వనివ్వాలి.

4. తర్వాత అందులో ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. తర్వాత కార్న్ ఫ్లోర్ మరియు మైదాను ఒక ప్లేట్ లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కల మీద మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని చిలకరించాలి.

7. ఇప్పుడు ఈ చేప ముక్కలను సోడా లేదా వైన్ మిశ్రమంలో డిప్ చేయాలి.

8. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగిన తర్వాత డిప్ చేసిన చేపముక్కలను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

9. అంతే క్రిస్పీ ఫిష్ ఫ్రై రిసిపి రెడీ. వీటిని వేడి వేడిగా స్పైసీ సాస్ మరియు చిప్స్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.

ఓట్స్ క్యారెట్ హల్వాను ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

ఓట్స్ -1 ½ cup

వెన్న తీసిన పాలు – 500 ml

క్యారెట్స్- 300 gms

షుగర్ – 1/4th cup

కోవ – 100 gms

యాలకల పొడి – a pinch

తయారుచేయు విధానం:

1. ముందుగా క్యారెట్ ను శుభ్రం చేసి తర్వాత తురుముకోవాలి. తురుముకొన్న క్యారెట్ ను మిక్సీలో వేసి మరింత రఫ్ గా గ్రైడ్ చేసుకోవాలి.

2. తర్వాత పాన్ లో పాలు పోసి, కాగిన తర్వాత అందులో గ్రైడ్ చేసుకొన్న క్యారెట్ మరియు ఓట్స్ వేసి మిక్స్ చేయాలి.

3. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ఫ్రెష్ కోవా వేయాలి. వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఉడికించుకోవాలి.

4. కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో సరిపడా పంచదార వేసి మిక్స్ చేయాలి.

5. తర్వాత మరో పాన్ స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి అయిన తర్వాత అందులో యాలకలు, చిటికెడు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి.

6. ఫ్రై అయి, చల్లబడిన తర్వాత యాలకలు, దాల్చిన చెక్కను పొడి చేసి క్యారెట్ ఓట్స్ హల్వాలో వేసి బాగామిక్స్ చేయాలి.

7. క్యారెట్ ఓట్స్ హల్వా మొత్తం రెడీ అయిన తర్వాత అందులో బాదం పలుకులు గార్నిష్ గా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ ఓట్స్ హల్వా రెడీ.