Posts Tagged ‘vegetarian recipe’

బ్లాక్ ఫారెస్ట్ కేక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

d18ab2dd369a82c4bdcbd63ca08ae9cd

కావాల్సిన పదార్ధాలు:

కేక్ కోసం:

చాకొలేట్ కేక్ – 1

మెత్తని క్రీమ్ – 4 కప్పులు (బీట్ చేసింది)

కాన్ చెర్రీలు – 16 (ముక్కలుగా కట్ చేసినవి)

పంచదార సిరప్ కోసం :

పంచదార – ½ కప్పు

నీళ్ళు – ¾ వంతు కప్పు

అలంకరణకు:

చాక్లెట్ కర్ల్స్ – 1 ¼ కప్పు

కాండ్ చెర్రీలు – 10 (మొత్తం)

తయారుచేసే విధానం:

1. ఒక చాకొలేట్ కేక్ కొనండి. ఎగ్ లేనివి కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి. దాన్ని 3 పొరలుగా కట్ చేయండి. ఇప్పుడు, మీరు పంచదార సిరప్ ని తయారుచేసి అందులో ఈ కేక్ ని ముంచండి. ఒక గిన్నెను తీసుకుని అందులో నీరు, పంచదార వేయండి. పంచదార నీటిలో కరిగే వరకు మరగనివ్వండి.

2. ఫ్లేవర్ కలపడానికి, మీరు బ్రాందీ, రమ్ వంటి ఎటువంటి లిక్కర్ నైనా కలపొచ్చు. మరగనిచ్చి స్టవ్ ఆపేయండి. షుగర్ సిరప్ గది ఉష్ణోగ్రతకు వచ్చే దాకా చల్లారనివ్వండి. ఇప్పుడు, పెద్ద గిన్నె తీసుకుని, క్రీమ్ ని బాగా కలపడం మొదలుపెటండి. ఆ క్రీమ్ నురగగా, మృదువుగా అయ్యేవరకు కలపండి.

3. కేక్ స్టాండ్ తీసుకుని, దానిలో ఒక కేక్ లేయర్ పెట్టండి. ఇప్పుడు, దానిమీద పంచదార సిరప్ పోయండి, దానిమీద బీట్ చేసిన క్రీమ్ ని కూడా రాయండి.

4. కేక్ పొరల మీద క్రీమ్ ని బాగా మందంగా పూయండి. ఇప్పుడు, కేక్ లేయర్ మీద చేర్రీస్ పెట్టండి. మీరు చెర్రీ మొత్తాన్ని పెట్టొచ్చు లేదా ముక్కలుగా చేసి పెట్టొచ్చు.

5. రెండవ పోరని పెట్టండి, మళ్ళీ పైలాగే అప్లై చేయండి. అలాగే మూడవ పొరను కూడా పెట్టి పై విధానాన్ని అనుసరించండి. తరువాత, కేక్ మొత్తాన్ని క్రీమ్ తో కవర్ చేసి, మృదువుగా ఉండేట్టు చేయండి. చాకొలేట్ బర్ నుండి చాకొలేట్ కర్ల్స్ తయారుచేసి, కర్ల్స్ తో కేక్ అలంకరించి, చేర్రీస్ తో కేక్ ని అలంకరించండి.

6. కేక్ పక్కల వైపు చాకొలేట్ కర్ల్స్ పుల్లలు పెట్టడం మరవకండి. మీరు ఇంట్లో చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారైనట్టే.

7. దాన్ని కట్ చేసి, మీ అతిధులకు సర్వ్ చేయండి.

మేతి టమోటో రైస్ బాత్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

images

కావల్సిన పదార్థాలు:

టమోటోలు: 3 (chopped)

మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped)

అన్నం: 3 cups (cooked)

ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup

వెల్లుల్లి పేస్ట్: 2tsp

పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit)

పసుపు: 1tsp

కారం: 1tsp

జీలకర్ర: 1tsp

ధనియాలపొడి: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

జీలకర్ర: 1tsp

ఆవాలు: 1tsp

కరివేపాకు : రెండు రెమ్మలు

నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

2. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అందులో టమోటోలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో మెంతిఆకులు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకులు మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేసుకోవాలి.

6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి నిధానంగా మొత్తం మిశ్రం కలగలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

7. అంతే హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, మేతి టమోటో రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.

ఆలూ మసాలా ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (22)

కావల్సిన పదార్థాలు:

ఆలూ(బంగాళదుంపలు): 6

పచ్చిమిర్చి : 8-10

పసుపు: సరిపడా

జీలకర్ర: 2tbsp

ఆవనూనె: సరిపడా

కరివేపాకు రెబ్బలు: 2

ఎండుమిర్చి 3

ధనియాలపొడి: 2tsp

గరం మసాలా: 1tbsp

కొత్తిమీర: కొద్దిగా

ఉప్పు: రుచికి తగినంత

వెల్లుల్లి రెబ్బలు: 3

తయారుచేయు విధానం:

1. ముందుగా ఆలూని శుభ్రంగా కడిగి తొక్క తీసి సన్నగా…పొడవుగా కట్ చేసి నీళ్లలో వేసుకోవాలి.

2. తర్వాత పచ్చిమిర్చిని పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలూ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

4. తర్వాత అందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయాలి.

5. ఒక నిముషం తర్వాత తరిగిన ఆలూ వేసి మూత పెట్టేయాలి. ఆలూ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలపొడి వేయాలి.

6. కొద్దిసేపటికి ఆలూ ఉడికిన తర్వాత గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీరను చల్లాలి. అంతే ఆలూ మసాలా రెడీ. దీన్ని వైట్ రైస్ మరియు రొట్టెల్లోకి వడ్డిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download

కావల్సిన పదార్థాలు:

క్యారెట్ – 1 cup (Chopped)

ఉల్లిపాయలు -1 cup (Chopped)

క్యాప్సికమ్-1 cup (Chopped)

స్ప్రింగ్ ఆనియన్స్ – 1 cup (Chopped)

క్యాబేజ్ -1 cup (Chopped)

వెల్లుల్లి- 1/4 Teaspoon

అల్లం – 1/4 Teaspoon (Chopped)

కార్న్ ఫ్లోర్ – 3 Teaspoon

పెప్పర్ – 1/2 Teaspoon

లెమన్ జ్యూస్- 2 Teaspoon

వెజిటేబుల్ స్టాక్- 2 Cups(వెజిటేబుల్స్ ఉడకించిన నీళ్ళు)

నూనె: తగినంత

ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.

2. తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ మరియు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 10 నిముషాలు వేగించుకోవాలి.

3. వేజిటేబుల్స్ వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ పోయాలి.

4. ఇప్పుడు అందులోనే పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతన్నప్పుడు అందులో కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి.

6. తర్వాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలు, మీడియం మంట మీద ఉడికించాలి.

7. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ పెప్పర్ లెమన్ సూప్ రెడీ.

హెల్తీ బార్లీ పరోఠా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…డయాబెటిక్ వారికోసం…

images (79)

కావల్సిన పదార్థాలు:

బార్లీ పండి: 1/2cup

గోధుము పిండి: 3tbsp

ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)

వెల్లుల్లి పేస్ట్ : 1tsp

అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ : 1tsp

ఆలివ్ ఆయిల్ : tsp

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ఉల్లిపాయలను చాలా సన్నగా లేదా రఫ్ గా పేస్ట్ లాగా చేసుకుంటే, పిండి కలుపుకవడానికి సులభంగా ఉంటుంది.

2. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపండి, బార్లీ పిండి,సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్ల్లుల్లి పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి , అరచెంచా ఆలివ్ ఆయిల్ వేసి పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి .

3. ఇప్పుడు మొత్తం పిండి నుండి కొద్దికొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్ లాగా రోల్ చేసుకోవాలి. పరోఠాల్లా ఒత్తుకోవాలి

4. స్టౌ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వత్తుకొన్న పరోఠాను తవా మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

5. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకొని, తర్వాత ప్లేట్ లోకి మార్చుకోవాలి. అంతే రుచికరమైన బార్లీ పరోఠా రెడీ.

ఆలూ ఖీర్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం… స్వీట్ డిష్…

images (11)

కావల్సిన పదార్థాలు:

బంగాళదుంపలు: 2

నెయ్యి: 4 tsp

ఎండుద్రాక్ష- 25 gms

డ్రై ఫ్రూట్స్ – 25 gms

పాలు – 3 cups

పంచదార – 3/4 cup

యాలకలపొడి – ½ tsp

కుంకుమపువ్వు – కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా బంగాళదుంపల యొక్క తొక్క తొలగించి, వాటిని తురుముకోవాలి.

2. తర్వాత బంగాళదుంప తురుమును నీళ్ళలో వేసి స్టార్చ్‌ను తొలగించాలి.

3. కొద్దిసేపు బంగాళదుంప తురుమును నీటిలో నాననివ్వాలి.

4. పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత అందులో ద్రాక్ష, జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.  తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి.

5. ఇప్పుడు నీటిలో నుండి బంగాళదుంప తురుమును తీసి నీరు మొత్తం పిండివేయాలి. ఈ తురుమును పాన్‌లో వేసి రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. పాన్‌కు అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి. దీన్ని 5నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే పాలు పోసి ఉడికించుకోవాలి.

7. తర్వాత అందులో పంచదార, యాలకలు, ద్రాక్ష, మరియు డ్రై ఫ్రూట్స్‌ను పాన్‌లో వేసి మిక్స్ చేయాలి.

8. ఆ తర్వాత కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన పొటాటో ఖీర్ రెడీ.

పాలక్ చపాతీ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (1)

పాలకూర: 200grm

గోధుమపిండి: 2 cups

వెల్లుల్లి రెబ్బలు: 3-4

పచ్చిమిర్చి: 5-10

ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా కొన్ని పాలకూరను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు చిలకరించి బాయిల్ చేయాలి. ఆకుకూర మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.

2. 10 నిముషాల ఉడికించుకొన్న తర్వాత, మూత తీసి ఎక్సెస్ వాటర్‌ను తొలగించాలి. ఆకు కూర చల్లగా మారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. పాలకూరతో పాటు అల్లం మరియు పచ్చిమిర్చి కూడా వేసి నీళ్లు పోయకుండా పేస్ట్ చేయాలి.

4. ఇప్పుడు బౌల్ తీసుకొని, గోధుమపిండి, ఉప్పు వేసి మిక్స్ చేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి.

5. తర్వాత పిండిలోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఆకుకూరను కూడా వేసి మొత్తం పిండిని చపాతిల పిండిలా కలుపోవాలి. సరిపడేంత నీరు మాత్రమే వేసి కలుపుకోవాలి. 10నిముషాలు పక్కన పెట్టాలి.

6. 10 నిముషాల తర్వాత పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీల్లా రోల్ చేసుకోవాలి.

7. ఇలా అన్ని చపాతీలను చేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి చపాతీలను ఒక్కొక్కటి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే పాలక్ చపాతీ రెడీ.

8. ఈ చపాతీలను సర్వింగ్ ప్లేట్‌లోకి మార్చుకొని మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేయాలి.

పాలక్ పన్నీర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం…

maxresdefault

కావల్సిన పదార్థాలు:

తరిగిన పాలకూర: 1cup

పన్నీర్ తురుము: 1/2cup

తరిగిన ఉల్లిపాయలు: 1/2cup

వెల్లుల్లి పేస్ట్: 1/2tsp

అల్లం పేస్ట్: 2tsp

తరిగిన పచ్చిమిర్చి ముక్కలు: 2tsp

ఆలివ్ ఆయిల్: 2tsp

ధనియాలు: 1tsp

పంచదార: 1tsp

నిమ్మరసం: 2tsp

వేరుశెనగ: 2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ స్టౌమీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి కొన్ని నిముషాల పాటు వేగించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో పాలకూర తరుగును, పన్నీర్ తరుగును కూడా వేసి బాగా వేగించుకోవాలి.

2. అంతకంటే ముందు వేరుశనగలు వేయించి సిద్దంగా ఉంచుకోండి.

3. తర్వాత ఒక కప్పు పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ పంచదార, 1కప్పు పాలు, అర స్పూన్ ఈస్ట్, 1/2 ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకుని పిండి ముద్దను మూడు నాలుగు గంటల పాటు వదిలేయండి.

4. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న రోటీలా తయారుచేయండి.

5. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కర్రీని రోటీలో పెట్టి నాలుగు వైపులా మూసేసి మరిగే నూనెలో వేసి వేయించండి. అంతే తినడానికి పాలక్ పఫ్ రెడీ.

వంకాయ మరియు టమోటో రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

images (1)

కావల్సిన పదార్థాలు:

వంకాయ: 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

ఆయిల్ : ¼tsp

వెల్లుల్లి రెబ్బలు: 4- 5

టొమాటోస్ : 4 (సన్నగా తరిగినవి)

నీళ్ళు :1cup

కారం : 1 tbsp

దాల్చిన : చిన్నముక్క

బే ఆకు: 1

ఉప్పు : రుచికి సరిపడా

పసుపు పొడి :1tsp

జీలకర్ర పొడి : 1 tsp

గరం మసాలా పొడి : ½tsp

కొత్తిమిర : సన్నగా తరిగి పెట్టుకోవాలి

పచ్చిబఠానీలు : ½cup(ఉడికించినవి)

తయారుచేయు విధానం:

1. ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కొద్దిసేపు ఉండనిచ్చి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి.

2. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడిఅయ్యాక అందులో సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయముక్కలు మరియు వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. 10నిముషాల తర్వాత అందులో సన్నగా తరిగిన టమోటో, వంకాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫై చేయాలి. తర్వాత కొద్దిగా నీరు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా మరియు కొత్తిమీర తరుగు వేసి ,మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి, తర్వాత మూత పెట్టి 10నిముషాలు ఉడకనివ్వాలి.

4. పదినిముషాల తర్వాత మూత తీసి, అందులో ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠానీలను వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి అంతే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

గసగసాలతో స్వీట్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (4)

కావల్సిన పదార్థాలు:

గసగసాల : 100grms

చక్కెర: 1/2cup

పాలు: 2cups

నెయ్యి : 1/2cup

ఏలకులు : 4-5(పొడి చేసుకోవాలి)

బాదం: 5-6(గార్నిష్ చేయడానికి)

తయారుచేయు విధానం:

1. ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి, సన్నగా ఉన్న మట్టి, దుమ్మును తొలగించాలి. (చాలా చిన్నగా ఉండటం వల్ల కాఫీ ఫిల్టర్ లేదా కాఫీ స్ట్రెయినర్‌లో వేసి శుభ్రం చేయాలి)

2. తర్వాత నీరు పూర్తిగా కారిపోయే వరకూ అలాగే ఉంచాలి.

3. తర్వత స్టౌ మీద మంద పాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో గసగసాలు వేసి, తక్కువ మంట మీద అవి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ అలాగే ఉండనివ్వాలి.

4. ఇప్పుడు అందులో పాలు పోసి మరిగించాలి. అలాగే యాలకలపొడి వేసి మీడియం మంట మీద మొత్తం పాలు గట్టిగా ఇమిరిపోయే వరకూ మీడియం మంట మీద ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

5. పాలు బాగా మరుగుతున్నప్పుడే, అందులో షుగర్ కూడా జోడించి బాగా మిక్స్ చేయాలి. పాలు చిక్కబడి, గసగసాలతో కలిసిపోయి మొత్తగా ఉడికి హల్వ లా తయారైనప్పుడు బాదంతో గార్నిష్ చేయాలి.