Posts Tagged ‘winter’

ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చెయ్యాలో చూద్దామా… వింటర్ స్పెషల్ స్నాక్…

20130416-152841

కావాల్సిన పదార్ధాలు:

ఉల్లిపాయలు-5(విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి)

నూనె-వేయించడానికి సరిపడినంత

కారం-1 టీ స్పూను

మైదా-1 1/2 కప్పు

ఎండబెట్టిన మిక్స్డ్ హెర్బ్స్-1 టీ స్పూను

త్రాగే సోడా-2 కప్పులు

ఉప్పు-రుచికి సరిపడా

ఉల్లిపాయ పొడి-1 టీ స్పూను

మిరియాలు-1/2 టీ స్పూను(మెత్తగా దంచుకోవాలి)

బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పూ

ఆవ పొడి-1/2 టీ స్పూను

కారంఫ్లేక్స్-1/2 కప్పు(మెత్తగా పొడి చేసుకోవాలి)

కొత్తిమీర-1 టేబుల్ స్పూను(సన్నగా తరగాలి)

తయారీ విధానం:

1. ఉల్లిపాయలని విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలని 15 నిమిషాలపాటు చల్లని నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిలోనుండీ తీసి కిచెన్ టవల్ మీద ఆరబెట్టాలి. ఆరిన తరువాత ఒక ప్లేటులోకి మార్చి వీటి మీద పిండిని చల్లాలి. అందువల్ల ఎక్కువగా ఉన్న తేమని పిండి పీల్చుకుంటుంది.

2. ఒక పెద్ద గిన్నెలో మైదా, కారం, మిక్స్డ్ హెర్బ్స్, ఉల్లి పొడి, ఆవ పొడి, మిరియాలు, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపాలి.

3. ఈ పిండికి సోడా పోసి ఈ మిశ్రమం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా చిక్కగా ఉండకూడదు. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలపాలి.

4. ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ పొడి, బ్రెడ్ పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి.

6. పొరలు పొరలుగా తరిగిన ఉల్లిపాయలని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ , కార్న్ ఫ్లేక్స్ పొడిలో దొర్లించి ఉల్లిపాయలకి బ్రెడ్ పొడి బాగా పట్టేటట్లు చూడాలి.

7. ఇలా బ్రెడ్ పొడిలో దొర్లించిన ఉల్లిపాయలని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.

8. వేగాకా నూనెలో నుండి తీసి కిచన్ టవల్ మీద వేస్తే ఆనియన్ రింగ్స్‌లో ఉన్న అధిక నూనెని పీల్చుకుంటుంది.

వింటర్లో బ్లాక్ గా మారిన చర్మాన్ని, తిరిగి ఓరిజినల్ స్కిన్ టోన్ గా మార్చే హోం రెమెడీస్…

images (1)

పసుపు: పసుపును, పాలతో మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత, సున్నితంగా మర్ధన చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, రేడియంట్ స్కిన్ పొందుతారు. ఈ కాంబినేషన్ ప్యాక్ లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని మలినాలను తొలగిస్తాయి.

శెనగపిండి: శెనగపిండిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేసి,పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మెడకు అప్లై చేసి, సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఫెయిర్ స్కిన్ అందిస్తుంది.
తేనె: తేనె నేచురల్ పదార్థం. ఇది చర్మానికి ఎక్స్ఫోలయేటర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను గ్రేట్ గా నివారిస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.
గుడ్డు: గుడ్డు పీల్ మాస్క్ గా ఉపయోగపడుతుంది. ఎగ్ వైట్ ను తీసుకుని, ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల, చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మలినాలు తొలగిపోయి, చర్మం ఫ్రెష్ గా బ్రైట్ గా..రేడియంట్ గా మారుతుంది. చర్మానికి పూర్తిగా మాయిశ్చరైజర్ అందుతుంది.

పాలు: పాలలో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంను లైట్ గా మార్చుతుంది. నార్మల్ స్కిన్ ఉన్న వారు కూడా, పాలను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. వింటర్లో ఫెయిన్ స్కిన్ పొందాలంటే పాలను ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగించుకోవచ్చు.

పాల మీగడ(మిల్క్ క్రీమ్): డ్రై స్కిన్ తో బాధపడే వారు, మిల్క్ క్రీమ్ ను మాయిశ్చరైజర్ గా ఉపయోగించుకోవచ్చు. మిల్క్ క్రీమ్(వెన్న , లేదా పాల మీగడ )తీసుకుని ముఖానికి అప్లై చేసి మర్ధన చేసుకోవాలి.

శీతాకాలంలో చర్మానికి మేలు జరగాలంటే.. నీరు ఎక్కువగా తాగాలి

 bb2413973cd4b60447725267fa4a7bc9
చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా… తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మంచినీళ్లు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే దాహం కాకపోయినా నీరు సేవిస్తూనే ఉండాలి.
ఇక శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. శీతాకాలంలో నువ్వుల నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకోవాలి. ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది. చలికాలంలో వచ్చే పగుళ్ళకు వేజలిన్‌ వాడటం ఉత్తమం. సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా చేతులకు, కాళ్ళకు మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ రాసుకోవాలి. వారానికి ఒకసారైనా వేడి చేసిన కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకోవడం మంచిది.

శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు…

hair-care-1462281545

తరచూ తలస్నానం చేయకూడదు: కొందరు రోజూ తలస్నానం చేస్తే మరికొందరు వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తుంటారు. శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా వారానికి రెండు స్లారు చేస్తే సరిపోతుంది. అలాగే తలస్నానానికి ఉపయోగించే షాంపు కూడా మీ శిరోజాలకు సరిపడినదై ఉండాలి.

కండీషనర్: తలస్నానానికి ముందు జుట్టుకు కండీషనర్ (ఫ్రీవాష్ కండీషనర్స్ )తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. షాంపులో ఉండే రసాయనాల ప్రభావం కూడా జుట్టుపై అంతగా ఉండదు.

వేడినీటి స్నానం తగదు: శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, వేడినీటితో స్నానం చేయాలనిపించడం సహజం. అయితే స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువగా వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి.

హెయిర్ డ్రయ్యర్స్ ఉపయోగించకపోవడం మంచిది: శీతాకాలంలో వేడి నీటి స్నానం ఎలా తగదో అలాగే జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్ స్ట్రెయిటనర్స్ మొదలగున వాటికి దూరంగా ఉండాలి. టవల్ తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. అలాగే కండీషనర్ పెట్టుకున తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్ ను తలకు చుట్టుకున్నా కుదుళ్లకు మంచి పోషణ అంది బలం చేకూరుతుంది.

హెయిర్ ఆయిల్ వద్దు: చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెన కూడా సరైనది ఎంపిక చేసుకోవాలి. పళ్లు కాస్త దూరంగా, వెడల్పుగా ఉన్నవైతే మంచిది.

అట్ట కట్టినట్టు ఉంటే: చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని కూడా కవర్ చేసేలా స్కార్ఫ్, టోపి ఇలా ఏదో ఒకటి విధంగా ధరించాలి. ఒక వేళ బయట ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురైతే మీ దగ్గర ఉన్న బాడీలోషన్ కొద్దిగా తీసుకుని చేతులకూ రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతుల మధ్య జుట్టు ఉంచి మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల శిరోజాల పెళుసుదనం పోయి, ప్రకాశవంతంగా మారుతాయి.

జుట్టు రాలకుండా:

ఒక అరటి పండు తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నుండి 25 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరెవెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అరటిపండులోని గుణాల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

నిమ్మతో కేవలం చుండ్రు దూరం కావడమే కాదు, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. నిమ్మరసాన్ని తలకు పట్టించవచ్చు లేదా ఏదైనా హెయిర్ మాస్క్ కు జత చేయవచ్చు. లేదంటే కొద్దిగా పెరుగు తీసుకుని అందులోని కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా సమస్య కు మంచి పరిష్కారం లభిస్తుంది.

వింటర్లో బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి సులభ మార్గం…

images (56)

ఆరెంజ్‌ను తొక్కతో సహా మిక్సీలో వేయాలి. అలాగే నిమ్మను కూడా వేసి, అందులోనే 3 చెంచాల సిట్రస్ పౌడర్, 5 చెంచాల కోల్డ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి, ఈ పేస్ట్‌ను చర్మానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి, చర్మం బేబీ స్కిన్‌లా సాఫ్ట్‌గా మారుతుంది.

వింటర్‌లో మేకప్ చేసుకోవడానికి కొన్నిచిట్కాలు…

images (15)

శీతాకాలంలో మేకప్ కొద్దిగా మారుతుంది. ఇక్కడ శీతాకాలంలో మేకప్ ఎలా చేసుకోవాలో తెలిపే కొన్ని చిట్కాలు…

1. తేమగా మరియు శుభ్రంగా ఉంచుకోవటం: మీ చర్మం శుభ్రత మరియు స్వచ్ఛత కోసం మీరు చర్మాన్ని ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా(తేమగా) ఉంచుకోవాలి. దీనివలన మీ చర్మం పొడిగా ఉంటుంది మరియు బిరుసుతనం నివారించుకోవచ్చు. మీ చర్మం సున్నితంగా, మృదువుగా ఉండటం వలన మీరు ప్రకాశవంతంగా కనపడతారు.

2. బేస్ లేదా ఫౌండేషను: మీ చర్మం ఏ రంగులో ఉందో దానికి తగ్గట్లుగా ఫౌండేషన్ క్రీంని ఎంచుకోండి మరియు వాటిని బాగా కలపండి. ఒక్క రంగును ఉపయోగించే బదులు మీ చర్మరంగుకు సరిపోయే రెండు రంగులను బాగా కలిపి ప్రయత్నించండి.

3. కళ్ళు: మీ కళ్ళకు శీతాకాలంలో బంగారపు లేదా మెటాలిక్ షేడ్స్ వాడితే, తటస్థంగా ఉండి ఇంకా క్లాస్సిగా కనపడతాయి. తప్పనిసరిగా కోల్, లైనర్ మరియు మస్కారా ఉపయోగించండి.

4. పెదాలు: శీతాకాలంలో మనము నిగనిగలాడే పెదవులు నిర్వహించుకోవచ్చు. లిప్ బామ్ ఉపయోగించటం వలన పెదాలు పగలటాన్ని నివారించుకోవచ్చు. శీతాకాలంలో ముదురు రంగులు, పెదాలకు ఉపయోగించటం వలన మీ ముఖం ప్రకాశవంతంగా కనపడుతుంది.

5. కేశాలంకరణ: జుట్టు మరియు చర్మం, రెండింటికి శీతాకాలంలో మరింత శ్రద్ధ అవసరం. కాబట్టి వేడి నీటికి బదులు గోరువెచ్చని నీటిని వాడండి. మరియు ఎల్లప్పుడూ మీ జుట్టుకు కండిషన్ చేయండి. పొడిగా ఉండే కాలం కాబట్టి మీ జుట్టుకు ఆయిల్ పట్టించండి.

శీతాకాలంలో అలర్జీలకు ఆయుర్వేదంతో చెక్…

download (15)

ఆహారం తీసుకోవడం తగ్గించాలి: వింటర్ సీజన్లో తరచూ అలర్జీలకు కారణం అవుతుంటే లేదా నిరంతరం దగ్గు, జలుబు ఉంటే ఆహారం లిమిట్‌గా తీసుకోవాలి. ఆయుర్వేదంలో, ఈ టెక్నిక్‌ను లఘనాన్ థెరఫీ అని పిలుస్తారు. ఫుడ్ క్వాంటిటీని తగ్గించడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది పిత్తదోశాన్ని పెంచుతుంది. దాంతో శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి కలిగి ఉన్నట్లు కనబడుతుంది.

– జీర్ణక్రియకు కష్టమైన ఆహారాలకు దూరంగా ఉండాలి: చలికాలంలో మాంసాహారం, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కోలా, సోడా వంటి ఏరియోటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. లేదా పరిమితంగా తీసుకోవాలి.

గోరువెచ్చని నీటిని త్రాగాలి: వింటర్లో జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి గోరువెచ్చని నీరు గ్రేట్‌గా సహాయపడుతాయి. ఇవి కఫదోశాన్ని నివారిస్తాయి. కఫం అసమతుల్యత వల్ల జలుబు మరియు దగ్గుకు కారణం అవుతుంది.

మసాలాలను జోడించాలి: మసాలాలలో, అల్లం పౌడర్, పసుపు, బ్లాక్ పెప్పర్, దాల్చిన చెక్క, యాలకలు, మరియు కరివేపాకు ప్రతి ఒక్క మసాలా దినుసులను 1గ్రాము తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు వింటర్లో వచ్చే అలర్జీలు, దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తాయి.

వింటర్లో ’ఏసి’ వాడకంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్…

images (94)

– ఆస్తమా: వింటర్ సీజన్‌లో, ఏసిని ఉపయోగించడం వల్ల ఆస్తమా లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి. కాబట్టి, వింటర్లో తరచూ ఏసిని ఆన్ చేయడం అంత మంచిది కాదు.

– అలర్జీలు: వింటర్ సీజన్‌లో డస్ట్ చేరడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏసి గదుల్లో మరింత ఎక్కువగా చేరుతుంది. దాంతో ఏసి ఆన్ చేసినప్పుడు డస్ట్ గది మొత్తం వ్యాప్తి చెందేలా చేస్తుంది. అందువల్ల వింటర్లో ఏసిను ఉపయోగించడం వల్ల అనేక రకాల అలర్జీలకు గురికావల్సివస్తుంది.

– ఇన్ఫెక్షన్స్: వింటర్ సీజన్‌లో ‘ఏసి’లను వాడటం వల్ల ఇండోర్ పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ కారణం చేత గదుల్లో బ్యాక్టీరియా, ఫంగస్ మరియు వైరస్‌లు పెరుగుతాయి. సెంట్రల్ ఎయిర్ యూనిట్ ఉన్నట్లైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ యూనిట్ బయట నుండి ఫ్రెష్ ఎయిర్‌ను గదుల్లోకి ఎప్పటికీ తీసుకురాలేదు. అందువల్ల బ్యాక్టీరియా మరియు ఫంగస్ గ్రోత్‌కు ఏసి కండీషనర్స్ మరింత అనువుగా పనిచేసి, వాటిని విస్తరింప చేస్తాయి.

– డీహైడ్రేషన్‌: వింటర్ సీజన్లో గదుల్లోని ఏసిల యొక్క టెంపరేచర్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఏక్కువ సమయం ఏసి సెట్టింగ్‌ను ఉపయోగించడం వల్ల అది క్రమంగా డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. వింటర్ సీజన్లో ఏసిని ఉపయోగించడం వల్ల ఇది ఒక సీరియస్ హెల్త్ ఎఫెక్ట్‌గా గుర్తించాలి. కాబట్టి ముందుగానే అవసరం అయిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చిట్కాలు…

images (70)

– ఉల్లిపాయలు: యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే సల్ఫర్ నాసల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూస్తుంది. పచ్చి ఉల్లిపాయ తిని, ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

– కారంపొడి: సైనస్ నుంచి ఉపశమనం పొందడానికి కారంపొడిని కూడా ఉపయోగించవచ్చు. ముక్కులో వచ్చే ఫ్లమ్ ని తగ్గించడానికి, మున్ముందు ఏర్పడకుండా తగ్గించడానికి కారం చాలా పర్ ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కారం పొడిని ఆహారంలో కలుపుకుని తీసుకోవాలి.

– వెల్లుల్లి: ముక్కులో వచ్చే ఫ్లమ్ తో వెల్లుల్లి చక్కగా పోరాడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. అలాగే క్రోనిక్ సైన సైటిస్ సమస్యలను కూడా ఇది అరికడుతుంది.

శీతాకాలంలో వేధించే అలర్జీ సమస్యలకు సులభ చిట్కాలు…

download (29)

– శరీరంను పూర్తిగా కప్పి ఉంచుకోవాలి: శీతాకాలంలో శరీరం అతి తక్కువ ఉష్ణోగ్రతకు గురిఅవుతుంది. వివిధ రకాల వైరస్, ఫంగస్ లకు ఆహ్వానం పలికినట్లే.. ఇది వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతుంది దాంతో వివిధ రకాల సీజనల్ అలర్జీలకు కారణం అవుతుంది. వీటిని నివారించాలంటే శరీరం మొత్తాన్ని కవర్ అయ్యేలా వెచ్చగా కప్పి ఉంచుకోవాలి.

– ఇండోర్ ఎన్విరాన్ మెంట్: ఇంట్లో వాతావరణం వెచ్చగా ఉంచుకోవాలి. వింటర్లో రూమ్ మీటర్స్, హుమిడిఫైయర్స్ ను ఉపయోగించుకోవాలి. గదులను హాట్ గా, వేడిగా ఉంచుకోవాలి. వైరస్ నుండి రక్షణ పొందడానికి ఇది ఒక గ్రేట్ మార్గం.

– హెల్తీ ఫుడ్స్: హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు. దాంతో వివిధ రకాల వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలర్జీలకు దూరంగా ఉండవచ్చు.

– కార్పెట్ మరియు మ్యాట్రస్ ను క్లీన్ గా ఉంచుకోవాలి: వేసవికాలం కంటే చలికాలంలో బ్యాక్టీరియ, వైరస్ చేరే అవకాశం ఎక్కువ కనుకు మ్యాట్రస్ మరియు కార్పెట్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. దాంతో మేజర్ గా వచ్చే అలర్జీలనుండి తప్పించుకోవచ్చు.

– పెట్ కేర్: అలర్జీలకు మరో ప్రధాన కారణం పెంపుడు జంతువులు, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా అలర్జీలకు గురిఅవుతుంటారు కాబట్టి పెట్స్ రూమ్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి.