Posts Tagged ‘snacks’

ఉపవాస వేళ హెల్తీ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారుచేయాలో చూద్దాం… శివరాత్రి స్పెషల్…

11-outside

కావలసినపదార్థాలు:

అరటిపండు ముక్కలు – 1/2cup

ఆపిల్‌ముక్కలు – 1/2cup

ద్రాక్షపళ్లు – 1/2cup

పియర్(బేరికాయ)పండు ముక్కలు – 1/2cup

దానిమ్మ గింజలు: 3tbsp

పాలు – 1/2 ltr

పంచదార – 3 tsp

హార్లిక్స్ – 2tsp

తయారు చేయువిధానం:

1. ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి.

2. తరవాత అందులో పంచదార, హార్లిక్స్ వేసి అవి కరిగేవరకు బాగా కలిపి దింపేయాలి.

3. ఇప్పుడు పాలు బాగా చల్లారిన తరువాత, అందులో తరిగిపెట్టుకున్న పండ్లముక్కలు వేసి కలుపుకోవాలి.

4. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పావుగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేస్తే బావుంటుంది. ఆరోగ్యకరమైనది.

హాట్ అండ్ స్పైసీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

fried-chicken-625_625x350_81450202904

కావల్సిన పదార్థాలు:

చికెన్ లెగ్స్ : 4

వెనిగర్: 2tbsp

వెల్లుల్లి రెబ్బలు: 5-6(సన్నగా తరగాలి)

పచ్చిమిర్చి: 2(సన్నగా తరగాలి)

సోయా సాస్: 1tbsp

కార్న్ ఫ్లోర్: 1tbsp

ఉల్లిపాయ: 1(సన్నగా చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

బెల్ పెప్పర్: 1(సన్నగా చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

చైనీస్ గ్రాస్: చిటికెడు

నూనె: 2tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయువిధానం:

1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి వెనిగర్, వెల్లుల్లిపేస్ట్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సోయాసాస్, పచ్చిమిర్చి మరియు చైనీస్ గ్రాస్ వేసి బాగా మిక్స్ చేయాలి.

3. తర్వాత చికెన్ లెగ్స్ ను సోయా మిక్సర్ లో డిప్ చేయాలి. వాటిని బయటకు తీసి కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి)లో వేసి పొర్లించాలి.

4. అంతలోపు ఫ్రైయింగ్ పాన్ లో నూనెవేసి, స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ లెగ్స్ ను అందులో వేయాలి. మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

5. రెండు నిముషాల తర్వాత మంట తగ్గించి అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు బెల్ పెప్పర్ ముక్కలు కూడా వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. అంతే క్రిస్పీ చైనీస్ చికెన్ లెగ్స్ రెడీ. వీటిని డీప్ ఫ్రై చేయకూడదు.

ఓట్స్ టిక్కీ లేదా ఓట్స్ కట్‌లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

2014605

కావల్సిన పదార్థాలు :

రోల్డ్ ఓట్స్ – 1 cup

కాటేజ్ చీజ్ – ¼th cup (తురిమినది)

క్యారెట్ – ¼th cup (తురిమినది)

బంగాళదుంపలు – ½ cup (ఉడికించి, మ్యాష్ చేసినవి)

కొత్తమీర – 2 tbsp (సన్నగా తరిగినవి)

కారం – 1 tsp

నిమ్మరసం – 1 tsp

అల్లం పేస్ట్ – 1½ tsp

పచ్చిమిర్చి పేస్ట్ – 1½ tsp

గరం మసాలా – 1 tsp

మ్యాంగో పౌడర్ – 1 tsp

ఉప్పు రుచికి సరిపడా

లోఫ్యాట్ మిల్క్ – ¼th cup

నూనె – 1½ tbsp (వండటానికి మరియు గ్రీజ్ చేయడానికి)

తయారుచేయు విధానం :

1.ఒక బౌల్లో ఓట్స్ తీసుకోవాలి. అందులో పనీర్, క్యారెట్స్, పొటాటో, కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూస్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కారం, గరం మసాలా, మామిడి పౌడర్, ఉప్పు వేయాలి.

2.ఈ పదార్థాలన్నింటిని బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చిలకరించి, మళ్లి మిక్స్ చేయాలి.

3. ఇప్పుడు, కలుపుకున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, టిక్కీలా ఒత్తుకుని, అన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి.

4.టిక్కీని పాలలో డిప్ చేసి, ఓట్స్ పౌడర్ లో రోల్ చేసి పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ వేడి అయ్యాక నూనె రాయాలి. తర్వాత టిక్కీ ని ప్లాన్ లో పెట్టి రెండు వైపులా నూనె వేస్తూ నిధానంగా కాల్చుకోవాలి.

6. కట్‌లెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతుందో అప్పుడు, స్టౌవ్ ను ఆఫ్ చేసి, ప్లేట్ లో కట్‌లెట్ ను తీసి పెట్టుకోవాలి.

7.అంతే వేడి వేడి టిక్కీ రెడీ. దీన్ని కొత్తిమీర లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ ఓట్ మీల్ రిసిపి రెడీ.

బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

d18ab2dd369a82c4bdcbd63ca08ae9cd

కావాల్సిన పదార్ధాలు:

కేక్ కోసం:

చాకొలేట్ కేక్ – 1

మెత్తని క్రీమ్ – 4 కప్పులు (బీట్ చేసింది)

కాన్ చెర్రీలు – 16 (ముక్కలుగా కట్ చేసినవి)

పంచదార సిరప్ కోసం :

పంచదార – ½ కప్పు

నీళ్ళు – ¾ వంతు కప్పు

అలంకరణకు:

చాక్లెట్ కర్ల్స్ – 1 ¼ కప్పు

కాండ్ చెర్రీలు – 10 (మొత్తం)

తయారుచేసే విధానం:

1. ఒక చాకొలేట్ కేక్ కొనండి. ఎగ్ లేనివి కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి. దాన్ని 3 పొరలుగా కట్ చేయండి. ఇప్పుడు, మీరు పంచదార సిరప్ ని తయారుచేసి అందులో ఈ కేక్ ని ముంచండి. ఒక గిన్నెను తీసుకుని అందులో నీరు, పంచదార వేయండి. పంచదార నీటిలో కరిగే వరకు మరగనివ్వండి.

2. ఫ్లేవర్ కలపడానికి, మీరు బ్రాందీ, రమ్ వంటి ఎటువంటి లిక్కర్ నైనా కలపొచ్చు. మరగనిచ్చి స్టవ్ ఆపేయండి. షుగర్ సిరప్ గది ఉష్ణోగ్రతకు వచ్చే దాకా చల్లారనివ్వండి. ఇప్పుడు, పెద్ద గిన్నె తీసుకుని, క్రీమ్ ని బాగా కలపడం మొదలుపెటండి. ఆ క్రీమ్ నురగగా, మృదువుగా అయ్యేవరకు కలపండి.

3. కేక్ స్టాండ్ తీసుకుని, దానిలో ఒక కేక్ లేయర్ పెట్టండి. ఇప్పుడు, దానిమీద పంచదార సిరప్ పోయండి, దానిమీద బీట్ చేసిన క్రీమ్ ని కూడా రాయండి.

4. కేక్ పొరల మీద క్రీమ్ ని బాగా మందంగా పూయండి. ఇప్పుడు, కేక్ లేయర్ మీద చేర్రీస్ పెట్టండి. మీరు చెర్రీ మొత్తాన్ని పెట్టొచ్చు లేదా ముక్కలుగా చేసి పెట్టొచ్చు.

5. రెండవ పోరని పెట్టండి, మళ్ళీ పైలాగే అప్లై చేయండి. అలాగే మూడవ పొరను కూడా పెట్టి పై విధానాన్ని అనుసరించండి. తరువాత, కేక్ మొత్తాన్ని క్రీమ్ తో కవర్ చేసి, మృదువుగా ఉండేట్టు చేయండి. చాకొలేట్ బర్ నుండి చాకొలేట్ కర్ల్స్ తయారుచేసి, కర్ల్స్ తో కేక్ అలంకరించి, చేర్రీస్ తో కేక్ ని అలంకరించండి.

6. కేక్ పక్కల వైపు చాకొలేట్ కర్ల్స్ పుల్లలు పెట్టడం మరవకండి. మీరు ఇంట్లో చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైనట్టే.

7. దాన్ని కట్ చేసి, మీ అతిధులకు సర్వ్ చేయండి.

దాబేలీ ఎలా తయారుచెయ్యాలో చూద్దాము…ఇండియన్ బర్గర్…

dsc06868

కావాల్సిన పదార్ధాలు:

స్టఫ్ఫింగ్ కోసం:

దాబేలీ మసాలా-1 1/2 టేబుల్స్పూన్

స్వీట్ చట్నీ-2 టేబుల్ స్పూన్లు

నూనె-1 టేబుల్ స్పూను

ఉడికించి చిదిమిన బంగాళ దుంపలు-1 1/4 కప్పు

సన్నగా తరిగిన కొత్తిమీర-2 తేబుల్ స్పూన్లు

తురిమిన కొబ్బరి-2 టేబుల్ స్పూన్లు

ఉప్పు-రుచికి తగినంత

దానిమ్మ గింజలు-2 టేబుల్ స్పూన్లు

ఇతర పదార్ధాలు:

దాబేలీ పావ్-4 స్లైసులు

మసాలా పల్లీలు-4 టీ స్పూన్లు

వెల్లుల్లి చట్నీ-4 టీ స్పూన్లు

సన్నగా తరిగిన ఉల్లి పాయలు-4 టీ స్పూన్లు

స్వీట్ చట్నీ-2 టేబుల్ స్పూన్లు

సేవ్(కారప్పూస)-4 టీ స్పూన్లు

వెన్న-2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

1. ఒక గిన్నెలో స్వీట్ చట్నీ, దాబేలీ మసాలా వేసి బాగా కలపాలి. కాస్త గట్టిగా అనిప్స్తే ఈ మిశ్రమానికి కాసిని నీళ్ళు చేర్చి పల్చగా చెయ్యాలి.

2.ఇప్పుడొక కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడీ చేసి పైన కలిపిన మిశ్రమాన్ని వేసి వెంటనే బంగాళ దుంపలు, సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి.

3.దాబేలీ మసాలా తయారయ్యాకా ఒక ప్లేటులోకి తీసుకుని దాని మీద దానిమ్మ గింజలు, తురిమిన కొబ్బరి, కొత్తిమీర వేసి అలంకరించండి.

4.ఇపుడు దాబేలి పావ్‌ని తీసుకుని దానిని సగానికి కట్ చెయ్యండి. రెండు స్లైసులనీ పూర్తిగా విడదీయకూడదు. సూట్కేస్ ఎలా తెరుచుకుంటుందో అలా ఉండాలన్నమాట.

5.ఇప్పుడొక స్లైస్ మీద వెల్లుల్లి చట్నీ, స్వీట్ చట్నీ రాసి దాని మీద దాబేలీ మసాలా వెయ్యాలి. ఇప్పుడు రెండో స్లైస్ మీద కూడా వెల్లుల్లి, స్వీట్ చట్నీస్ రాయాలి. ఇప్పుడు దాబేలీ మసాలా ఉంచిన స్లైస్ మీద మసాలా పల్లీలు,సేవ్ వేసి రెండో స్లైస్ దీని మీద పెట్టాలి.

6.ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడీ చేసి దాని మీద వెన్న వేసి పైన తయారు చేసుకున్న దాబేలీ బ్రెడ్డుని రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.

7. అంతే మీ దాబేలీ రెడీ. వేడి వేడిగా దాబేలీని వడ్డించండి.

బొరుగుల లడ్డు(చురిమురి లడ్డు) ఎలా తయారుచేయాలో చూద్దాం…

murmura-ladoo-final_med

కావల్సిన పదార్థాలు:

బొరుగులు(చిరమురే): 3cup

బెల్లం తురుము: 1cup

వేయించిన పల్లీలు(వేరుశెనగలు): 2tbsp(మీకు అవసరం అయినంత తీసుకోవచ్చు)

పుట్నాలపప్పు(శెనగపప్పు): 2tbsp(అవసరం అయినంత)

యాలకుల పొడి: 1/2tsp

నెయ్యి

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులోనే బెల్లం వేసి మీడియం మంట మీద ఉడికించాలి. సిరఫ్ చిక్కబడుతూ, పాకం దగ్గరవుతుండగా, ఒక ప్లేట్ లో నీళ్ళు పోసి, అందులో వేడి పాకం అరటీస్పూన్ తీసి వేయడం వల్ల , చేత్తో పట్టుకొన్నప్పుడు, ఉండలా చేతికి అంటుకొంటుంది. దాంతో పాకం వచ్చినది లేనిది తెలుస్తుంది.

2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ పాకంలో బొరుగులు మరియు లైట్ గా వేగించుకొన్న పల్లీలను, పుట్నాల పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసి మరో సారి మొత్తం మిశ్రమాన్నిబాగా మిక్స్ చేయాలి.

3. తర్వత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని, చేతి నిండుగా బొరుగుల మిశ్రమాన్ని తీసుకొని పెద్ద పెద్ద లడ్డూలుగా తయారుచేసుకోవాలి. అంతే చురిమురి లడ్డు రెడీ.

రుచికరమై పొటాటో బజ్జీలను ఎలా తయారుచేయాలో చూద్దాం…

download-2

కావల్సిన పదార్థాలు:

పొటాటో – 3 (సన్నగా స్లైస్ గా కట్ చేసుకోవాలి)

శనగ పిండి పిండి – 1 ½cup

నీరు – 1cup

కారం – 1tsp

గరం మసాలా పొడి – 1/2tsp

బేకింగ్ సోడా – చిటికెడు

ఉప్పు : రుచికి సరిపడా

నూనె: వేయించడానికి తగినంత

ఇంగువ: చిటికెడు

తయారుచేయు విధానం:

1. ముందుగా బంగాళదుంపలకు పీలర్ తో పొట్టు తీసేయాలి. తర్వాత బంగాళదుంపలను నీటిలో వేసి శుభ్రంగా వాష్ చేయాలి. తర్వాత వాటని సాల్ట్ వాటర్ లో వేసి 15నిముషాలు నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, బంగాళదుంపలను సన్నని స్లైస్ గా కట్ చేసుకోవాలి.

3. తర్వాత ఒక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, గరం మసాలా, బేకింగ్ సోడా, ఇంగువ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అన్ని కలిసిపోయే వరకూ మిక్స్ చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులోనే నీళ్ళు పోసి చిక్కగా మరియు జారుడుగా పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేత్తో కలుపుకోవాలి.

5. పిండి రెడీ చేసుకొన్న తర్వాత, అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. బంగాళదుంప స్లైస్ కు పూర్తిగా శెనగిపిండి మిశ్రమం పట్టేలా చూసుకోవాలి.

6. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో మీడియం మంటకు తగ్గించాలి.

7. నూనె వేడిగా కాగుతున్నప్పుడు అందులో శెనగపిండి మిశ్రమంలో కలిపి పెట్టుకొన్న బంగాళదుంప స్లైస్ ను కాగే నూనెలో వేయాలి.

8. బంగాళదుంపలను అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

9. బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటో బజ్జీలను ఒక ప్లేట్ మీద బ్లోటింగ్ పేపర్ పరిచి, దానిమీద పొటాటో బజ్జీలను వేయాలి. ఇది అదనపు ఆయిల్ ను పీల్చుకుంటుంది. అంతే పొటాటో బజ్జీ రెడీ వీటిని టమోటో సాస్ లేదా చిల్లీ సాస్ తో తినవచ్చు.

రిబ్బన్ పకోడ ఎలా తయారుచేయాలో చూద్దాం…

ribbon_pakoda

కావల్సిన పదార్థాలు:

బియ్యం పిండి: 1cup

శెనగపిండి: 3/4cup

కారం: 2tbsp

నెయ్యి: 2tbsp

బేకింగ్ సోడ: చిటికెడు

ఇంగువ: చిటికెడు

నీళ్ళు: 1cup

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: డీప్ ఫ్రై చేయడానికి

తయారుచేయు విధానం:

1. ముందగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, శెనగపిండి, ఉప్పు, ఇంగువ, నెయ్యి మరియు కారం అన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత సరిపడా నీళ్ళు పోసి పిండిని మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి.

3. అంతలోపు, స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి.

4. తర్వాత కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని మురుకుల గొట్టల్లో పకోడా బ్లేడ్ ఫిట్ చేసి, తర్వాత అందులో పిండి పెట్టాలి.

5. ఇప్పుడు కాగే నూనెలో గుండ్రంగా పకోడాలను ప్రెస్ చేయాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి పకోడాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి.

7. పకోడాలు చల్లబడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి నిల్వ చేసుకోవచ్చు.

పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…

download (51)

కావాల్సిన పదార్థాలు:

పెసరపప్పు – ఒక కప్పు

బెల్లం – ఒక కప్పు

పాలు – అరలీటరు

కొబ్బరి – అరకప్పు

ఏలకులు -4

కిస్ మిస్ -10

జీడిపప్పు – 10

నెయ్యి -4 స్పూన్లు

తయారు చేసే విధానం:

1. ముందుగా పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. పాన్ లో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ లు వేయించి పక్కనపెట్టుకోవాలి.

3. ఇప్పుడు పెసపప్పును పాలల్లో ఉడకబెట్టాలి.

4. అవి కాస్త మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం తురుము కలపాలి.

5. బెల్లం కరిగి.. పాయసం చిక్కబడే ముందు కొబ్బరి తురుము కలిపి కాసేపు మరగనివ్వాలి.

6. తర్వాత ఏలకుల పొడి కలపాలి. స్టవ్ కట్టేసి ముందు వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ కలిపి.. వేడి వేడిగా తింటే కమ్మగా ఉంటుంది.

ఆపిల్ కోకనట్ హల్వా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

ఆపిల్: 1

కొబ్బరి తురుము: 1cup

డ్రై ఫ్రూట్స్: 20 grams

నెయ్యి: 2 tbsp

పంచదార: 1 cup

పాలు : 1 cup

యాలకలపొడి: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ఒక పాన్ తీసుకొని అందులో పాలు, పంచదార, ఆపిల్ తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

2. ఇప్పుడు ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించాలి. మొత్తగా పేస్ట్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి.

3. మొత్తం మిశ్రమం చిక్కబడే సమయంలో అందులో డ్రైఫ్రూట్స్ (రఫ్ గా పొడి చేసుకొని లేదా అలాగే )వేసుకొని, బాగా మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

4. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకలపొడి వేసి మరో సారి మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తర్వాత మరికొన్ని నిముషాలు ఉడకించుకోవాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే జోడించుకోవచ్చు. అంతే ఆపిల్ హల్వా రెడీ.