Posts Tagged ‘turmeric’

పసుపు, వేప పొడి కలిపి తీసుకుంటే…

download (49)
పసుపు, వేప పొడిని సమ భాగాల్లో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు మాయమవుతాయి.

పసుపులోని ఔషధగుణాలు…

images
పసుపులో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. అందుకని దీన్ని రోజూ తినే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో లాభాలను పొందవచ్చు.
పసుపును క్యాలీఫ్లవర్‌తో కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ దరిచేరదు.
 పాలు, పసుపు, తేనే కలిపి తీసుకుంటే జలుబు మాయం.
పసుపులో నిమ్మరసం కలిపి వాపులు, బెణుకులు ఉన్న దగ్గర రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే  మూత్ర సంబంధిత సమస్యలు పోవాలంటే ప్రతిరోజూ ఉసిరి, పసుపుల డికాక్షన్ తాగాలి.
చిటికెడు పసుపును గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగితే కామెర్లు రాకుండా నిరోధించొచ్చు.
ఏ నొప్పినుండైనా ఉపశమనం పొందాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.

ఆయాసంను అదుపులో పెట్టవచ్చు… ఈ చిట్కాలు పాటిస్తే సరి…

images (98)
ఆయాసం ఉన్నవారు ఒక చిటికెడు మెత్తటి ఉప్పు, రెండు చిటికెల పసుపు రోజూ తీసుకోవడం మంచిది. అలాగే వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది.
ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.

అప్పర్ లిప్ హెయిర్‌ను తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్…

download (15)

– షుగర్, నిమ్మరసం: ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్‌గా మారిన తర్వాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. స్ర్కబ్ చేసిన 15నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– పసుపు, పాలు: పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి. పేస్ట్‌లా చేసుకున్నాక, ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. 10నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

– ఎగ్ వైట్: అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ బాగా సహాయపడుతుంది. ఎగ్ వైట్‌లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పై పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన అరగంట తర్వాత పీలింగ్‌లా తొలగించాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

– శెనగపిండి: కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

రోజూ వంటల్లో చిటికెడు పసుపు చేర్చితే పొందే అద్భుత ప్రయోజనాలు…

turmeric-curry-101020-02

– జీర్ణశక్తిని పెంచుతుంది: పసుపు బైల్ ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ ను పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది. చిటికెడు పసుపును పాలలో లేదా నీళ్ళలో మిక్స్ చేసి తాగడం వల్ల జీర్ణశక్తి మరింత పెరుగుతుంది.

– జలుబుతో పోరాడుతుంది: పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది జలుబు, దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చిటికెడు పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లేదా వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

– గాయాలు నయం అవుతాయి: ఇందులో యాంటీబ్యాక్టియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. గాయాలైనప్పుడు, గాయల మీద చిటికెడు పసుపును అప్లై చేయడం వల్ల త్వరగా నయం అవుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

– క్యాన్సర్ ను నివారిస్తుంది: పసుపులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రెగ్యులర్ గా వండే వంటల్లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల కోలన్, ప్రొస్టేట్, బ్రెస్ట్ ,క్యాన్సర్ల ను నివారిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది.

– ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గిస్తుంది: పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి పసుపును రెగ్యులర్గా వంటల్లో చేర్చుకోవడం వల్ల ఆర్థ్రైటిస్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

– డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది: పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి, దాల్, కర్రీస్, రైస్ వంటి వాటిల్లో చిటికెడు పసుపు చేర్చుకోవడం మంచిది.

– కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది: మీ డైలీ డైట్ లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతుంది. ఇది రీసెర్చ్ ద్వారా నిర్ధారించబడినది. రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.

– కాలేయ వ్యాధులను నివారిస్తుంది: పసుపులో ఉండే కుర్కుమిన్ కాంపౌండ్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆల్కహాల్, ఫ్యాటీ ఫుడ్స్ వల్ల లివర్ కు ఎఫెక్ట్ కాకుండా సహాయపడుతుంది.

మటన్ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (3)

కావలసిన పదార్దాలు:

బోన్‌లెస్ మటన్ : 500grms

తరిగిన ఉల్లిపాయలు : 1cup

కారం : 1tsp

ఉప్పు : రుచికి సరిపడా

పసుపు : 1/4tsp

అల్లం వెల్లల్లి పేస్టు : 2tbsp

బఘార్ కోసం కావలసినవి:

నూనె : 2tbsp

జీలకర్ర : 1tsp

కరివేపాకు

కొత్తిమీర

పుదీనా

పచ్చిమిర్చి : 4

మిరియాల పొడి : 1/2tsp

గరం మసాల పౌడర్ : 1/2tsp

నిమ్మరసం : 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై పాన్ పెట్టి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి(మధ్యలో కత్తిరించినవి)లను వేసి ఒక రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియబెట్టాలి.

4. ఈ మిశ్రమం మొత్తం ఫ్రై అవుతుండగా, అందులోనే మిరియాల పొడి, గరం మసాల పొడి నిమ్మరసం వేసి బాగా కలిపి మరో 5నుండి 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. ముక్కలు బాగా వేగాయని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి.

మ్యాంగో రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (28)

కావల్సిన పదార్థాలు:

పచ్చిమామిడికాయ – 1

వండిన అన్నం – 1 Bowl

పచ్చిమిర్చి – 5 to 6

ఆవాలు – 1/4th Teaspoon

పసుపు – 1/4th Teaspoon

వేరుశెనగలు- 1/2 cup

కరివేపాకు – 8 to 10

కొత్తిమీర – 8 to 10 (finely chopped)

ఉప్పు : రుచికి సరిపడా

నూనె: తగినంత

తయారుచేయు విధానం:

1. ముందుగా మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడగాలి.

2. తర్వాత పీలర్‌తో అవుటర్ స్కిన్‌ను తొలగించాలి.

3. ఇప్పుడు మామిడి కాయను గ్రేటర్‌తో తురుముకోవాలి.

4. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పల్లీలు ఒకదానికి తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.

5. తర్వాత అందులో పచ్చిమామిడికాయ తురుము వేసి మొత్తం మిశ్రమం ఫ్రై చేసుకోవాలి.

6. పోపుతో పాటు మామిడికాయ కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం , ఉప్పు వేయాలి. మొత్తం మిశ్రం కలగలుపుకోవాలి.

7. చివరగా కొత్తిమీర తరగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి టేస్టీ మ్యాంగో రైస్ రెడీ.

నాడీ సంబంధిత వ్యాధులకు దివ్యౌషధం పసుపు..

images (52)
మన దేశంలో పసుపును శుభప్రదంగా భావిస్తాం. పూజా సంబంధిత కార్యాల్లోనే కాకుండా వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తాం. ఇందుకు ముఖ్యకారణం పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉండడమే. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు వివిధ దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఇప్పటికే తేలింది.
పసుపు తాత్కాలిక ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం ఇస్తుందని తేలింది. కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు మంచి ఫలితాన్ని ఇస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
అదేవిధంగా అల్జిమర్స్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులపై కూడా పసుపు అద్భుత ఫలితాలను ఇస్తుందని ఆ అధ్యయనం ద్వారా తేలింది.

బెంగాలి స్టైల్ ట్రెడిషనల్ ఫిష్ కాలియా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (10)

కావల్సిన పదార్థాలు:

రఘుఫిష్ (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) – 4 pieces

బంగాళదుంపలు – 2 medium sized (cut into quarters)

ఉల్లిపాయలు – 2 (finely chopped)

టమోటోలు – 1 (finely chopped)

నిమ్మరసం – 1 teaspoon

పెరుగు – 1 teaspoon

అల్లం పేస్ట్ – 2 teaspoon

వెల్లుల్లిపేస్ట్ – 2 teaspoon

పచ్చిమిర్చిపేస్ట్ – 2 teaspoon

ఆవనూనె – 4-5 teaspoon

టమోటో గుజ్జు – 1 teaspoon

పసుపు – 1/4 teaspoon

జీలకర్ర పొడి – 1 teaspoon

కారం – According to taste

ఉప్పు – According to taste

పంచదార – 1 teaspoon

గరం మసాలా – 1/2 teaspoon

బిర్యానీ ఆకు- 2

మసాలా దినుసులు – (దాల్చిన చెక్క: 1 small piece, లంగాలు: 2, యాలకలు: 2)

ఎండుమిర్చి – 1 (optional)

ఫ్లేవర్ కోసం (జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు) – 1/4 teaspoon

నెయ్యి – ½ TSP

నీళ్ళు – సరిపడా

కొత్తిమీర – గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:

1. ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

2. తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్‌లో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

4.ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి.

5. తర్వాత అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.

6. ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర మరియు కారం, సరిపడా నీళ్ళు పోయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి. తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది.

8. ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి. దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

9. బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకోవాలి.

10. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.

11. చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.

స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (52)

కావల్సిన పదార్థాలు:

ఫిష్ : 4 ముక్కలు

ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp

టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)

పచ్చిమిర్చి: 3 (తరిగినవి)

కారం: 1tsp

పసుపు: 1/2 tsp

జీలకర్ర పొడి: 1tsp

ధనియాల పొడి : 1 / 2tsp

సోంపు: 1/2 tsp

బిర్యానీ ఆకు 1

కొత్తిమీర: 2 కాడలు(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

నూనె: 3tbsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పసుపు మరియు ఉప్పు పట్టించి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత డీప్ బాటమ్ పాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో చేపముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. ఇలా ఫ్రై చేసుకొన్న చేపముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.

4. మిగిలిన నూనెలో బిర్యాని ఆకు, కలౌంజి(సోంపు) మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి.

5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2,3నిముషాలు వేగించుకోవాలి.

6. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.

7. వీటిన్నింటితో పాటు కారం, పసుపు, జీలకర్ర మరియు ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఫ్రై చేయాలి.

8. మసాలాలు రెండు మూడు నిముషాలు బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి కర్రీని బాగా ఉడికించాలి.

9. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకొన్న చేపముక్కలను వేసి మూత పెట్టి మరో 5 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ రెడీ.