Posts Tagged ‘vinegar’

స్పైసీ గోబీ మంచూరియన్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (10)

కావల్సిన పదార్థాలు:

కాలీఫ్లవర్: 1/2(మీడియం ఫ్లవర్, చిన్నచిన్న ఫ్లవర్స్ ను విడిపించుకోవాలి)

నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పిండి కలుపుకోవడం కోసం కావల్సిన పదార్థాలు:

మైదా: 5tbsp

కార్న్ స్టార్చ్: 3tbsp

ఉప్పు: రుచికి సరిపడా

బ్లాక్ పెప్పర్: 1/4tsp

నీళ్ళు: 1/4cup

చిరుధాన్యాలు: 2tbsp

సాస్ కోసం:

నూనె: 1tbsp

ఉల్లిపాయం 1/2(మీడియంది, సన్నగా తరిగిపెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 2-3(సన్నగా తరిగినవి)

వెల్లుల్లిపాయలు : 3 పెద్దవి

కెచప్: 2tbsp

రెడ్ చిల్లీ సాస్: 2tbsp

సోయాసాస్: 4tbsp

వైట్ వెనిగర్: 2tsp

నీళ్ళు: 4tbsp

కార్న్ స్టార్చ్: 2tsp

తయారుచేయు విధానం:

1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

2. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి 4-5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారగానే అందులో కెచప్ మరియు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి నూనె పైకి తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.

4. ఇప్పుడు అందులో సోయా సాస్ మరియు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

5. తర్వాత అందులో రెండు టీస్పూన్ల కార్న్ స్టార్చ్ నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

6. ఇప్పుడు ఈ సాస్ ను పక్కన పెట్టుకోవాలి.

7. తర్వాత పిండిని తయారుచేసుకోవాలి. మైదా, కార్న్ స్టార్చ్, ఉప్పు, బ్లాక్ పెప్పర్ మరియు నీళ్ళు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

8. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కాలీఫ్లవర్ ను వేసి డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

9. మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాస్ ను యాడ్ చేసి మిక్స్ చేయాలి.

10. మీడియం మంట మీద హీట్ చేయాలి. ఏమాత్రం తేమలేకుండా ఫ్రై చేయాలి. అంతే గోబీ మంచూరియన్ రెడీ.

వంటగదిలోని కత్తిని ఇలా శుభ్రపరచండి…

images (30)

1. సోప్: కత్తి వాడిన తర్వాత డిష్ వాష్ సోప్ ను కత్తిమీద రుద్ది, వేడినీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి. వేడినీళ్ళు వల్ల క్రిములు చాలా త్వరగా నశిస్తాయి. మరియు కత్తి మీద మరకలను శుభ్రపరుస్తుంది.

2. నిమ్మకాయ: బాగా మురికి పట్టిన కత్తిని నిమ్మరసంతో శుభ్రం చేయాలి. నిమ్మ ఉత్తమ క్లీనింగ్ ఏజెంట్, మరియు స్ట్రాంగ్ ఆరోమా వాసన కలిగి ఉంటుంది, కత్తి కార్నర్స్ లో మురికిని తొలగించడాని బాగా సహాయపడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసంను నీటిలో వేసి మరిగించి ఆనీటితో శుభ్రం చేయాలి.

3. వెనిగర్: వంటగది వస్తువైన కత్తిని శుభ్రం చేయడానికి ఇదొక ఉత్తమ చిట్కా. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి, కొద్ది సేపు నానబెట్టాలి. తర్వాత పాత టూత్ బ్రెష్ తో బాగా రుద్ది, తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

4. ఉడికించాలి: ప్లాస్టిక్ హ్యాండిల్ లేకుండా ఉంటే, వేడినీళ్ళలో వేసి, ఒక నిముషం ఉడికించాలి. వేడినీళ్ళు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మరకలను వదలగొడుతుంది . వేడినీళ్ళతో రుద్ది కడగడం వల్ల కత్తికి ఉన్న ఆయిల్ , జిడ్డు మరకలు తొలగిపోతాయి.

మిక్సర్ గ్రైండర్ ను శుభ్రం చేయడానికి చిట్కాలు…

 

download (2)

నిమ్మ తొక్క:

నిమ్మ కాయ నుండి నిమ్మరసంను పూర్తిగా పిండుకొన్న తర్వాత ఆ తొక్కను ఉపయోగించుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్ నుండి వచ్చే చెడు వాసనను తొలగించడానికి నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది. నిమ్మతొక్కతో మిక్సీ జార్ మీద బాగా రుద్ది 15నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల వాసనతొలగిపోతుంది.

మరకలను తొలగించే వెనిగర్ :

కొన్న వెజిటేబుల్స్ వల్ల మిక్సీ జార్ల మీద మొండి మరకలు ఏర్పడుతాయి. వీటిని తొలగించడానికి వెనిగర్ బాగా సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ మరియు నీళ్ళు మిక్స్ చేసి మిక్సర్ గ్రైండర్ లో పోసి రెండు సెకండ్లు అలాగే ఉంచి తర్వాత తిరిగా అదే పద్దతిని అనుసరించి తర్వాత మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి.

బేకింగ్ పౌడర్ :

కొద్దిగా నీళ్ళు తీసుకొని, బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను మిక్సర్ గ్రైండర్ , జార్లకు పట్టించి 15నిముషాలు అలాగే పక్కన పెట్టి, ఆతర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.

డిటర్జెంట్ లిక్విడ్:

ఒకటి లేదా రెండు చుక్కల డిటర్జెంట్ లిక్విడ్ ను మిక్సర్ గ్రైండర్ లో వేసి, కొద్దిగా నీటిని చిలకరించి రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. మిక్సర్ గ్రైండర్ శుభ్రం చేయడానికి ఇది కూడా ఒక ఉత్తమ మార్గం.

దుస్తులపై టీ మరకలను తొలగించడానికి చిట్కాలు…

images (13)

1.వేడి నీళ్ళు : మరకలు పడ్డ ప్రదేశంలో వెంటనే వేడినీళ్ళను పోయాలి. ఇలా చేయండం వల్ల టీ లోని ఫైబర్ తొలగిపోతుంది. దాంతో మరక తేలిక పడుతుంది.

2. వెనిగర్ గ్రేట్ స్ట్రెయిన్ రిమూవర్ : కొన్ని కప్పుల నీటిలో ఒకటి రెండు స్పూన్ల వెనిగర్ ను మిక్స్ చేసి మరకలు పడ్డ ప్రదేశంలో నేరుగా స్ప్రే చేయాలి . తర్వాత చేత్తో బాగా రబ్ చేసి శుభ్రం చేస్తే టీ మరక తొలగిపోతుంది.

3. కాటన్ ఫ్యాబ్రిక్ మీద పడ్డ టీ మరకలను తొలగించడానికి కొంచెం బేకింగ్ సోడాను చిలకరించి రెండు చేతులతో బాగా రబ్ చేసి కొంత సమయం అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయడం వల్ల టీ మరకలు మాయం అవుతాయి.

4. గుడ్డులోని పచ్చసొనను గిలకొట్టి తర్వాత టీ స్పూన్ తో మరకలు పడ్డ ప్రదేశంలో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత ట్యాప్ క్రింద రన్నింగ్ వాటర్ తో శుభ్రం చేయాలి. కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ మరక అలాగే ఉన్నట్లైతే మరో సారి ఇలానే ప్రయత్నించండి.

5. టూత్ పేస్ట్ : టీ మరకలు పడిన వెంటనే తొలగించాలంటే టూత్ పేస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టీ మరకలు పడిన చోట కొద్దిగా టూత్ పేస్ట్ ను రుద్ది తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రం చేయాలి.

కరకరలాడే ఫిష్ కబాబ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…

download (11)

కావల్సిన పదార్థాలు:

చేపలు: 500grms

శెనగపప్పు: 4tbsp

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp

ఉల్లిపాయ పేస్ట్ : 2tbsp

వెనిగర్: 2tsp

ఉప్పు: రుచికి సరిపడా

శెనగపిండి: 4tbsp

నూనె: 2tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ చేపముక్కలను కొద్దిగా నీళ్ళు వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి.

2. పది నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత లోపలి ముళ్ళను తొలగించి చేత్తో మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.

3. తర్వాత శెనగపప్పును రఫ్‌గా పొడి చేసుకొని రఫ్‌గానే పేస్ట్‌లా చేసుకోవాలి.

4. ఇ ప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకొన్న చేపలను మిక్సింగ్ బౌల్లో వేసి, అందులో శెనగపిండి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్ మరియు వెనిగర్ వేయాలి.

5. మొత్తం పదార్థాలన్నింటిని కలగలిసేలా బాగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం నుండి 5నుండి 6 సమభాగాలుగా చేసుకోవాలి. ఒక్కోక్క బాగాన్ని అరచేతిలో పెట్టుకొని కట్‌లెట్‌గా ఒత్తి పెట్టుకోవాలి.

6. ఇప్పుడు శెనగిపిండిలో కొద్దిగా నీళ్ళు పోసి చిక్కటి పేస్ట్‌గా కలుపుకోవాలి.

7. ఇప్పుడు కట్‌లెట్ కబాబ్‌ను శెనగపిండిలో డిప్ చేయాలి.

8. అంతలోపు స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో కబాబ్‌లను వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే క్రిస్పీ మరియు హెల్తీ ఫిష్ కబాబ్ రెడీ. రంజాన్ స్పెషల్‌గా ఈ ఫిష్ కబాబ్‌ను సర్వ్ చేయండి.

రాగి పాత్రలను తళతళ మెరిపించే సులభ చిట్కాలు…

images (77)

1. వెనిగర్ మరియు సాల్ట్: కాపర్ వెజల్స్ ను శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది . కాపర్ పాత్రల మీద కొద్దిగా వెనిగర్ ఉప్పు చిలకరించి బాగా రుద్ది, తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. నిమ్మరసం : నిమ్మతొక్క తీసుకొని కాపర్ వస్తువుల మీద బాగా రుద్దాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల రాగి వస్తువులు కొత్తవాటిలా మెరుస్తుంటాయి.

3. బేకింగ్ సోడ: బేకింగ్ సోడా చలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కాపర్ వస్తువులను శుభ్రం చేయడానికి దీన్ని ఎప్పుడూ టాప్ లిస్ట్ లో ఎంపిక చేసుకోవాలి . మీరు నిమ్మరసం బేకింగ్ సోడా కాంబినేష్ ఎంపిక చేసుకోవచ్చు. లేదా నేరుగా బేకింగ్ సోడాను మాత్రమే ఎంపిక చేసుకొని రాగి వస్తువులను శుభ్రం చేయాలి.

 

ఫ్లోర్ ను శుభ్రపరిచే క్లీనింగ్ ఏజెంట్ పంచదార…

download (13)

షుగర్ మరియు వెనిగర్: ఫ్లోర్ (మొజాయిక్ లేదా ఉడెన్ ) మీద పడ్డ మరకలను తొలగించడానికి పంచదార బాగా సహాయపడుతుంది ఒక బౌల్లో 4 చెంచాల వెనిగర్ తీసుకొని అందులో పంచదార మిక్స్ చేయాలి. ఇందులో కాటన్ బాల్ ను డిప్ చేసి మరకలున్న ప్రదేశంలో వేసి రుద్దితే మరకలు మాయం అవుతాయి. ఈ హోం క్లీనింగ్ చిట్కా వల్ల కొత్తగా ఏర్పడ్డ మరకలు కూడా తొలగిపోతాయి…

ఉడెన్ ఫ్లోర్‌ను శుభ్రం చేయడానికి సులభ మార్గం…

download (40)

ఆలివ్ ఆయిల్, ఫ్లోర్‌ను మరింత డర్టీగా మార్చుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మాప్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్‌గా ఫీలవుతారు. మీకు ఉడెన్ ఫ్లోర్ ఉన్నట్లైతే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా లిక్విడ్ డిష్ సోప్, వార్మ్ వాటర్, నిమ్మరసం మరియు వెనిగర్ వేసి ఉడెన్ ఫ్లోర్‌ను క్లీన్ చేయాలి.

కిటికీలను శుభ్రపరచడానికి సులభ మార్గం…

download (28)

బకెట్ వేడినీటిలో అరకప్పు వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న గంజి కలపాలి. దాంతో కిటికీలను తుడిస్తే కొత్తవాటిలా కనిపిస్తాయి.

మీ ఇంటిని సువాసనభరితం చేసే హోం మేడ్ టిప్స్…

download (5)

బేకింగ్ సోడా: సెట్ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ లేదా రోజ్ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఇంట్లో అక్కడక్కడ పెడితే మంచి వాసన వస్తుంది.

వెనిగర్: వైట్ వెనిగర్ వెనిగర్-నీళ్ళు సరిసమానంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి, ఇంట్లో డైరెక్ట్ గా స్ప్రే చేయాలి. లేదా ఫ్యాన్ మీద లేదా ఏయిర్ కండీషనర్ మీద కూడా స్ప్రే చేయవచ్చు. ఇది మీకు తాజా సువాసనను అందంగా అంధిస్తుంది.

నిమ్మరసం: నిమ్మరసాన్ని నేచురల్ రూమ్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తుంటారు. ఇది ఇంట్లో కొద్దిగా ట్యాంగీ టేస్ట్ ను కలిగి ఉంటుంది.