Posts Tagged ‘spinach’

చికెన్ స్పినాచ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

images

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1kg

ఆకు కూర: 1కట్ట

ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

వెల్లుల్లి రెబ్బలు : 4

నూనె: 2tbsp

పసుపు: 1tsp

కారం: 1tsp

జీలకర్ర: 1tsp

ధనియాలపొడి: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చికెన్ కు స్కిన్ తొలగించి శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఆకుకూరలను విడిపించుకొని, మంచినీటిలో వేసి శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

6. అలాగే మసాల దినుసులన్నీ కూడా వేసి మరో 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, గ్రేవీ చిక్కగా మారే వరకూ కలియబెట్టుకోవాలి.

7. పాన్ లో మీకు చికెన్ ముక్కలతో పాటు సరిపడా మసాలా ఉన్నదని నిర్ధారించుకొన్న తర్వాత మంటను ఎక్కువగా పెట్టి చికెన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.

8. చికెన్ పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకొనే సమయంలో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొన్న ఆకుకూరను సన్నగా తరిగి ఉడుకుతున్న చికెన్ లో వేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్పినాచ్ చికెన్ రిసిపి రెడీ.

మెదడుని ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉంచే ఆకుకూరలు…

download (2)

ఆకుకూర తినడం వలన మీ మెదడు ఎంతో ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా పని చేస్తుంది. ఆకుకూరలో ఉండే విటమిన్ ‘కె’ మెదడును ఉత్తేజ పరచడంలో మరియు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

విటమిన్ ‘కె’తో పాటుగా ఆకుకూరలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకులను బలంగా ఉంచుతాయి. అందువలన ప్రతి రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.

హై బీపీని కంట్రోల్ చేసి… పక్షవాతాన్ని నివారించే పాలకూర…

images (42)
మన శరీరంలో ఏర్పడే రోగాలన్నిటికి ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కూరగాయలు, ఆకుకూరలే మందుగా పనిచేస్తాయి. ఈ విషయం ఎన్నడో రుజువైనప్పటికీ తాజాగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వలన ఏర్పడే పక్షవాతాన్ని నివారించడంలో పాలకూర బాగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆ అధ్యయన వివరాలను ‘ద జర్నల్ ఆఫ్ ద’ అమెరికన్ అసోసియేషన్ అనే మెడికల్ జర్నల్‌‌‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
ఆ ప్రకారం.. శాస్త్రవేత్తలు హైబీపీ ఉన్న 20,702 మందిపై అధ్యయనం నిర్వహించినట్టు తెలిసింది. హైబీపీని తగ్గించే ఎనాలప్రిల్ అనే మందును వాడుతున్న వారికి మందుతో పాటూ ఫొలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని అందించారు. అప్పుడు ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్న వారిలో గుండెపోటు వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం తగ్గిందని అధ్యయనవేత్తలు గుర్తించారు.
అంతేకాకుండా పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని వారు తేల్చిచెప్పారు. అదే విధంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారు ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వారు స్పష్టం చేశారు.

బొప్పాయి, అరటి, సపోటా తీసుకుంటే…

images (45)
బొప్పాయి, అరటి, సపోటా వీటిలోని ఐరన్, పొటాషియం, విటమిన్ ఇ చర్మానికి నిగారింపును ఇస్తాయి. తద్వారా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
అలాగే నిత్యం యంగ్‌గా కనిపించాలంటే తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారినపడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్లకింపైన రంగులున్న కూరగాయలు గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి, క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.
యంగ్‌గా కనిపించాలంటే ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. క్యాబేజీ, బ్రొకొలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్‌ ఇవన్నీ విటమిన్లు సమృద్ధిగా గల కూరగాయలు. విటమిన్‌ ఎ, సిలు కంటి చూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి. సో.. నిత్య యవన్వంగా ఉండాలంటే ఇవన్నీ మీ డైట్‌లో ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పెసరపప్పు ఆకుకూర కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (6)

కావల్సిన పదార్థాలు:

పెసరపప్పు – 1 cup

ఆకుకూర – 3 cups(మీకు నచ్చినది)

ఉల్లిపాయ- 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

వెల్లుల్లి- 4-5రెబ్బలు

అల్లం: 1 piece

పచ్చిమిర్చి- 5 (మద్యలోకి కట్ చేసుకోవాలి)

టమోటోలు- 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పసుపు- 1/2 tsp

జీలకర్ర – 1/2 tsp

గరం మసాలా- 1 tsp

కోకనట్ మిల్క్ – 3/4 cup

ఉప్పు: రుచికి సరిపడా

నూనె- 2 tbsp

ఇంగువ: చిటికెడు

నీళ్ళు- 2 cups

తయారుచేయు విధానం:

1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నూనె వేసిన వేడి అయిన తర్వాత అందులో పోపుదినుసులు, ఇంగువ, పసుపు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

2. పోపు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి కొద్దిగా మెత్తబడే వరకూ ఫ్రై చేయాలి.

3. ఇప్పుడు అందులోనే పప్పు, నీళ్ళు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని, మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

4. ఉడికిన తర్వాత మూత తీసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి.

5. ఇప్పుడు అందులో శుభ్రం చేసి, కట్ చేసి పెట్టుకొన్న ఆకుకూర, కొబ్బరి పాలు, లేదా క్రీమ్, కొద్దిగా గరం మసాలా వేసి ఉడికించుకోవాలి.

6. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా మిక్స్ చేసి తిరిగి ఉడికించుకోవాలి.

7. ఆకుకూర మొత్తగా ఉడికేవరకూ 10నిముషాలు ఉడికించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆకుకూర పెసరపప్పు రెడీ.

ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే…

spinach

ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని న్యూస్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారంపాటు తాజాగా ఉంటాయి.

స్పినాచ్ పకోడ ఎలా తయారుచేయాలో చూద్దాం…

spinach_potato_pakora

కావల్సిన పదార్థాలు:

ఆకుకూర: 1కట్ట(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

ఉల్లిపాయ: 1సన్నగా తరిగినవి

శెనగపిండి: 1cup

ఉప్పు: రుచికి సరిపడా

పచ్చిమిర్చి: 4-5సన్నగా తరిగిపెట్టుకోవాలి

కారం: 1/4tsp

కసూరి మేతి: 1tbsp

గరం మసాల: 1/2tsp

నూనె: 2 cups

తయారుచేయు విధానం:

1. ముందుగా పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకొన్న ఆకు కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేయాలి.

2. ఇప్పుడు అందులోనే శెనగపిండి కూడా వేయాలి. తర్వాత ఉప్పు, కారం, కసూరి మేతి మరియు గరం మసాలా వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి.

3. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి మెత్తగా కలుపుకోవాలి.

4. తర్వాత చేత్తో కొద్దికొద్దిగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని మరో చేత్తో కట్ లెట్ లా ఒత్తుకోవాలి. లేదా అలాగే ఉండలుగా కూడా కాగే నూనె లో వేసి వేగించుకోవచ్చు.

5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో సరిపడా నూనె పోసి వేడయ్యాక అందులో ఈ బాల్స్ ను వేయాలి.

6. ఒక 5 నిముషాలు మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి.

7. తర్వాత ఫ్రై చేసి పకోడలను టిష్యు పేపర్ మీద వేసుకోవాలి. ఇలా చేస్తే అదనపు నూనెను గ్రహిస్తుంది. అంతే స్పినాచ్ పకోడ రెడీ. వీటిని పుదీనా చట్నీ లేదా మీకు నచ్చిన సాస్ తో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.

స్పినాచ్ గార్లిక్ రైస్‌ను ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (31)

కావల్సిన పదార్థాలు:

సన్నగా తరిగిన పాలకూర: 4cups

అన్నం: 2cups

జీలకర్ర: 1tsp

ఉల్లిపాయ తరుగు: 1cup

వెల్లుల్లి రెబ్బలు: 15

టమోటో తరుగు: 1/2cup

అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp

పచ్చిమిర్చి పేస్ట్: రుచికి తగినంత

ఉప్పు: రుచికి తగినంత

నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పాలకూర తరుగును శుభ్రంగా కడిగి, మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.

3. తర్వాత టమోటో తరుగు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.

4. 5నిముషాలు ఈ మొత్తం మిశ్రమాన్ని వేగించుకొన్నాక ముందుగా తయారుచేసి పెట్టుకొన్న పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.

5. పాలకూరలో పచ్చివాసన పోయేదాక వేయించి, ఆపై అన్నం కూడా వేసుకుని కలిపి సన్నని మంటపై వేయించాలి. అన్నం బాగా వేడయ్యాక దింపేస్తే చాలు.

స్పినాచ్(ఆకుకూర) కట్‌లెట్ రిసిపి ఎలా తయారు చేయాలో చుద్దాం… బ్రేక్ ఫాస్ట్ స్పెషల్ …

images (76)

ఆకుకూర: 2cups(సన్నగా తరిగినది)

బంగాళాదుంప:1 (ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చిదుమిపెట్టుకోవాలి)

ఆయిల్: 2tbsp

ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)

అల్లం పేస్ట్: 1tbsp

గరం మసాలా: ½ tsp

శెనగపిండి: 1cup

బ్రెడ్ పొడి: 2cup

నీరు: ½cup

నూనె: డీప్ ఫ్రై చేయడానికి

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక, అందులో ఉల్లిపాయ, పచ్చిమర్చి ముక్కలు మరియు అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

2. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోఆకుకూర తరుగు వేసి, మీడియం మంట మీద బాగా వేగించుకోవాలి. ఆకు కూర మెత్తగా ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాలదుంప, గరం మసాలా, ఫ్రై చేసుకొన్నఆకుకూర మిశ్రమం మరియు ఉప్పు కూడా వేసి అన్నింటిని చేత్తో కలుపుతూ మిక్స్ చేయాలి.

4. ఇప్పుడు ఈ కలుపుకొన్న మిశ్రమంలో నుండి కొంత చేతిలో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

5. మరొక బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు చిన్నచిన్న ఉండలుగా తయారుచేసిన వాటని అరచేతిలో తీసుకొని కట్ లెట్ లా ఒత్తుకొని, శెనగపిండి మిశ్రమంలో డిప్ చేయాలి.

7. కట్ లెట్ రెండు వైపులా శెనగపిండి మిశ్రమం బాగా పట్టేలా డిప్ చేయాలి. ఇప్పుడు వీటిని బ్రెడ్ పొడిలో వేసి రెండు వైపులా అద్దాలి.

8. స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో నూనె పోసి, మీడియం మంట మీద కాగనివ్వాలి, నూనె కాగిన తర్వాత బ్రెడ్ పొడిలో అద్ది పెట్టుకొన్నకట్ లెట్ ను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

9. అంతే స్పినాచ్ కట్‌లెట్ రెడీ. మీకు ఇష్టమైతే టమోటో సాస్ కూడా టాపింగ్ చేసుకోవచ్చు.

ఐరన్ లోపం అధిగమించే మార్గాలు…

images (85)

– కోడిగుడ్లు, చేపలు మరియు మాంసం : ఐరన్ కోడిగుడ్లలో ఎక్కువగా లభిస్తుంది. అయితే ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవడం వల్ల.. ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు. అలాగే చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్సే కాదు.. ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు చేపలను డైట్ లో చేర్చుకుంటే మంచిది. మాంసాహారంలో ఐరన్ మెండుగా ఉంటుంది. మేక, గొర్రె, చేపలు, రొయ్యలు తీసుకోవడం ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు మాంసాహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

– బీన్స్, ఆకుకూరలు: బీన్స్, ఆకుకూరల్లో ఐరన్ తగిన స్థాయిలో ఉంటుంది. ఆకుకూరలు పిల్లలు తినడానికి ఇష్టపడరు. కాబట్టి.. బీన్స్ ఇవ్వడం, ఆకుకూరలను చపాతీలతో కలిపి ఇవ్వడం వల్ల ఐరన్ అందివ్వవచ్చు.

– డ్రైఫ్రూట్స్: ఐరన్ లోపంతో బాధపడే స్ర్తీలు నిత్యం డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. వీటి ద్వారా ఐరన్ ని శరీరానికి కావాల్సినంత పొందవచ్చు. వీటిని రాత్రిపూట నానబెట్టి తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

– బెల్లం: బెల్లం వాడటం ఆరోగ్యానికి మంచిది. బెల్లం ద్వారా ఐరన్ ఎక్కువ మోతాదులో పొందవచ్చు.

– బీట్ రూట్: బీట్ రూట్ లో ఐరన్ రిచ్ గా ఉంటుంది. ఇది అనీమియాతో పోరాడుతుంది. అలాగే ఎర్రరక్తకణాల సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది.

– పీనట్ బటర్ లేదంటే వేరుశనగలు: పీనట్ బటర్ లో ఐరన్ లభిస్తుంది. రెగ్యులర్ డైట్ లో పీనట్ బటర్ చేర్చుకుంటే.. మంచి ఫలితాలుంటాయి. లేదంటే.. గుప్పెడు వేరుశనగలు తీసుకున్నా.. ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.