Posts Tagged ‘vitamin D’

విటమిన్‌ ”డి” లోపం వలన క్యాన్సర్‌…!

images
ముఖ్యంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీంతో శరీరానికి విటమిన్ ”డి” అందడం లేదు. ఈ కారణంగా అనేక విధాలైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా విటమిన్‌ ”డి” లోపంతో క్యాన్సర్‌, గుండె జబ్బులు, షుగర్‌, మానసిక జబ్బులు, కీళ్లనొప్పులు వస్తాయి. విటమిన్‌ ”డి” ని మందుల రూపంలో తీసుకునే దానికన్నా  సహజసిద్ధంగానే ఎండ ద్వారానే సమకూర్చుకోవడం మంచిది. కనుక ప్రతి రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు అయినా సూర్య రశ్మి తగిలే విధంగా ఉండడం శరీరానికి అవసరం.

పంటి ఆరోగ్యానికి క్యాల్షియం… ఎటువంటి ఆహారంలో ఉంటుంది?

images

ఎముకల సాంద్రత పెంచడం నుంచీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా రోజూ క్యాల్షియం అందేలా చూసుకోవాలి. ఫలితంగా ఏళ్లు గడిచేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే సమస్య చాలా మటుకూ తగ్గుతుంది. పైగా ఈ పోషకం కండరాలనే కాదు, నాడీవ్యవస్థను కూడా దృఢంగా ఉంచుతుంది.

టైపు2 మధుమేహం రాకుండా జాగ్రత్తపడాలంటే క్యాల్షియంతోపాటూ, విటమిన్ ‘డి’ పోషకాన్ని కూడా తీసుకుంటే సరిపోతుంది. ఈ పోషకం కేవలం పాలు, పాల ఉత్పత్తుల నుంచే కాదు చేపలూ, సోయాబీన్స్, నువ్వులూ, నట్స్, పప్పులూ, ఆకుకూర నుంచి లభిస్తుంది.

గర్భంతో ఉన్నారా?… D విటమిన్ తప్పకుండా అవసరం…

pregnant_woman_eating
గర్భంతో ఉండే తల్లులు చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కటి ఆరోగ్యంతో పెరుగుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు విటమిన్‌ ‘డి’ని ఎక్కువగా తీసుకోవాలని, దీనివల్ల పుట్టబోయే బిడ్డలు కూడా చక్కగా ఎముకల పటుత్వంతో పుడతారని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం జరుగుతుంది.
శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో గర్భిణుల శరీరంలో విటమిన్‌ డి గనుక పుష్కలంగా ఉంటే వారికి పుట్టే పిల్లలు కూడా చక్కటి ఎముకల పటుత్వాన్ని కలిగి ఉంటారని తేలింది. తల్లి శరీరంలో విటమిన్‌ డి పరిమాణం తక్కువగా ఉంటే వారికి పుట్టే పిల్లలు దుర్భలమైన ఎముకలు, కండరాలను కలిగివుంటారని ఈ పరిశోధనలో తేలింది.
అయితే గర్భంతో ఉన్న తల్లుల శరీరంలోని విటమిన్‌ డి స్థాయులకు, పుట్టిన తర్వాత పిల్లల్లో పటుత్వానికి మధ్య సంబంధం ఏమిటి? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పరిశోధకులు అంటున్నారు.

విటమిన్ డి లోపాన్ని గుర్తించే లక్షణాలు…

images (4)

కండరాల బలహీనత: ఎలాంటి కారణం లేకుండా కండరాల పరిమాణం తగ్గడం, అనవసరంగా నొప్పిగా అనిపించడం విటమిన్ డి లోపానికి సంకేతం. నాడీ కణాలకు సరిగా విటమిన్ డి అందనప్పుడు అలాంటి సమస్య మొదలవుతుంది.

డిప్రెషన్: విటమిన్ డి లోపిస్తే డిప్రెషన్ వేధిస్తుంది. అనవసరంగా డిప్రెషన్ కు లోనవడం, చిన్న విషయానికి ఎక్కువగా చింతించడం వంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి.

నొప్పి: ఎక్కువగా నొప్పులకు గురవుతున్నారంటే జాగ్రత్త వహించడం మంచిది. ఎన్ని రోజులైనా.. తలనొప్పి, కండరాల నొప్పి వంటివి తగ్గడం లేదంటే.. ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

ఎముకలు: విటమిన్ డి కి ఎముకల ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధముంది. విటమిన్ డి లోపిస్తే.. ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.

బీపీ: విటమిన్ డీ లోపిస్తే.. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. గుండె ఆరోగ్యంలో విటమిన్ డి ప్రధానం. ఒక వేళ బీపీ పెరిగిందని అనిపించినా.. చిన్న విషయాలకూ చిరాకు పడుతున్నా.. విటమిన్ డిపై శ్రద్ధ వహించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్త పడాలి.

చిరాకు: చీటికి మాటికి చిరాకులకు, కోపానికి గురవుతున్నారా.. అయితే మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. విటమిన్ డి లోపిస్తే.. మెదడులో మానసిక ఒడిదుడులపైపై ప్రభావం పడుతుంది.