Posts Tagged ‘tiles cleaning’

కఠిన మరకలను సులువుగా వదిలించే నెయిల్ పాలిష్ రిమూవర్…

images (94)

బేస్డ నెయిల్ పాలిష్ రిమూవర్:

టైల్స్ క్లీనింగ్: 

మీ ఇంట్లో టైల్స్ చాలా డర్టీగా మారి ఉంటే, చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నా అటువంటి ప్రదేశంలో కొద్దిగా నెయిల్ పాలిష్ రాయడం వల్ల దుమ్ము, దూళి ఏర్పడ్డ మరకలు మాయం అయిపోతాయి.

ఇంక్ (సిరా )మరకల్ని అతి సులభంగా పోగొడుతుంది:

ఇంక్ మరకలను పోగొట్టడానికి వివిధ రకాల ఉపాయలే ఉన్నాయి. ఇంక్ మరక ఉన్న ప్రదేశంలో నీళ్ళు, సోపు, వేయడం వల్ల ఆ ప్రదేశంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్ లోనికి మారిపోతుంది. కాబట్టి నెయిల్ పాలిష్ రిమూవర్ అప్లై చేయడం వల్ల ఈ మరకలను తొలగించడానికి చాలా సులభం అవుతంది.

పర్మనెంట్ మార్కర్ పెన్ మరకలను తొలగించడానికి:

సాధారణంగా ఆఫీస్ బోర్డ్ మీద మనం ఉపయోగించేటటువంటి పర్మనెంట్ మార్కర్ పెన్ తో గ్లాస్ మీద పెయింటింగ్ చేయడం వల్ల భయపడాల్సిన పనిలేదు. దానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ను కొద్దిగా రాస్తే సరిపోతుంది. నెయిల్ పాలిస్ రిమూవర్ తో సులభంగా తొలగించవచ్చు.

మెటల్ ప్రొడక్ట్స్:

మెటల్ తో తయారు చేసినటువంటి వస్తువులు చాలా త్వరగా తుప్పు పడుతుంటాయి. తుప్పు, ఫన్గూ, మరియు బ్యాక్టీరియాను నెయిల్ పాలిష్ రిమూవర్ తొలగిస్తుంది. మెటల్ వస్తువులు మిలమిల మెరవడానికి ఇదొక చక్కటి అవకాశం. కాబట్టి నెయిల్ పాలిస్ రిమూవర్ ను ఉపయోగించే ఇటువంటి చిన్నచిన్న ప్రయోజనాలను గ్రహించండి.

టైల్స్ మద్య మురికిని తొలగించడానికి క్లీనింగ్ టిప్స్…

images (2)

వెనిగర్: వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిక్స్ చేసి స్ప్రేబాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాకు అరకప్పు లిక్విడ్ బ్లీచ్ మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి దీన్ని టైల్స్ మధ్య రాసి 10 నిముషాల తర్వాత టూత్ బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోతుంది. తర్వాత తడిబట్టతో తుడిస్తే సరిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్: దెబ్బలు తగినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. దీన్నే నేరుగా ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసి టైల్స్ మద్య రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్లీచింగ్ పౌడర్: కొన్ని సార్లు టైల్స్ మధ్య చేరిన మురికి పసుపు రంగులో కనబడుతుంది. దీన్ని పోగొట్టడానికి బ్లీచ్‌తో తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లీచింగ్ పౌడర్‌ను రెండు కప్పుల వేడినీటిలో వేసి మిశ్రమంగా చేసుకుని దీనిలో పాత టూత్ బ్రష్‌ని ముంచి మురికి ఉన్న చోట బాగా రుద్దితే వెంటనే అది వదిలిపోతుంది.

నిమ్మరసం: నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్ర్కబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మరసం వల్ల టైల్స్‌ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.

అమ్మోనియా: బకెట్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ , అమ్మోనియా లిక్విడ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికిగా ఉన్న చోట స్ప్రే చేసుకోవాలి. 5నిముషాల తర్వాత బ్రష్‌తో రుద్ది తర్వాత తడి వస్త్రంతో లేదా మాప్‌తో నేలను తుడిస్తే సరిపోతుంది.

టైల్స్ పై సిలిండర్ త్రుప్పు మరకలను పోగొట్టే సులభ చిట్కాలు…

images (84)

నిమ్మరసం:

ఇంట్లో ఎటువంటి మొండి మరకలైనా సరే నిమ్మరసం ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. వంటగదిలో సిలిండర్ పెట్టిన చోట త్రుప్పు మరకలను తొలగించడానికి కొద్దిగా నిమ్మరసం చిలకరించి పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత టూత్ బ్రష్ ఉపయోగించి శుభ్రం చేస్తే చాలా స్మూత్ గా త్రుప్పు మరకలు మాయం అవుతాయి.

కిరోసిన్:

ప్లోర్ టైల్ మీద ఏర్పడిన రస్ట్ స్టైన్స్ వదలించడానికి కిరోసిన్ ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సిలిండర్ త్రుప్పు పడ్డ మరకల మీద కొద్దిగా కిరోసిన్ చిలకరించి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బ్లీచ్:

క్లీనింగ్ పదార్థాల్లో బ్లీచ్ ఒక వండర్ ఫుల్ క్లీనింగ్ ఏజెంట్ . సిలిండర్ త్రుప్పు మరకలను వదిలించడానికి కొద్దిగా బ్లీచ్ ను చిలకరించి 15నిముషాల తర్వాత నీటితో బాగా రుద్ది కడగడం వల్ల క్లీన్ గా మరియు మెరిసేటి వంటగది టైల్స్ ను మీరు గమనించవచ్చు.

 

వంట సోడాతో ఇంటిని శుభ్రం చేసే టెక్నిక్స్…

images (89)

వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మరకలను పోగొట్టాలంటే, సమపాళ్ళలో వంటసోడా, ఉప్పు కలిపి, పేస్ట్‌లా తయారు చేసి, తుడవాలి.

ఇంట్లోని చెత్తబుట్టలు, యాష్‌ట్రేలు వాసన రాకుండా ఉండాలంటే, శుభ్రం చేశాక, కొద్దిగా వంట సోడా వాటిలో చల్లాలి.

ఫ్రిజ్ తీయగానే వాసన రాకుండా ఉండాలంటే, మధ్య అరలో ఓ చిన్న గిన్నెలో వంటసోడా పోసి, ఉంచాలి.

స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే, వంటసోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి తయారు చేసిన పేస్ట్‌తో రుద్దాలి. పాత టూత్‌బ్రష్‌తో టైల్స్ మీద రుద్దవచ్చు.